AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rahul Gandhi In USA: విదేశాల్లో భారత్‌ను పదేపదే అవమానిస్తారా.. రాహుల్ వెంటనే భారతీయులకు క్షమాపణ చెప్పాలి..

రాహుల్ గాంధీ పోరాటం ‘బీజేపీ’తోనా లేక ‘భారత్’తోనా అనేది స్పష్టం చేయాలని కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ డిమాండ్ చేశారు. రాహుల్‌గాంధీపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు ధర్మేంద్ర ప్రధాన్. ఇతర దేశాల్లో పర్యటిస్తున్నప్పుడు మన దేశాన్ని పదేపదే అవమానించడం సరికాదన్నారు.

Rahul Gandhi In USA: విదేశాల్లో భారత్‌ను పదేపదే అవమానిస్తారా.. రాహుల్ వెంటనే భారతీయులకు క్షమాపణ చెప్పాలి..
Minister Dharmendra Pradhan
Sanjay Kasula
|

Updated on: Jun 02, 2023 | 6:53 PM

Share

కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ మండిపడ్డారు. అమెరికా పర్యటనలో ఉన్న రాహుల్ గాంధీ చేస్తున్న కామెంట్స్‌ను తప్పుపట్టారు. కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీ పోరాటం ‘బీజేపీ’తోనా లేక ‘భారతదేశం’తోనా అనేది స్పష్టం చేయాలని ధర్మేంద్ర ప్రధాన్ డిమాండ్ చేశారు. రాహుల్‌గాంధీ విదేశాల్లో ఉన్నప్పుడు భారత్‌పై విమర్శలు చేయడం సరికాదన్నారు. ఇతర దేశాల్లో పర్యటిస్తున్నప్పుడు మన దేశాన్ని పదేపదే అవమానించడం ఎంత వరకు సరైనదో చెప్పాలని అన్నారు. దేశంలోనే ఉన్నప్పుడు బీజేపీతో పోరాడండి.. కానీ విదేశాల్లో ఉన్నప్పుడు దేశాన్ని పదేపదే అవమానించడం మానేయండని హితవు పలికారు. రాహుల్ గాంధీ తాను చేసిన వ్యాఖ్యలపై దేశానికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

దేశం వెలుపల దేశాన్ని అవమానించడం రాహుల్ గాంధీకి అలవాటుగా మారిందన్నారు. విదేశాలకు వెళ్లినప్పుడల్లా భారతదేశాన్ని, ప్రజాస్వామ్యాన్ని కించపరుస్తూ ప్రకటనలు చేస్తుంటారు. నేడు, ప్రపంచవ్యాప్తంగా భారతదేశం విశ్వసనీయత ఎంతో ఉన్నత శిఖరాలను తాకిందన్నారు.

రాహుల్ గాంధీ తన వ్యాఖ్యలకు దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలి: ధర్మేంద్ర ప్రధాన్

అప్పుడు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ట్వీట్ చేస్తూ రాహుల్ గాంధీ, కాంగ్రెస్ తమ పోరాటం ‘బీజేపీ’తోనా లేక ‘భారత్’తోనా అనేది స్పష్టం చేయాలి. ప్రపంచం భారతదేశం వైపు ఆశలతో చూస్తోందన్నారు. భారతదేశాన్ని విదేశీ భూమిగా తక్కువ చేసి రాహుల్ గాంధీ చేసిన ప్రకటన చాలా దురదృష్టకరమన్నారు.

భారత కాలమానం ప్రకారం గురువారం అర్థరాత్రి రాహుల్ మరోసారి ప్రధాని మోదీపై పెద్ద ఎత్తున విమర్శలు గుప్పించారు. వాషింగ్టన్‌లోని నేషనల్ ప్రెస్ క్లబ్‌లో విలేకరులు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానమిస్తూ.. 2024 లోక్‌సభ ఎన్నికల్లో ప్రధాని నరేంద్ర మోదీ గెలుస్తారని నేను అనుకోవడం లేదన్నారు. కర్ణాటక ఎన్నికలలో విజయం గురించి చర్చిస్తూ.. ఈ విజయానికి ప్రధాన కారణాలలో ఒకటి నిరుద్యోగం, ధరల పెరుగుదల అని అన్నారు. భారత ఆర్థిక వ్యవస్థ బాగా పనిచేస్తోందని చెప్పలేమన్నారు. విపక్షాలు పూర్తిగా ఏకమయ్యాయని, బీజేపీని రాబోయే రోజుల్లో ఓడిస్తాయని రాహుల్ అన్నారు. ఈసారి ఫలితాలు షాకింగ్‌గా ఉంటాయని అన్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం