MotoGP: భారత్‌లో తొలిసారిగా మోటోజీపీ మోటార్‎సైక్లింగ్ రేస్.. ఎప్పుడంటే ?

భారత్‌లో తొలిసారిగా మోటోజీపీ మోటార్ సైక్లింగ్ రేస్ జరగనుంది. ఈ రేసింగ్‌కు సంబంధించిన టికెట్ల విక్రయాలు త్వరలోనే ప్రారంభమవుతాయని నిర్వాహకులు తెలిపారు. ఇండియన్ గ్రాండ్ ప్రిక్స్ 'మోటోజీపీ భారత్' టికెట్ల కోసం రిజిస్ట్రేషన్ చేసుకోవాలని పేర్కొన్నారు.

MotoGP: భారత్‌లో తొలిసారిగా మోటోజీపీ మోటార్‎సైక్లింగ్ రేస్.. ఎప్పుడంటే ?
Motogp Racing
Follow us

|

Updated on: Jun 02, 2023 | 6:48 PM

భారత్‌లో తొలిసారిగా మోటోజీపీ మోటార్ సైక్లింగ్ రేస్ జరగనుంది. ఈ రేసింగ్‌కు సంబంధించిన టికెట్ల విక్రయాలు త్వరలోనే ప్రారంభమవుతాయని నిర్వాహకులు తెలిపారు. ఇండియన్ గ్రాండ్ ప్రిక్స్ ‘మోటోజీపీ భారత్’ టికెట్ల కోసం రిజిస్ట్రేషన్ చేసుకోవాలని పేర్కొన్నారు. మొదటిసారిగా భారత్‌లో ఈ ఏడాది సెప్టెంబర్ 22 నుంచి 24 వరకు రెండు రోజుల పాటు ఈ రేస్ జరగనుంది.

ఉత్తరప్రదేశ్‌ గ్రేటర్ నోయిడాలోని బుద్ధ్ ఇంటర్నేషనల్ సర్క్యూట్లో ఈ రేస్‌లు జరగనున్నాయి. అయితే ఫెయిర్‌స్ట్రీట్‌ స్పోర్ట్స్‌, మోటోజీపీటీఎం సంయుక్తంగా ఈ మెగా రేస్‌ను నిర్వహిస్తున్నాయి. మోటోజీపీతోపాటు బుక్‌మైషో కలిసి టికెట్లను విక్రయించేందుకు అభిమానుల కోసం వీటిని ఆన్‌లైన్‌లో ఉంచనుంది. అలాగే ఆఫర్లతోపాటు అదనపు ప్రయోజనాలను కూడా అందించనున్నట్లు తెలిపింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఏపీ వార్తల కోసం.. క్లిక్ చేయండి..