Telangana Formation Day 2023 : రాష్ట్రంలో కరెంట్ కోతలు లేవు.. ఎటుచూసినా వరి కోతలే: సీఎం కేసీఆర్
Telangana Formation Day 2023: సుదీర్ఘ పోరాటం, అలుపెరుగని ఉద్యమం, ఎందరో బలిదానాల ఫలితంగా ఆవిర్భవించిన తెలంగాణ రాష్ట్రం.. తొమ్మిది వసంతాలు పూర్తి చేసుకుంది. 2014 జూన్ 2న భారతదేశంలో కొత్తగా ఆవిర్భవించిన తెలంగాణ రాష్ట్రం.. పదో వసంతంలోకి అడుగిడుతోంది.
Telangana Formation Day 2023: సుదీర్ఘ పోరాటం, అలుపెరుగని ఉద్యమం, ఎందరో బలిదానాల ఫలితంగా ఆవిర్భవించిన తెలంగాణ రాష్ట్రం.. తొమ్మిది వసంతాలు పూర్తి చేసుకుంది. 2014 జూన్ 2న భారతదేశంలో కొత్తగా ఆవిర్భవించిన తెలంగాణ రాష్ట్రం.. పదో వసంతంలోకి అడుగిడుతోంది. దీంతో దశాబ్ది ఉత్సవాలు ఘనంగా నిర్వహించింది.
ఓవైపు బీఆర్ఎస్.. మరోవైపు కాంగ్రెస్ తెలంగాణ ఆవిర్భావ వేడుకలకు నిర్వహిస్తుంటే… కేంద్ర సర్కార్ తరపున అవతరణ దినోత్సవం జరుపుతోంది బీజేపీ. ఆజాదీకా అమృత్ మహోత్సవంలో భాగంగా.. చారిత్రక గోల్కొండ కోటపై ఉదయం జాతీయపతాకాన్ని ఆవిష్కరించి తెలంగాణ ఆవిర్భావ ఉత్సవాలను ప్రారంభించారు కిషన్ రెడ్డి.
తెలంగాణ సాధన ఏ ఒక్కరివల్లో సాధ్యం కాలేదనీ, సకల జనుల సమైక్య పోరాటంతో, 1200 మంది ఆత్మబలిదానాలతో తెలంగాణ ఆవిర్భవించిందన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. తెలంగాణ సాధనలో బీజేపీ తెలంగాణ గుండెచప్పుడయ్యిందన్నారు. సుష్మ స్వరాజ్ తెలంగాణ ఏర్పాటులో కీలక పాత్ర పోషించారని గుర్తుచేశారు. తెలంగాణ ఉద్యమానికి బీజేపీ ముందుండి నడిచిందన్నారు.
LIVE NEWS & UPDATES
-
అమరవీరుల స్తూపానికి నివాళులు అర్పించిన లోక్ సభ మాజీ స్పీకర్ మీరా కుమార్..
గన్ పార్క్ వద్ద అమరవీరుల స్తూపానికి లోక్ సభ మాజీ స్పీకర్ మీరా కుమార్ నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. తెలంగాణ ఆశయాలు నెరవేర్చాలంటే కాంగ్రెస్ అధికారంలోకి రావాలని, తెలంగాణ ప్రజలు ఏ లక్ష్యం కోసం కోట్లాడారో ఆ లక్ష్యం నెరవేరలేదంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ప్రజల త్యాగాలను చూసి కాంగ్రెస్ త్యాగం చేసి మరి తెలంగాణ ఇచ్చిందని, దేశంలో తెలంగాణ నెంబర్ 1గా ఉండాలంటే కాంగ్రెస్ అధికారంలోకి రావాలని తెలిపారు.
-
ఉజ్వల తెలంగాణ నిర్మాణానికి కాంగ్రెస్ కట్టుబడి ఉంది: రాహుల్ గాంధీ
India’s youngest state, Telangana is known for the resilient spirit of its people.
Congress is committed to build a glorious Telangana, a model state that will bring prosperity to its farmers, youth & women.
Best wishes to the people of the state on their statehood day, today. pic.twitter.com/F7FKSE2vSL
— Rahul Gandhi (@RahulGandhi) June 2, 2023
-
-
దేశానికి దిక్సూచిగా నిలిచిన తెలంగాణ: సీఎం కేసీఆర్..
సచివాలయంలో జెండా ఆవిష్కరించి, దశాబ్ది ఉత్సవాలను లాఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. అమరుల, ఆశయాలు, ఆకాంక్షల సాధనకు కృషి చేస్తున్నామన్నారు. గ్రామస్థాయి నుంచి నగరం వరకు 21 రోజుల పాటు వేడుకలు నిర్వహిస్తామని, దేశానికి దిక్సూచిగా నిలిచిన తెలంగాణ ప్రగతి దశదిశలా చాటుదామని పిలుపునిచ్చారు. అవరోధాలు అధిగమిస్తూ బలీయ శక్తిగా తెలంగాణ ఎదిగిందని, తెలంగాణ దృక్పథంతో ప్రభుత్వం విధానాలను రూపొందించుకుందని తెలిపారు. సీఎంగా ప్రమాణం చేసిన రోజు ఇచ్చిన మాటను మరువలేదంటూ సీఎం కేసీఆర్ గుర్తు చేశారు. మ్యానిఫెస్టోను చిత్తశుద్ధితో అమలు చేశామని, అభివృద్ధి ఫలాలు ప్రజలందించడంలో కొత్త కోణాన్ని ఆవిష్కరించామని ఉద్ఘాటించారు. రాష్ట్రంలో కరెంట్ కోతలు లేవని, ఎటుచూసినా వరి కోతలే ఉన్నాయంటూ ప్రతిపక్షలకు కౌంటర్ ఇచ్చారు. పల్లెలు, పట్టణాలు ప్రపంచస్థాయి గుర్తింపు పొందుతున్నాయని, జూన్ 24 నుంచి పోడు భూముల పట్టాల పంపిణీ చేస్తామని, అలాగే పోడు భూములకు రైతుబంధు వర్తించేలా చర్యలు తీసుకుంటామని ఆయన ఈ సందర్భంగా వెల్లడించారు.
-
గన్ పార్క్‌లో నివాళులు అర్పించిన దత్తాత్రేయ..
హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ దత్తాత్రేయ గన్ పార్క్‌లో అమరవీరులకు నివాళులు అర్పించారు. అనంతరం తెలంగాణ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.
-
దశాబ్ది ఉత్సవాలను ప్రారంభించిన సీఎం కేసీఆర్..
ప్రగతి భవన్‌లో జెండా ఎగురవేసిన తెలంగాణ సీఎం కేసీఆర్.. అక్కడి నుంచి తెలంగాణ అమరవీరుల స్థూపం, గన్ పార్క్ కు చేరుకుని నివాళులు అర్పించారు. ఆ తర్వాత తెలంగాణ సచివాలయానికి చేరుకుని, దశాబ్ది ఉత్సవాలను ప్రారంభించారు. అక్కడ జాతీయ జెండాను ఆవిష్కరించి తెలంగాణ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.
-
-
తెలంగాణ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపిన పీఎం నరేంద్ర మోడీ..
తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా అద్భుతమైన ఈ రాష్ట్ర ప్రజలకు నా శుభాకాంక్షలు. ఈ రాష్ట్ర ప్రజల నైపుణ్యాలు, సంస్కృతీ వైభవం ఎంతో గుర్తింపు పొందాయి. తెలంగాణ శ్రేయస్సు, సౌభాగ్యం కోసం నేను ప్రార్థిస్తున్నాను.
— Narendra Modi (@narendramodi) June 2, 2023
-
ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో వేడుకలు..
ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. దశాబ్ది అవతరణ ఉత్సవాలను తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి మంధా జగన్నాథం, తెలంగాణ భవన్ రెసిడెంట్ కమీషనర్ గౌరవ్ ఉప్పల్ ప్రారంభించారు. ఉత్సవాల్లో భాగంగా అమరవీరుల స్థూపానికి, అంభేద్కర్ విగ్రహానికి నివాళులు అర్పించారు.
-
జై తెలంగాణ అంటే స్లోగన్ మాత్రమే కాదు ఆత్మగౌరవ నినాదం: గవర్నర్ తమిళిసై
రాష్ట్ర ప్రజలందరికీ ఆవిర్భవ దినోత్సవం శుభాకాంక్షలు తెలియజేసిన గవర్నర్ తమిళిసై.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమం పూర్తి అహింస ఉద్యమమని, తెలంగాణ అమరవీరులకు పేరుపేరునా జోహార్లు తెలిపారు. 1969 ఉద్యమంలో పాల్గొన్న కొంతమందిని సత్కరించడం నా అదృష్టమని, రాష్ట్ర ఉద్యమంలో మమేకమైన ప్రతిఒక్కరికీ వందనాలు తెలియజేశారు. రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు అమలవుతున్నాయని, జాతీయ నగరంగా హైదరాబాద్ పేరు సంపాదించిందని పేర్కొన్నారు.
-
గన్ పార్క్‌లో అమరవీరుల స్థూపానికి నివాలుకు అర్పించిన సీఎం కేసీఆర్..
-
గన్‌పార్క్‌కు బయల్దేరిన సీఎం కేసీఆర్..
ప్రగతి భవన్‌లో జెండా ఎగురవేసిన తెలంగాణ సీఎం.. అక్కడి నుంచి తెలంగాణ అమరవీరుల స్థూపం, గన్ పార్క్ కు బయలుదేరిన సీఎం కేసిఆర్ గారు.
-
తెలంగాణ బీజేపీ ఆఫీసులో అవతరణ వేడుకలు.. ప్రభుత్వంపై బండి సంజయ్ విమర్శలు..
కేవలం నలుగురి కోసం తెలంగాణను తాకట్టుపెట్టారని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు. తెలంగాణ బీజేపీ ఆఫీసులో నిర్వహించిన రాష్ట్ర ఆవిర్భావ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. తెలంగాణలో బీఆర్‌ఎస్‌కు బీజేపీనే ప్రత్యామ్నాయం అని సంజయ్ చెప్పుకొచ్చారు.
-
రాజ్‌భవన్‌లో అవతరణ దినోత్సవ వేడుకలు
రాజ్‌భవన్‌లో రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు జరుగుతున్నాయి. ఈ మేరకు గవర్నర్ తమిళిసై కేక్ కట్ చేసి వేడుకల్లో పాల్గొన్నారు.
-
రాజన్న సిరిసిల్లలో జెండా ఎగురవేసిన కేటీఆర్..
-
అవమానాలు, అన్యాయాలకు గురైన చోటే.. సమగ్రాభివృద్ధితో దశాబ్ది సంబురం చేసుకొంటున్నాం: హరీష్ రావ్
రానే రాదన్న తెలంగాణను సాధించి, కానే కాదన్న అభివృద్ధిని చేసి చూపెట్టింది కేసీఆర్
అనతి కాలంలోనే ప్రగతి పథంలో నడిపించి తెలంగాణను ఎవరెస్టు శిఖరమంత ఎత్తున నిలిపింది కేసీఆర్
9 ఏళ్లలో రాష్ట్రాన్ని అభివృద్ధికి రోల్ మోడల్ గా చేసి, 76 ఏళ్ల స్వతంత్ర భారత్ కు మార్గదర్శిగా మార్చింది… pic.twitter.com/38LOuAVZnv
— Harish Rao Thanneeru (@BRSHarish) June 2, 2023
-
శుభాకాంక్షలు తెలిపిన రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, స్పీకర్
My greetings to the people of Telangana on Statehood Day! Endowed with forests and wildlife, Telangana is also uniquely blessed with a rich cultural heritage and talented people. This beautiful state is emerging as a hub of innovation and entrepreneurship. My best wishes for the…
— President of India (@rashtrapatibhvn) June 2, 2023
Warm greetings on the statehood day of Telangana! The state is renowned for its rich heritage, vibrant culture and thriving industries. Over the years, people from Telangana have excelled in various fields and contributed immensely to the growth of Bharat. May the state continue…
— Vice President of India (@VPIndia) June 2, 2023
I extend heartiest wishes to the people of Telangana on the auspicious occasion of their State Foundation Day. May the State continue to flourish and bring joy, prosperity and success to its people.
— Om Birla (@ombirlakota) June 2, 2023
-
తెలంగాణ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపిన పవన్ కల్యాణ్..
తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా తెలంగాణ వాసులందరికీ జనసేన అధినేత పవన్ కల్యాణ్ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. నేటి నుంచి 22వ తేదీ వరకు సాగే ఈ దశాబ్ది ఉత్సవాలు చరిత్రాత్మకమైనవని, ఎందరో పోరాట యోధుల ప్రాణ త్యాగ ఫలితమే తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావించని పేర్కొన్నారు. పేదరికం లేని తెలంగాణా ఆవిష్కృతం కావాలనీ, రైతులు, కర్షకులు, కార్మికులతోపాటు.. ఈ నేలపై జీవిస్తున్న ప్రతి ఒక్కరూ ఆనందకరమైన జీవితం సాగించాలని కోరుకుంటున్నట్లు ప్రకటించారు.
-
నివాళులర్పించిన మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్..
చిన్న శంకరంపేట మండల కేంద్రంలో అమరవీరుల స్థూపం వద్ద రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ నివాళులర్పించారు.
-
గోల్కొండ కోట వేదికగా కిషన్ రెడ్డి విమర్శలు..
గోల్కొండ కోట వేదికగా BRS ప్రభుత్వంపై కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి విమర్శలు గుప్పించారు. తెలంగాణ రాష్ట్రం.. ఒక్క కుటుంబానికి బానిసగా మారిందని, ప్రజల ఆకాంక్షలు అలాగే మిగిలిపోయాయ్ అంటూ విమర్శించారు. తెలంగాణ దగా పడింది, అవినీతి పెరిగిపోయిందని, బీఆర్‌ఎస్ ప్రభుత్వం.. మాఫియాలా తయారైందంటూ ఎద్దేవా చేశారు. తెలంగాణను అప్పుల కుప్పగా మార్చేశారని, ఎక్కడ అప్పు దొరికితే అక్కడ అప్పు చేస్తున్నారంటూ చురకలు అంటించారు. అలాగే మతపరమైన రిజర్వేషన్లు తీసేయాలని కిషన్ రెడ్డి కోరారు.
-
గోల్కొండలో జెండా ఆవిష్కరించిన కేంద్రమంత్రి కిషన్ రెడ్డి..
-
డీజీపీ ఆఫీస్‌లో పతాక ఆవిష్కర చేయనున్న కమలాసన్ రెడ్డి
రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా తెలంగాణ డీజీపీ ఆఫీస్ లో పతాక ఆవిష్కరణ చేయనున్న ఐ.జి. పర్సనల్ వీ.బి. కమలాసన్ రెడ్డి. డీజీపీ కార్యాలయంలో ఉదయం 7.30 గంటలకు జాతీయ పతావిష్కరణ చేయనున్నారు. అనంతరం నూతన సెక్రటేరియట్ లో జరిగే దశాబ్ద ఉత్సవాలలో డీజీపీ అంజనీ కుమార్ పాల్గొననున్నారు. కాగా, అన్ని పోలీస్ కమిషనరేట్ కార్యాలయాల్లో ఏడున్నర గంటలకు ఫ్లాగ్ హోస్టింగ్ చేయనున్నారు.
-
గోల్కొండ కోటకు గవర్నర్..
గోల్కొండ కోటలో జరిగే వేడుకలకు గవర్నర్ హాజరవుతారని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. పలు సాంస్కృతిక కార్యాక్రమాలు సహా జాతీయ పతాకావిష్కరణ కార్యక్రమాలు ఉంటాయని, ప్రజలంతా తరలివచ్చి వేడుకల్లో పాల్గొనాలని అయన కోరారు. మోడీ తొమ్మిదేళ్ల పాలనకు సంభందించి పోటో ఎగ్జిబిషన్‌ను ఏర్పాటు చేస్తున్నామని ఆయన అన్నారు. ఇక సాయంత్రం భారత సాంస్కృతిక వైభవంతో పాటు కేంద్ర ప్రభుత్వం సాధించిన విజయాలపై రెండు చిత్రాల ప్రదర్శన ఉంటుందన్నారు.
-
గాంధీ భవన్‌లో వేడుకలకు కాంగ్రెస్ రెడీ.. ముఖ్య అతిథిగా లోక్ సభ మాజీ స్పీకర్ మీరా కుమార్
తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కాంగ్రెస్ గాంధీ భవన్‌లో వేడుకలకు ప్లాన్ చేసింది. ముఖ్య అతిథిగా లోక్ సభ మాజీ స్పీకర్ మీరా కుమార్ పాల్గొననున్నారు. ఇప్పటికే హైదరాబాద్ వచ్చిన మీరా కుమార్ కు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డితో పాటు పలువరు మాజీ ఎంపీలు, పార్టీ నేతలు ఘన స్వాగతం పలికారు.
ఉదయం 10.30 గంటలకు గాంధీ భవన్ లో జాతీయ పతాక ఆవిష్కరణ చేయనున్నారు. ఉదయం 11.00 గంటలకు గన్ పార్క్ వద్ద అమరవీరులకు లోకసభ మాజీ స్పీకర్ మీరా కుమార్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు నివాళులు అర్పిస్తారు. ఉదయం 11.15 గంటలకు నిజాం కాలేజ్ వద్ద ఉన్న బాబు జగ్జీవన్ రామ్ విగ్రహం వద్ద నుంచి పాదయాత్ర ప్రారంభం అవుతుంది. ఈ పాదయాత్రను మీరా కుమార్ ప్రారంభిస్తారు. ఈ పాదయాత్ర అబిడ్స్ నెహ్రూ విగ్రహం మీదుగా గాంధీభవన్ కు చేరుకుంటుంది. అనంతరం గాంధీ భవన్ లో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ సభ ఉంటుంది. ఏఐసీసీ ఇన్‌చార్జ్ మాణిక్ రావ్ ఠాక్రే, టీపీసీసీ సీనియర్ నాయకులు పాల్గొంటారు. తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలక పాత్ర పోషించిన ప్రముఖులను సన్మానిస్తారు.
-
శానసన మండలిలో జాతీయ జెండా ఆవిష్కరణ
తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్బంగా శానసన మండలిలో చైర్మన్ గుత్తా సుకేందర్ రెడ్డి జాతీయ జెండా ఆవిష్కరించారు.
-
గోల్కొండ కోటలో ఆవిర్భావ ఉత్సవాలకు బీజేపీ ప్లాన్..
తెలంగాణ స్వప్నం సాకారమై తొమ్మిది వసంతాలు పూర్తవుతోంది. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌లో భాగంగా గోల్కొండ కోటలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాలు నిర్వహిస్తోంది బీజేపీ. ఈ సందర్భంగా సెంట్రల్ మినిష్టర్ కిషన్ రెడ్డి జాతీయపతాకాన్ని ఆవిష్కరించి తెలంగాణ ఆవిర్భావ ఉత్సవాలను ప్రారంభించనున్నారు.
-
దశాబ్ది ఉత్సవాలకు ముస్తాబైన తెలంగాణ
సుదీర్ఘ పోరాటం, అలుపెరుగని ఉద్యమం, ఎందరో బలిదానాల ఫలితంగా ఆవిర్భవించిన తెలంగాణ రాష్ట్రం.. తొమ్మిది వసంతాలు పూర్తి చేసుకుంది. 2014 జూన్ 2న భారతదేశంలో కొత్తగా ఆవిర్భవించిన తెలంగాణ రాష్ట్రం.. పదోవసంతంలోకి అడుగిడుతోంది. దీంతో దశాబ్ది ఉత్సవాలకు తెలంగాణ ముస్తాబెైంది.
Published On - Jun 02,2023 6:15 AM