AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

42 ఏళ్ల వయసులో కనిపించకుండా పోయాడు.. 33 ఏళ్ల తర్వాత ఇంటికి వచ్చాడు.. అసలేం జరిగిందంటే

చిన్నప్పుడు ఎవరైనా తప్పిపోతే కొన్ని రోజులు, నెలలు లేదా సంవత్సరాల తర్వాత వారి ఆచూకి కనిపిస్తుంది. మరికొందరైతే ఎప్పటికీ అలా కనిపించకుండానే పోతారు. కొంతమంది ముసలివాళ్లు కూడా కొన్ని చోట్ల తప్పిపోతుంటారు.

42 ఏళ్ల వయసులో కనిపించకుండా పోయాడు.. 33 ఏళ్ల తర్వాత ఇంటికి వచ్చాడు.. అసలేం జరిగిందంటే
Missing
Aravind B
|

Updated on: Jun 02, 2023 | 4:58 PM

Share

చిన్నప్పుడు ఎవరైనా తప్పిపోతే కొన్ని రోజులు, నెలలు లేదా సంవత్సరాల తర్వాత వారి ఆచూకి కనిపిస్తుంది. మరికొందరైతే ఎప్పటికీ అలా కనిపించకుండానే పోతారు. కొంతమంది ముసలివాళ్లు కూడా కొన్ని చోట్ల తప్పిపోతుంటారు. ఇలాంటి ఘటనలు ఎన్నో చోటుచేసుకున్నాయి. అయితే రాజస్థాన్‌లోని ఓ వృద్ధుడు గతంలో కనిపించకుండా పోయి చివరికి 33 ఏళ్ల తర్వాత ఇంటికి తిరిగివచ్చాడు. వివరాల్లోకి వెళ్తే అల్వార్ జిల్లా బన్సూర్ గ్రామానికి చెందిన హనుమాన్ సైనీ అనే 75 ఏళ్ల వృద్ధుడు 1989లో ఢిల్లీలోని ఓ దుకాణంలో పనిలో చేరాడు. అప్పటికి అతని వయసు 42 ఏళ్లు. అయితే అదే సంవత్సరం అతను ఎవరికి చెప్పకుండా ఢిల్లీ నుంచి హిమాచల్‌ప్రదేశ్‌లోని కాంగ్రాకు వెళ్లిపోయాడు.

ఆ తర్వాత అక్కడే ఉన్న ఓ మాతా మందిరంలో పూజలు చేస్తూ గడిపాడు. దాదాపు 33 ఏళ్ల పాటు ఆ ప్రాంతంలోనే గడిపాడు. చివరికి 75 ఏళ్ల వయసులో అక్కడి నుంచి తన స్వగ్రామమైన బన్సూర్‌కు వచ్చేశాడు. చాలాకాలం తర్వాత హనుమాన్ సైనీ ఇంటికి రావడంతో తన కుటుంబ సభ్యులు ఆశ్చర్యపోయారు. చాలా ఏళ్ల తర్వాత పెద్దాయన తిరిగిరావడంతో ఆనందపడిపోయారు. ఇక్కడ మరో విషయం ఏంటంటే అతను ఇక మళ్లీ ఇంటికి తిరిగిరాలేడని భావించి కుటుంబ సభ్యులు గత ఏడాది మరణ ధ్రువీకరణ పత్రాన్ని తీసుకున్నారు. అయితే ఎట్టకేలకు అతను తిరిగిరావడంతో సంతోషంలో మునిగిపోయారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తలు చదవండి

Follow Us
రేబిస్‌తో రెండేళ్ల బాలుడి మరణం..
రేబిస్‌తో రెండేళ్ల బాలుడి మరణం..
భర్తను ప్రాణంగా ప్రేమించే 3 నక్షత్రాల మహిళలు.. వీరు భార్యగా వస్తే
భర్తను ప్రాణంగా ప్రేమించే 3 నక్షత్రాల మహిళలు.. వీరు భార్యగా వస్తే
ఉద్యోగులకు భారీ గుడ్ న్యూస్.. రేపే అకౌంట్లోకి జీతాలు
ఉద్యోగులకు భారీ గుడ్ న్యూస్.. రేపే అకౌంట్లోకి జీతాలు
భోజనాల్లో వడ్డించే కమ్మని క్యాబేజీ క్యారెట్ కొబ్బరి వేపుడు
భోజనాల్లో వడ్డించే కమ్మని క్యాబేజీ క్యారెట్ కొబ్బరి వేపుడు
హైదరాబాద్‌లో అందుబాటులోకి లేటెస్ట్‌ వర్షన్ సెక్యూరిటీ సిస్టమ్!
హైదరాబాద్‌లో అందుబాటులోకి లేటెస్ట్‌ వర్షన్ సెక్యూరిటీ సిస్టమ్!
ఏపీలో కొత్త పింఛన్లపై ప్రభుత్వం అప్డేట్.. అప్పటినుంచే పంపిణీ..
ఏపీలో కొత్త పింఛన్లపై ప్రభుత్వం అప్డేట్.. అప్పటినుంచే పంపిణీ..
రైతులకు గుడ్‌న్యూస్.. వ్యవసాయ సోలార్ పంప్‌సెట్ల ప్రయోగం సక్సెస్
రైతులకు గుడ్‌న్యూస్.. వ్యవసాయ సోలార్ పంప్‌సెట్ల ప్రయోగం సక్సెస్
ఏపీలో మరో కొత్త పథకం.. రూ.1400 విలువ చేసే వస్తువులు ఫ్రీ..
ఏపీలో మరో కొత్త పథకం.. రూ.1400 విలువ చేసే వస్తువులు ఫ్రీ..
ఇంట్లో ఈ పనులు చేస్తున్నారా? అశుభమట.. తప్పక తెలుసుకోండి!
ఇంట్లో ఈ పనులు చేస్తున్నారా? అశుభమట.. తప్పక తెలుసుకోండి!
పచ్చిమిరపకాయ అల్లం పచ్చడి.. ఇలా చేస్తే రుచి అదుర్స్‌
పచ్చిమిరపకాయ అల్లం పచ్చడి.. ఇలా చేస్తే రుచి అదుర్స్‌