సంచలన ఫీట్ అందుకున్న ‘నీలి నీలి ఆకాశం’ సాంగ్
ఇటీవలి కాలంలో హిట్టైన సాంగ్స్‌లో 'నీలి నీలి ఆకాశం.. ఇద్దామనుకున్నా' సాంగ్ పక్కాగా ఉంటుంది. యువత అంతా ఇప్పడు ఈ సాంగ్‌ని ఎంజాయ్ చేస్తూ ఉర్రూతలూగుతుంది.
ఇటీవలి కాలంలో హిట్టైన సాంగ్స్‌లో ‘నీలి నీలి ఆకాశం.. ఇద్దామనుకున్నా’ సాంగ్ పక్కాగా ఉంటుంది. యువత అంతా ఇప్పడు ఈ సాంగ్‌ని ఎంజాయ్ చేస్తూ ఉర్రూతలూగుతుంది. ప్రదీప్, అమృత అయ్యర్ జంటగా నటిస్తోన్న ’30 రోజుల్లో ప్రేమించటం ఎలా’ సినిమాలోనిది ఈ పాట. మున్నా దర్శకుడు. ఈ సమ్మర్‌లో ప్రేక్షకుల ముందుకు రావాల్సిన ఈ సినిమా కరోనా లాక్‌డౌన్ కారణంగా వాయిదా పడింది. అయితే, అంతకు ముందే టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్‌బాబు రిలీజ్ చేసిన ‘నీలి నీలి ఆకాశం..’ పాట మాత్రం యూట్యూబ్ వేదికగా దూసుకుపోతోంది.
తాజాగా ఈ పాట 200 మిలియన్ వ్యూస్(అన్ని ఫ్లాట్‌ఫాంలు కలిపి)తో రికార్డు క్రియేట్ చేసింది. సౌత్‌లో మరే పాట ఈ ఫీట్ అందుకోలేదు. ఈ పాటకు చంద్రబోస్ సాహిత్యం అందించగా, అనూప్ రూబెన్స్ స్వరాలు సమకూర్చరు. సిధ్ శ్రీరామ్, సునీత ఆలపించారు. ఎస్వీపీ పిక్సర్స్ పతాకంపై తెరకెక్కుతున్న ఈ సినిమాని ఎస్వీ బాబు ప్రొడ్యూస్ చేస్తున్నారు.
Also Read :