Maharastra: న్యాయం కోసం ఓ తండ్రి పోరాటం.. కూతురు మృతదేహాన్ని 44 రోజులుగా ఉప్పులో ఉంచి..

గ్రామం పక్కన ఉన్న వావి గ్రామంలో మామిడి చెట్టుకు వేలాడుతూ యువతి మృతదేహం కనిపించిందని ఆ తండ్రికి చెప్పారు. దీంతో చెట్టుదగ్గరకు కుటుంబసభ్యులువచ్చే సరికి అధరాలు ధ్వంసం చేశారని ఆరోపించాడు తండ్రి.

Maharastra: న్యాయం కోసం ఓ తండ్రి పోరాటం.. కూతురు మృతదేహాన్ని 44 రోజులుగా ఉప్పులో ఉంచి..
Maharastra News
Follow us

|

Updated on: Sep 16, 2022 | 8:50 PM

Maharastra: మరణించిన తన కూతురుకు జరిగిన అన్యాయానికి న్యాయం చేయమంటూ ఒక తండ్రి కోరుతున్నాడు. అంతేకాదు మరణించిన తన కుమార్తె మృతదేహాన్ని ఉప్పుతో నిండిన గోతిలో 44 రోజులుగా ఉంచి న్యాయం కోసం ఎదురు చూస్తున్నాడు. ఈ సంఘటన హృదయ విదారక సంఘటన మహారాష్ట్రలోని నందుర్‌బార్ జిల్లాలో చోటులో చేసుకుంది.  27 ఏళ్ల యువతిపై సామూహిక అత్యాచారం జరిగింది. తాను ప్రమాదంలో ఉన్నానని.. తనపై అత్యాచారం జరిగిందని.. ఆ యువతి తన బంధువులకు ఫోన్‌లో చెప్పింది. అంతేకాదు.. తనను దుండగులు చంపేస్తారని చెప్పినట్లు బంధువులు చెప్పారు. అయితే ఆ యువతి ఆత్మహత్య చేసుకుందని తండ్రికి సమాచారం అందింది.

తమ గ్రామం పక్కన ఉన్న వావి గ్రామంలో మామిడి చెట్టుకు వేలాడుతూ యువతి మృతదేహం కనిపించిందని ఆ తండ్రికి చెప్పారు. దీంతో చెట్టుదగ్గరకు కుటుంబసభ్యులువచ్చే సరికి అధరాలు ధ్వంసం చేశారని ఆరోపించాడు తండ్రి. బాధితురాలు ఆత్మహత్య చేసుకుందని పోస్ట్‌మార్టం నివేదిక వచ్చింది.  వైద్యులను సంప్రదించగా.. శరీరంలో గాయాలు ఏమైనా ఉంటే మాత్రమే దర్యాప్తు చేయాలని పోలీసులు కోరినట్లు వైద్య సిబ్బంది.. తమకు చెప్పినట్లు కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. అత్యాచారంపై దర్యాప్తు చేయమని పోలీసులను కోరుతున్నారు.

గ్యాంగ్ రేప్ బాధిత కుమార్తెకు న్యాయం జరగాలని తండ్రి ప్రయత్నాలు: తన కూతురు ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయింది..  చనిపోయిన తర్వాత కూడా తన కూతురికి న్యాయం జరగలేదని తండ్రి ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. అంతేకాదు.. ఎలాగైనా తన కూతురుకి న్యాయం చేయాలని నిశ్చయించుకుని మృతదేహాన్ని ఉప్పుగుంతలో ఉంచాడు. తన డిమాండ్‌కు ప్రభుత్వం, అధికారులు స్పందించి మళ్ళీ కేసుకు సంబంధించిన ఫైల్‌లు మళ్లీ తీరుస్తారని తండ్రి నమ్మకంగా ఉన్నాడు.

ఇవి కూడా చదవండి

తండ్రి నమ్మకం నిజం చేస్తూ.. ఇప్పుడు ఎంపీ హీనా గావ్లీ, ఎస్పీ యువతి మృతి వ్యవహారంపై తిరిగి విచారణకు ఆదేశించారు. మరోసారి మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలిస్తున్నారు. ఇప్పటికే నిందితులను అదుపులోకి తీసుకున్నారు. రంజిత్ ఠాక్రే (వయస్సు 19), సునీల్ అలియాస్ హనా వల్వి (వయస్సు 21), అమర్ అలియాస్ గోతు వల్వి (వయస్సు 18)లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కొత్త శవపరీక్ష నివేదిక కోసం వేచి చేస్తున్నారు.  అయితే పోలీసుల తీరుపై తమకు నమ్మకం లేదని మృతురాలి కుటుంబ సభ్యలు చెబుతున్నారు. కేసును వేరే జిల్లాకు బదిలీ చేయాలని కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. ఈ మొత్తం వ్యవహారంలో ధడ్‌గావ్ తాలూకా పోలీసుల పాత్ర అనుమానాస్పదంగా ఉంది. బాధితురాలు చనిపోయే ముందు బంధువులతో ఫోన్‌లో మాట్లాడినా కూడా పోలీసులు వినకపోవడమే కాదు..  ఆత్మహత్యగా కేసు పెట్టడంపై సర్వత్రా అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

నలుగురు దుండగులు కలిసి అత్యాచారం చేసి చెట్టుకు ఉరివేసారు! బాధితురాలు వివాహిత గిరిజన మహిళ. భర్త నుంచి విడిపోయి నందుర్‌బార్ జిల్లా ధడ్‌గావ్ తాలూకాలో తండ్రితో కలిసి నివసిస్తోంది. రంజీత్ ఠాక్రే, పొరుగున ఉన్న వావి గ్రామానికి చెందిన అతని సహచరులలో ఒకరితో కలిసి బాధితురాలిని బలవంతంగా మోటార్‌సైకిల్‌పై కూర్చోబెట్టుకుని ఎత్తుకెళ్లారని బాధితుడి కుటుంబం ఆరోపించింది. కొద్ది దూరంలోనే మరో ఇద్దరు వ్యక్తులు చేరారు. ఆ తర్వాత బాధితురాలిని గ్రామానికి 20-30 కిలోమీటర్ల దూరం తీసుకెళ్లి ఏకాంత ప్రాంతంలో సామూహిక అత్యాచారం చేశారు. అవకాశం చూసి, బాధితురాలు తన ఫోన్‌లో కుటుంబ సభ్యులను సంప్రదించి.. తనకు ప్రాణాపాయం ఉందని చెప్పింది.

ఆ తర్వాత కూతురు చనిపోయిందని తండ్రికి సమాచారం అందింది. గ్యాంగ్‌రేప్ తర్వాత తన కుమార్తె హత్య చేయబడిందని ఆరోపిస్తూ, పోలీసులు విషయాన్ని కప్పిపుచ్చడానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపించాడు. అంతేకాదు ఈ కేసులో ధడ్గావ్ పోలీసుల పాత్రపై మృతురాలి తండ్రి అనుమానం వ్యక్తం చేశారు. ఆగస్టు 1వ తేదీ నుంచి కూతురి మృతదేహాన్ని ఉప్పుటేరులో భద్రపరచడానికి కారణం ఇదే.

తన కుమార్తె మృతిపై సరైన విచారణ జరిపి, ఆమె మృతదేహానికి మళ్లీ పోస్ట్‌మార్టం చేసే వరకు తన కుమార్తె అంత్యక్రియలు చేయబోనని బాధితురాలి తండ్రి చెప్పారు. తండ్రి పట్టుదల, స్థానికుల ఆగ్రహాన్ని దృష్టిలో ఉంచుకుని యంత్రాంగం మళ్లీ పోస్టుమార్టం నిర్వహించి కేసును సమగ్రంగా విచారించడం ప్రారంభించింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

తెలంగాణ ఇంటర్‌ 2024 ఫలితాలు విడుదల
తెలంగాణ ఇంటర్‌ 2024 ఫలితాలు విడుదల
టీమిండియా రికార్డ్‌కే ఎసరుపెట్టేసిన చెన్నై సూపర్ కింగ్స్
టీమిండియా రికార్డ్‌కే ఎసరుపెట్టేసిన చెన్నై సూపర్ కింగ్స్
పుచ్చకాయ vs కర్జూజా.. వేసవిలో ఆరోగ్యానికి ఏది ఎక్కువ మేలు
పుచ్చకాయ vs కర్జూజా.. వేసవిలో ఆరోగ్యానికి ఏది ఎక్కువ మేలు
రామాయణంలో చిన్నప్పటి సీత పాత్రలో నటిస్తున్న చిన్నారి ఎవరో తెలుసా
రామాయణంలో చిన్నప్పటి సీత పాత్రలో నటిస్తున్న చిన్నారి ఎవరో తెలుసా
క్వీన్ ఆఫ్ మాస్ గా టాలీవుడ్ చందమామ. దిమ్మతిరిగెలా చేస్తున్న కాజల్
క్వీన్ ఆఫ్ మాస్ గా టాలీవుడ్ చందమామ. దిమ్మతిరిగెలా చేస్తున్న కాజల్
తక్కువ ధరకే సీజ్ చేసిన బంగారం.. తీరా చూస్తే షాక్..!
తక్కువ ధరకే సీజ్ చేసిన బంగారం.. తీరా చూస్తే షాక్..!
శూర్ఫణఖతో కళ్యాణం చేయలేను .. అనామికకు ఇచ్చిపడేసిన ఇందిరా దేవి..
శూర్ఫణఖతో కళ్యాణం చేయలేను .. అనామికకు ఇచ్చిపడేసిన ఇందిరా దేవి..
'జుచిని'తో ఇన్ని ప్రయోజనాలా? అవేంటో తెలిస్తే మైండ్‌ బ్లాంకే
'జుచిని'తో ఇన్ని ప్రయోజనాలా? అవేంటో తెలిస్తే మైండ్‌ బ్లాంకే
గాల్లో ఢీకొన్న రెండు హెలికాప్టర్లు.! వీడియో వైరల్.
గాల్లో ఢీకొన్న రెండు హెలికాప్టర్లు.! వీడియో వైరల్.
తెలంగాణ ఇంటర్‌ ఫలితాలు వచ్చేస్తున్నాయ్.. డైరెక్ట్ లింక్ ఇదే
తెలంగాణ ఇంటర్‌ ఫలితాలు వచ్చేస్తున్నాయ్.. డైరెక్ట్ లింక్ ఇదే