కంటోన్మెంట్‌లో మూసివేసిన రోడ్ల‌ను తెర‌వాలి: కేటీఆర్

సికింద్రాబాద్ కంటోన్మెంట్ ప్రాంతంలో మూసివేసిన రోడ్ల‌ను తెర‌వాల‌ని రాష్ట్ర మంత్రి కేటీ రామారావు కేంద్ర ప్ర‌భుత్వాన్ని కోరారు. ఈమేర‌కు కేంద్ర ర‌క్ష‌ణ‌శాఖ మంత్రి రాజ‌నా‌థ్‌సింగ్‌కు కేటీఆర్ లేఖ‌ రాశారు.

కంటోన్మెంట్‌లో మూసివేసిన రోడ్ల‌ను తెర‌వాలి: కేటీఆర్
Follow us
Balaraju Goud

|

Updated on: Aug 16, 2020 | 4:36 PM

సికింద్రాబాద్ కంటోన్మెంట్ ప్రాంతంలో మూసివేసిన రోడ్ల‌ను తెర‌వాల‌ని రాష్ట్ర మంత్రి కేటీ రామారావు కేంద్ర ప్ర‌భుత్వాన్ని కోరారు. ఈమేర‌కు కేంద్ర ర‌క్ష‌ణ‌శాఖ మంత్రి రాజ‌నా‌థ్‌సింగ్‌కు కేటీఆర్ లేఖ‌ రాశారు. కంటోన్మెంట్ ప్రాంతంలో రోడ్లు మూసివేయడం వ‌ల్ల హైద‌రాబాద్ ప్ర‌జ‌లు రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ప‌డుతున్నార‌ని లేఖ‌లో పేర్కొన్నారు. సైనికాధికారులు మున్సిప‌ల్ ప్రొటోకాల్‌ను పాటించ‌డం లేద‌ని పేర్కొన్నారు.

సికింద్రాబాద్‌ పరిధి కంటోన్మెంట్‌లోని ఆర్మీ రహదారులపై మళ్లీ ఆంక్షలు విధిస్తున్న నగరవాసులకు ఇబ్బందులకు గురిచేస్తున్నారు. ఏవోసీ రోడ్లపై తరుచూ సాధారణ పౌరుల రాకపోకలను నిషేధిస్తున్నారు. రక్షణశాఖ అధికారులు అంతర్గత రోడ్లను మూసివేయడంతో ఆ రోడ్లతో లింక్‌ ఉన్న న్యూ గాంధీనగర్‌, శక్తినగర్‌, రామకృష్ణాపురం, మల్కాజిగిరి, సఫిల్‌గూడ ప్రాంతాలకు వెళ్లాల్సిన రాకపోకలు తెగిపోయాయి. దీనికి సంబంధించి లోకల్‌ మిలిటరీ అధికారులు గేట్ల ఏర్పాటు చేశారు. ఫలితంగా సామాన్యులు తమ గమ్యస్థానాలు చేరుకునేందుకు నాలుగైదు కిలోమీటర్లు చుట్టూరా తిరిగి వెళ్లాల్సి వస్తుంది. ప్రజల అసౌకర్యాన్ని దృష్టిలో పెట్టుకుని రహదారులపై అంక్షలను వెంటనే తొలగించేలా చర్యలు తీసుకోవాలంటూ మంత్రి కేటీఆర్ కేంద్ర రక్షణ శాఖకు లేఖ రాశారు.

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!