Telugu News » National » Heavy Rain In UP: 'Submerged Lucknow’, roads became ponds due to heavy rains, water in residential areas
UP Rains: యూపీలో భారీ వర్షాల బీభత్సం.. గోడకూలి 9 మంది మృతి.. జనజీవనం అస్తవ్యస్తం
Surya Kala |
Updated on: Sep 16, 2022 | 3:29 PM
గత 24 గంటలుగా ఉత్తర్ ప్రదేశ్ లో భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. కురుస్తున్న వానల కారణంగా గోడలు కూలిన ఘటనలో 9 మంది సజీవ సమాధి అయ్యారు. రాష్ట్ర రాజధాని లక్నోలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా లక్నో మొత్తం నీట మునిగింది. పట్టణ ప్రాంతాలు, మార్కెట్లు, లోతట్టు ప్రాంతాలు కూడా జలమయమయ్యాయి.
Sep 16, 2022 | 3:29 PM
లక్నోలో కుండపోతగా కురుస్తున్న వర్షాల కారణంగా పలు చోట్ల నీరు నిలిచిపోయింది. 24 గంటల నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు జనజీవనాన్ని అస్తవ్యస్తం చేశాయి.
1 / 6
దిల్‌కుషా ప్రాంతంలో నేడు ఇంటి గోడ కూలిన ఘటనలో 9 మంది ప్రాణాలు కోల్పోయారు. వీరిలో మహిళలు, చిన్నారులు ఉన్నారు. మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. సమాచారం అందుకున్న అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. ఉన్నావోలో మరో ఘటనలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు.
2 / 6
ఈ ఘటనలపై ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు రూ. 4 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు
3 / 6
రాజధాని లక్నోలో గురువారం రాత్రి నుంచి కురుస్తున్న భారీ వర్షాల కారణంగా లోతట్టు ప్రాంతాల్లో భారీగా నీరు చేరింది. పలు ప్రాంతాల్లో ప్రజల ఇళ్లలోకి కూడా చేరడంతో బాధితులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పలు ప్రాంతాల్లో డ్రెయిన్లు పొంగి పొర్లడంతో వీధులన్నీ నీటితో నిండిపోయాయి.
4 / 6
అర్ధరాత్రి నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు రాజధాని లక్నోలోని పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఆలం ప్రజల ఇళ్లలోని గదుల్లోకి నీరు చేరింది. ప్రమాదం జరగకుండా ఉండేందుకు అన్ని ప్రాంతాల్లో విద్యుత్‌ను నిలిపివేశారు.
5 / 6
రాజధాని లక్నోలో ఎడతెరిపి లేకుండా వర్షం కురిసింది. రోడ్లు నదులను తలపిస్తున్నాయి. ట్రాఫిక్ జామ్ అయింది. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వచ్చింది.