మా ప్రభాస్‌నే అంటావా..! సప్తగిరి పై ప్రభాస్ ఫాన్స్ ఫైర్.. అసలేమైందంటే
డైరెక్టర్ మారుతీ సినిమాలకు సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది. చాలా కాలం తర్వాత ఆయన తెరకెక్కిస్తున్న సినిమా రాజా సాబ్. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ మూవీపై ఇప్పటికే భారీ హైప్ నెలకొంది. హార్రర్ కామెడీ డ్రామాగా రూపొందించిన ఈ చిత్రంలో ముగ్గురు హీరోయిన్లు నటించారు.

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాజా సాబ్. టాలీవుడ్ సక్సెస్ ఫుల్ దర్శకుడిగా పేరు తెచ్చుకున్న మారుతి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా కోసం ప్రభాస్ ఫాన్స్ ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాను హారర్ కామెడీ నేపథ్యంతో తెరకెక్కిస్తున్నాడు మారుతి. చాలా కాలం తర్వాత మారుతి ఎంటర్టైనర్ తో రావడంతో ఈ సినిమా పై పెరిగిపోయాయి. ఇక ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్, సాంగ్స్, టీజర్స్ సినిమా పై అంచనాలను భారీగా పెంచేశాయి. ఈ సినిమాను జనవరి 9న విడుదల చేయనున్నారు. సంక్రాంతి కానుకగా విడుదల కానున్న ఈ సినిమా మంచి విజయాన్ని అందుకోవడం ఖాయంగా కనిపిస్తుంది.
ఇటీవలే ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. చాలా కాలం తర్వాత ప్రభాస్ ఫ్యాన్స్ మధ్యకు రావడంతో ఫ్యాన్స్ ప్రభాస్ ను చూడటానికి ఆసక్తి చూపించారు. గ్రాండ్ గా జరిగిన ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో నటుడు సప్తగిరి చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి. దాంతో ప్రభాస్ ఫ్యాన్స్ సప్తగిరి పై ఫైర్ అవుతున్నారు. మా ప్రభాస్ ను అంత మాట అంటావా అంటూ సీరియస్ అవుతున్నారు ఫ్యాన్స్.. ఇంతకు ఏం జరిగిందంటే..
ఇటీవల జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ప్రభాస్ గురించి అందరూ చాలా గొప్పగా మాట్లాడారు. దర్శకుడు మారుతి, హీరోయిన్స్ నిధి అగర్వాల్, రిధి కుమార్, మాళవిక మోహనన్ తో పాటు మిగిలిన టెక్నీషన్స్ అందరూ ప్రభాస్ ను పొగడ్తలతో ముంచెత్తారు. అలాగే సప్తగిరి మాట్లాడుతూ.. సినిమాలో మా అందరి కంటే కూడా ప్రభాస్ పెద్ద కమెడియన్ అంటూ కామెంట్స్ చేశారు. దాంతో ప్రభాస్ ను కమెడియన్ అంటావా అంటూ ఫైర్ అవుతున్నారు. పాన్ ఇండియా స్టార్ హీరో అయిన ప్రభాస్ ను పట్టుకొని కమెడియన్ అంటావా అంటూ సీరియస్ అవుతున్నారు. మరికొందరు మాత్రం సప్తగిరి ఉద్దేశపూర్వకంగా అనలేదని.. ప్రభాస్ లో కామెడీ టైమింగ్ గురించి మాట్లాడుతూ అలా అన్నారని అంటున్నారు. దీని పై సప్తగిరి క్లారిటీ ఇస్తాడేమో చూడాలి.
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ చూడండి.
