AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

NFDC Recruitment 2022: ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉద్యోగాల కోసం వెదుకుతున్నారా? ఐతే వెంటనే ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోండి..

భారత ప్రభుత్వ సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖకు చెందిన ముంబయిలోని నేషనల్ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (NFDC).. ఒప్పంద ప్రాతిపదికన మీడియా అసిస్టెంట్- మీడియా ప్లానింగ్, మల్టీ టాస్క్ స్టాఫ్..

NFDC Recruitment 2022: ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉద్యోగాల కోసం వెదుకుతున్నారా? ఐతే వెంటనే ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోండి..
Nfdc
Srilakshmi C
|

Updated on: Sep 16, 2022 | 3:13 PM

Share

NFDC Mumbai media assistant – media planning Recruitment 2022: భారత ప్రభుత్వ సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖకు చెందిన ముంబయిలోని నేషనల్ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (NFDC).. ఒప్పంద ప్రాతిపదికన 12 మీడియా అసిస్టెంట్- మీడియా ప్లానింగ్, మల్టీ టాస్క్ స్టాఫ్(ఫైనాన్స్ & అకౌంట్స్) తదితర (Media assistant media planning Posts) పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. పోస్టును బట్టి ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్‌స్టిట్యూట్‌ నుంచి సంబంధిత స్పెషలైజేషన్‌లో హెచ్‌ఎస్‌సీ, డిగ్రీ, పీజీ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సంబంధిత పనిలో నోటిఫికేషన్‌లో సూచించిన విధంగా అనుభవం కూడా ఉండాలి. అలాగే అభ్యర్ధుల వయసు 40 నుంచి 45 ఏళ్ల మధ్య ఉండాలి. ఆసక్తి కలిగిన వారు ఆఫ్‌లైన్‌ విధానంలో సెప్టెంబర్‌ 21, 2022వ తేదీలోపు కింది అడ్రస్‌కు పోస్టు ద్వారా దరఖాస్తులు పంపించవల్సి ఉంటుంది. ఇంటర్వ్యూ, అనుభవం ఆధారంగా అభ్యర్ధులను సెలెక్ట్‌ చేస్తారు. ఎంపికైన వారికి నెలకు రూ.30,000ల నుంచి రూ.70,000ల వరకు జీతంగా చెల్లిస్తారు. ఇతర సమాచారం అధికారిక నోటిఫికేషన్ లో చెక్ చేసుకోవచ్చు.

ఖాళీల వివరాలు..

  • మీడియా అసిస్టెంట్- మీడియా ప్లానింగ్ పోస్టులు: 1
  • మల్టీ టాస్క్ స్టాఫ్(ఫైనాన్స్ & అకౌంట్స్) పోస్టులు: 1
  • సీనియర్ ఎగ్జిక్యూటివ్(అడ్మిన్/ ఈవెంట్స్): పోస్టులు: 1
  • ఫిల్మ్ చెకర్ కమ్ డిజిటల్ టెక్నీషియన్ పోస్టులు: 1
  • కేటలాగింగ్ అసోసియేట్ పోస్టులు: 1
  • గ్రాఫిక్ డిజైనర్ పోస్టులు: 1
  • ఎడిటర్/ అసిస్టెంట్ ప్రోగ్రామింగ్ కోఆర్డినేటర్ పోస్టులు: 1
  • జూనియర్ ఎగ్జిక్యూటివ్ (ఇండస్ట్రీ స్క్రీనింగ్/ ఎగ్జిబిషన్ స్టాల్స్) పోస్టులు: 1
  • ప్రూఫ్ రీడర్ పోస్టులు: 1
  • కోఆర్డినేటర్- డిస్ట్రిబ్యూషన్ వర్క్‌షాప్ పోస్టులు: 1
  • కోఆర్డినేటర్- బుక్ టు బాక్స్ ఆఫీస్ (బుక్ అడాప్టేషన్స్ వర్టికల్) పోస్టులు: 1
  • ఎగ్జిక్యూటివ్- సోషల్ మీడియా పోస్టులు: 1

అడ్రస్: General Manager (P&A), National Film Development Corporation Ltd., Discovery of India Building, 6th Floor, Nehru Centre, Dr. Annie Besant Road, Worli, Mumbai – 400 018.

ఇవి కూడా చదవండి

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

మరిన్ని కెరీర్‌ సంబంధిత వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.