AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Virat Kohli: కోహ్లీ ఫ్యాన్స్ కు షాకింగ్ న్యూస్.. ఆ మ్యాచ్ నుంచి కింగ్ ఔట్.. కారణం ఏంటంటే?

ఢిల్లీ జట్టు ప్రస్తుతం పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతోంది. కోహ్లీ లేకపోవడం జట్టుకు లోటే అయినప్పటికీ, పంత్ నాయకత్వంలో యువ ఆటగాళ్లు రాణిస్తారని మేనేజ్మెంట్ ధీమా వ్యక్తం చేస్తోంది. కింగ్ కోహ్లీ తిరిగి రైల్వేస్‌తో జరిగే మ్యాచ్‌లో మళ్ళీ తన బ్యాట్‌తో మెరుపులు మెరిపిస్తారని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు.

Virat Kohli: కోహ్లీ ఫ్యాన్స్ కు షాకింగ్ న్యూస్.. ఆ మ్యాచ్ నుంచి కింగ్ ఔట్.. కారణం ఏంటంటే?
Virat Kohli
Venkata Chari
|

Updated on: Dec 29, 2025 | 10:07 AM

Share

Virat Kohli: సుదీర్ఘ విరామం తర్వాత దేశవాళీ క్రికెట్‌లోకి అడుగుపెట్టిన టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ, విజయ్ హజారే ట్రోఫీలో వరుసగా రెండు అద్భుత ఇన్నింగ్స్‌లతో అభిమానులను అలరించారు. అయితే, నేడు సౌరాష్ట్రతో జరుగుతున్న కీలక మ్యాచ్‌లో కోహ్లీ తుది జట్టులో లేకపోవడం చర్చనీయాంశంగా మారింది. అసలు కోహ్లీ ఎందుకు ఆడటం లేదు..? మళ్ళీ ఎప్పుడు జట్టులోకి వస్తాడో ఇప్పుడు తెలుసుకుందాం..

విజయ్ హజారే ట్రోఫీలో కోహ్లీ సంచలనం: విజయ్ హజారే ట్రోఫీ 2025-26 సీజన్ ద్వారా దాదాపు 15 ఏళ్ల తర్వాత ఢిల్లీ జట్టు తరపున విరాట్ కోహ్లీ బరిలోకి దిగారు. తొలి రెండు మ్యాచ్‌ల్లోనే తన క్లాస్ ఏంటో నిరూపించిన కోహ్లీ, పరుగుల వరద పారించారు. ఆంధ్రతో జరిగిన మొదటి మ్యాచ్‌లో 131 పరుగులు, గుజరాత్‌తో జరిగిన రెండో మ్యాచ్‌లో 77 పరుగులు చేసి ఢిల్లీ విజయాల్లో కీలక పాత్ర పోషించారు. ఈ క్రమంలోనే లిస్ట్-ఏ క్రికెట్‌లో అత్యంత వేగంగా 16,000 పరుగులు పూర్తి చేసిన ఆటగాడిగా చరిత్ర సృష్టించారు.

ఇది కూడా చదవండి: Team India: టీమిండియా కొత్త టీ20 కెప్టెన్‌గా యువ సంచలనం.. సూర్యకుమార్‌పై వేటు.. గిల్‌కు నో ఛాన్స్.?

ఇవి కూడా చదవండి

నేడు ఎందుకు ఆడటం లేదు..?

బెంగుళూరులోని ఆలూరు గ్రౌండ్‌లో నేడు (డిసెంబర్ 29) ఢిల్లీ వర్సెస్ సౌరాష్ట్ర మధ్య మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ ఆడటం లేదు. దీనికి ప్రధాన కారణం వ్యక్తిగత విరామం. మొదటి రెండు మ్యాచ్‌లలో తన సత్తా చాటిన కోహ్లీ, ప్రస్తుతానికి జట్టును వీడి ముంబైకి వెళ్లాడు. అంతర్జాతీయ మ్యాచ్‌ల ఒత్తిడి, రాబోయే న్యూజిలాండ్ సిరీస్‌ను దృష్టిలో ఉంచుకుని ఆయనకు ఈ విరామం ఇచ్చినట్లు తెలుస్తోంది. రిషబ్ పంత్ ఢిల్లీ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు.

ఇది కూడా చదవండి: Team India: ద్రవిడ్ హయాంలో తోపు ఫినిషర్.. కట్‌చేస్తే.. వాటర్ బాయ్‌గా మార్చిన గంభీర్..

మళ్ళీ ఎప్పుడు ఆడతారు?

కోహ్లీ అభిమానులకు ఒక శుభవార్త ఏమిటంటే, ఆయన టోర్నమెంట్ నుంచి పూర్తిగా తప్పుకోలేదు. తాజా సమాచారం ప్రకారం, జనవరి 6, 2026న రైల్వేస్‌తో జరగబోయే మ్యాచ్ కోసం విరాట్ కోహ్లీ తిరిగి ఢిల్లీ జట్టుతో చేరే అవకాశం ఉంది. న్యూజిలాండ్‌తో జరిగే వన్డే సిరీస్‌కు ముందు ప్రాక్టీస్ కోసం ఈ మ్యాచ్‌ను కోహ్లీ ఉపయోగించుకోవాలని భావిస్తున్నారు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

నీటిపై ఇళ్లు.. నీళ్లే దారులు.. భారతదేశపు మిస్టరీ గ్రామం!
నీటిపై ఇళ్లు.. నీళ్లే దారులు.. భారతదేశపు మిస్టరీ గ్రామం!
ఏపీ ప్రజలకు చంద్రబాబు డబుల్ గిఫ్ట్.. ఒకేసారి రెండు పథకాలు..
ఏపీ ప్రజలకు చంద్రబాబు డబుల్ గిఫ్ట్.. ఒకేసారి రెండు పథకాలు..
ఎంబీబీఎస్ మార్కుల లిస్ట్ షేర్ చేసిన హీరోయిన్..
ఎంబీబీఎస్ మార్కుల లిస్ట్ షేర్ చేసిన హీరోయిన్..
40 ఏళ్ల తర్వాత మళ్లీ కలిసిన చిన్ననాటి స్నేహం.. జ్ఞాపకాల బస్సులో..
40 ఏళ్ల తర్వాత మళ్లీ కలిసిన చిన్ననాటి స్నేహం.. జ్ఞాపకాల బస్సులో..
బంగ్లాకు మద్దతుగా పాక్.. టీ20 ప్రపంచకప్ నుంచి ఔట్..?
బంగ్లాకు మద్దతుగా పాక్.. టీ20 ప్రపంచకప్ నుంచి ఔట్..?
గుప్త నవరాత్రులలో.. శ్యామల దేవిని పూజిస్తే ఎన్ని లాభాలో తెలుసా?
గుప్త నవరాత్రులలో.. శ్యామల దేవిని పూజిస్తే ఎన్ని లాభాలో తెలుసా?
వార్నీ.. అదేంటక్కాయ్ అలా తన్నేశావ్.. కొద్దిలో ఉంటే ..
వార్నీ.. అదేంటక్కాయ్ అలా తన్నేశావ్.. కొద్దిలో ఉంటే ..
ఒకేసారి షాకిస్తూ భారీగా పెరిగిన గోల్డ్ రేట్లు.. నేటి రేట్లు ఇవే..
ఒకేసారి షాకిస్తూ భారీగా పెరిగిన గోల్డ్ రేట్లు.. నేటి రేట్లు ఇవే..
నువ్వేం దొంగవు రా నాయనా.. నీ తెలివి తెల్లార.. ఏం జరిగిందో..
నువ్వేం దొంగవు రా నాయనా.. నీ తెలివి తెల్లార.. ఏం జరిగిందో..
బడ్జెట్‌లో భారీ శుభవార్త చెప్పనున్న కేంద్రం.. దేశ ప్రజలందరికీ..
బడ్జెట్‌లో భారీ శుభవార్త చెప్పనున్న కేంద్రం.. దేశ ప్రజలందరికీ..