AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘చనిపోయిన నా కొడుకు వీర్యాన్ని ఇప్పించండి’.. హైకోర్టును ఆశ్రయించిన ఓ తల్లి!

తల్లి కొడుకుల మధ్య బంధం ప్రపంచంలోనే అత్యంత పవిత్రమైన సంబంధం. తల్లియే దైవంగా భావిస్తాడు కొడుకు. ఇటీవల బాంబే హైకోర్టులో ఒక సంచలన పిటిషన్ దాఖలైంది. ఇక్కడ, ఒక నిస్సహాయ తల్లి తన కుటుంబ వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్లడానికి చనిపోయిన కొడుకు శుక్రకణం కోసం కోర్టు తలుపులు తట్టింది.

'చనిపోయిన నా కొడుకు వీర్యాన్ని ఇప్పించండి'.. హైకోర్టును ఆశ్రయించిన ఓ తల్లి!
Bombay High Court
Balaraju Goud
|

Updated on: Jun 28, 2025 | 10:17 PM

Share

తల్లి కొడుకుల మధ్య బంధం ప్రపంచంలోనే అత్యంత పవిత్రమైన సంబంధం. తల్లియే దైవంగా భావిస్తాడు కొడుకు. ఇటీవల బాంబే హైకోర్టులో ఒక సంచలన పిటిషన్ దాఖలైంది. ఇక్కడ, ఒక నిస్సహాయ తల్లి తన కుటుంబ వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్లడానికి చనిపోయిన కొడుకు శుక్రకణం కోసం కోర్టు తలుపులు తట్టింది.

ఈ కేసులో నిర్ణయం తీసుకునే వరకు మరణించిన యువకుడి శుక్రకణాలను భద్రంగా ఉంచాలని బాంబే హైకోర్టు సంతానోత్పత్తి కేంద్రాన్ని ఆదేశించింది. పిటిషనర్ కుమారుడు క్యాన్సర్‌తో పోరాడుతూ మరణించాడు. అతను చనిపోకముందు తన శుక్రకణాలను స్తంభింపజేసి శుక్రకణ బ్యాంకులో నిల్వ చేశాడు. కానీ కొడుకు మరణం తర్వాత, సంతానోత్పత్తి కేంద్రం అతని తల్లికి వీర్యం ఇవ్వడానికి నిరాకరించింది.

ఇలాంటి పరిస్థితిలో కొడుకు తల్లి కోర్టు తలుపు తట్టింది. జస్టిస్ మనీష్ పిటాలే నేతృత్వంలోని బాంబే హైకోర్టు ధర్మాసనం ముందుకు ఈ పిటిషన్ విచారణకు వచ్చింది. ఈ పిటిషన్ పై న్యాయమూర్తి మాట్లాడుతూ, విచారణ పూర్తయ్యేలోపు యువకుడి వీర్యం దెబ్బతిన్నా లేదా నాశనం అయినా, పిటిషన్ ఉద్దేశ్యం విఫలమవుతుందని, కాబట్టి పిటిషన్ పరిష్కారం అయ్యే వరకు యువకుడి వీర్యం సురక్షితంగా ఉంచాలని కోర్టు సంతానోత్పత్తి కేంద్రాన్ని ఆదేశించింది.

తన కుమారుడికి క్యాన్సర్ ఉన్నట్లు నిర్ధారణ అయినప్పుడు, కీమోథెరపీ స్పెర్మ్‌ను నాశనం చేస్తుందని, ఆంకాలజిస్ట్ అతని స్పెర్మ్‌ను స్తంభింపజేయమని సూచించాడని ఆ మహిళ పిటిషన్‌లో పేర్కొంది. కొడుకు తన కుటుంబ సభ్యులను సంప్రదించకుండా ఒక ఫారమ్‌పై సంతకం చేసి, తన మరణం తర్వాత తన స్పెర్మ్‌ను నాశనం చేయాలని ఎంచుకున్నాడు.

అయితే, ఫిబ్రవరి 16, 2025న, ఆ యువకుడు వీలునామా రాయకుండానే మరణించాడు. ఇప్పుడు సంతానోత్పత్తి కేంద్రం స్పెర్మ్ ఇవ్వడానికి నిరాకరించింది. తన భర్త, కొడుకు ఇద్దరూ చనిపోయారని, ఇంట్లో మగవారు లేడని ఆ మహిళ పిటిషన్‌లో పేర్కొంది. అటువంటి పరిస్థితిలో, తన కొడుకు వీర్యంతో కుటుంబ వంశాన్ని ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటున్నట్లు ఆమె పేర్కొంది. ఈ నేపథ్యంలోనే వీర్యాన్ని గుజరాత్‌కు చెందిన ఐవీఎఫ్‌ సెంటర్‌కు తరలించాలని ఆ తల్లి హైకోర్టును ఆశ్రయించింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..