ఎయిర్‌పోర్టులో అధిక లగేజ్‌తో వచ్చిన మహిళ.. బాంబు ఉందని బెదిరించడంతో అంతా పరుగులు.. చివరికి

మహారాష్ట్రలోని ముంబయి అంతర్జాతీయ విమానాశ్రయంలో ఊహించని పరిణామం చోటుచేసుకుంది. అధిక లగేజ్ తీసుకొచ్చిన ఓ మహిళ తన బ్యాగులో బాంబు ఉందని చెప్పడంతో భద్రతా సిబ్బందిని ఉరుకులు పరుగులు పెట్టించడం కలకలం రేపింది.

ఎయిర్‌పోర్టులో అధిక లగేజ్‌తో వచ్చిన మహిళ.. బాంబు ఉందని బెదిరించడంతో అంతా పరుగులు.. చివరికి
Mumbai Airport
Follow us

|

Updated on: Jun 02, 2023 | 6:25 PM

మహారాష్ట్రలోని ముంబయి అంతర్జాతీయ విమానాశ్రయంలో ఊహించని పరిణామం చోటుచేసుకుంది. అధిక లగేజ్ తీసుకొచ్చిన ఓ మహిళ తన బ్యాగులో బాంబు ఉందని చెప్పడంతో భద్రతా సిబ్బందిని ఉరుకులు పరుగులు పెట్టించడం కలకలం రేపింది. వివరాల్లోకి వెళ్తే దక్షిణ ముంబయికి చెందిన ఓ మహిళ తన కుటుంబంతో కలిసి కొల్‌కతా వెళ్లేందుకు ఇటీవల ముంబయి ఎయిర్‌పోర్టుకు వచ్చింది. కౌంటర్ వద్ద తన లగేజీని అప్పగించింగి. అయితే వాటి బరువు మొత్తం 22.05 కిలోలుగా ఉన్నట్లు అధికారులు గుర్తించారు.

వాస్తవానికి ఎయిర్‌లైన్ నిబంధనల ప్రకారం ఒక్కో దేశీయ ప్రయాణికుడు గరిష్ఠంగా 15 కిలోల వరకు లగేజి తీసుకెళ్లే అనుమతి ఉంటుంది. అదనపు లగేజీ ఉంటే అదనపు ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. అయితే ఆ మహిళను డబ్బులు చెల్లించాలని అడగగా అందుకు ఆమె నిరాకరించింది. దీంతో ఎయిర్‌లైన్ సిబ్బందితో వాగ్వాదం జరగగా.. తన లగేజ్‌లో బాంబ్ ఉందంటూ బెదిరించింది. దీంతో ఒక్కసారిగా అక్కడున్న వారందరు భయాందోళనకు గురయ్యారు. అప్రమత్తమైన సీఐఎస్‌ఎఫ్ సిబ్బంది ఆమె బ్యాగును చెక్ చేయగా అలాంటిదేమి లేదని తెలియడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. అనంతరం ఆ మహిళను సిబ్బంది పోలీసులకు అప్పగించారు. అయితే ఇతరుల ప్రాణాలకు, భద్రతకు ముప్పు వాటిల్లేలా ప్రవర్తించినందుకు ఆమెపై కేసు పెట్టి కోర్టులో హాజరుపరిచారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తలు చదవండి

విమాన ప్రయాణికులకు గుడ్‌ న్యూస్‌.! రూ.349కే విమాన ప్రయాణం.!
విమాన ప్రయాణికులకు గుడ్‌ న్యూస్‌.! రూ.349కే విమాన ప్రయాణం.!
14 వేల మందికిపైగా ఉద్యోగులను తొలగించనున్న టెస్లా!
14 వేల మందికిపైగా ఉద్యోగులను తొలగించనున్న టెస్లా!
అమెజాన్ 'బజార్' వచ్చేసింది.. ఇక్కడ అన్నీ చవక.. వీటికి పోటీగా..
అమెజాన్ 'బజార్' వచ్చేసింది.. ఇక్కడ అన్నీ చవక.. వీటికి పోటీగా..
ఈ టిప్స్ పాటిస్తే .. ఎంత ఎండలోనైనా ఊటీలో ఉన్నట్టే ఉంటుంది.
ఈ టిప్స్ పాటిస్తే .. ఎంత ఎండలోనైనా ఊటీలో ఉన్నట్టే ఉంటుంది.
తిరుమల వెంకన్న భక్తులకు గుడ్ న్యూస్.! ఏప్రిల్‌ 18న ఉదయం 10 గంటలకు
తిరుమల వెంకన్న భక్తులకు గుడ్ న్యూస్.! ఏప్రిల్‌ 18న ఉదయం 10 గంటలకు
లోన్ యాప్‌ల ఆగడాలకు చెక్ పెట్టడానికి డిజిటల్‌ అస్త్రం..
లోన్ యాప్‌ల ఆగడాలకు చెక్ పెట్టడానికి డిజిటల్‌ అస్త్రం..
'గ్లామర్‌ షో ఓకే.! కాని లిప్ కిస్ వద్దన్నారు మా నాన్న..!' వీడియో.
'గ్లామర్‌ షో ఓకే.! కాని లిప్ కిస్ వద్దన్నారు మా నాన్న..!' వీడియో.
ఇజ్రాయెల్‌కు ఇరాన్ సంచలన హెచ్చరిక.. ఆ ఆయుధాలు కూడా ప్రయోగిస్తాం.!
ఇజ్రాయెల్‌కు ఇరాన్ సంచలన హెచ్చరిక.. ఆ ఆయుధాలు కూడా ప్రయోగిస్తాం.!
అక్కే అన్నింటా తోడుగా.! వారసురాలితో ఇంటికి చేరుకున్న మనోజ్, మౌనిక
అక్కే అన్నింటా తోడుగా.! వారసురాలితో ఇంటికి చేరుకున్న మనోజ్, మౌనిక
హీరో అతనే .. విలనూ అతనే.! కంగువ నుంచి బిగ్ అప్డేట్..
హీరో అతనే .. విలనూ అతనే.! కంగువ నుంచి బిగ్ అప్డేట్..