Pollution in Delhi: ఢిల్లీకి పొంచి ఉన్న కాలుష్యం ముప్పు.. పంట అవశేషాలను కాల్చకుండా ఇచ్చే నగదు ప్రోత్సాకాలకు ప్రభుత్వం స్వస్తి..
ఢిల్లీలో మరోసారి కాలుష్యం ముప్పు పొంచి ఉంది. వరి పంట అవశేషాలను కాల్చకుండా ఎకరానికి రూ. 2500లు రైతులకు ఇవ్వాలని ఢిల్లీ, పంజాబ్ ప్రభుత్వాలు ప్రతిపాదించాయి.

Pollution in Delhi: దేశ రాజధాని ఢిల్లీ ఈసారి కూడా భారీ కాలుష్యాన్ని ఎదుర్కోవాల్సి రావచ్చు. ఎందుకంటే ఢిల్లీ, పంజాబ్ ప్రభుత్వాలు చలికాలంలో పంట అవశేషాలను కాల్చకుండా రైతులకు ఇచ్చే నగదు ప్రోత్సాహక పథకాన్ని ఉపసంహరించుకున్నాయి. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో ఢిల్లీలో మరోసారి కాలుష్యం ముప్పు పొంచి ఉంది. వరి పంట అవశేషాలను కాల్చకుండా ఎకరానికి రూ. 2500లు రైతులకు ఇవ్వాలని ఢిల్లీ, పంజాబ్ ప్రభుత్వాలు ప్రతిపాదించాయి. అయితే కేంద్ర ప్రభుత్వం దానిని తిరస్కరించింది. అనంతరం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కుల్‌దీప్ సింగ్ ధలీవాల్ ఈ నిర్ణయాన్ని ప్రకటించారు.
అయితే ఈ ప్రతిపాదనలో కేంద్రం నుంచి ఎకరానికి రూ.1500, పంజాబ్, ఢిల్లీ ప్రభుత్వాల నుంచి రూ.500 ఇవ్వాలని డిమాండ్ చేశారు. HTK నివేదిక ప్రకారం, రెండు రాష్ట్రాలు ఇప్పటికీ తమ చెల్లింపుల వాటాను కొనసాగించాలని భావిస్తున్నాయి. అదే సమయంలో కేంద్రం నుంచి రాష్ట్రానికి తగిన సాయం అందనప్పుడు రైతులకు నగదు ప్రోత్సాహక అవార్డులు రాష్ట్ర ప్రభుత్వం ఎలా ఇస్తుందని మంత్రి ధాలివాల్ అంటున్నారు.
పంజాబ్ ప్రభుత్వ సహకారం: మరోవైపు రాష్ట్రం తీవ్రమైన ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కోకుండా నివారించడానికి తగిన చర్యలు చేపట్టింది. దుబారాను నివారించాలని మంత్రి తన అధికారులను ఆదేశించారు. ధాలివాల్ ప్రకటనపై ఇప్పటి వరకూ ఎటువంటి అభ్యంతరాలు వినిపించలేదు. అయితే ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వ తీర్మానం ప్రకారం.. పంజాబ్, ఢిల్లీ ప్రభుత్వాలు ఒక్కొక్కటి ₹ 375 కోట్లు ఇవ్వాలని.. కేంద్రం నుండి 1,125 కోట్ల రూపాయలను తీసుకున్నాయని అధికారులు తెలిపారు.




ఇన్ సిటు నిర్వహణ యంత్రాన్ని సబ్సిడీపై ఇస్తున్న ప్రభుత్వాలు: పంజాబ్, ఢిల్లీ ప్రభుత్వాలు రైతులకు ఎక్కువ ప్రయోజనం చేకూర్చే ప్రాజెక్టును రూపొందించాయని, అయితే కేంద్రం దానిని తిరస్కరించిందని అన్నారు. “అయితే పంజాబ్ ప్రభుత్వం రైతులకు వరి గడ్డిని కోసే యంత్రాలను సబ్సిడీ లో అందిస్తోంది. పంట అవశేషాలను కాల్చకుండా రైతులను ఒప్పిస్తోంది. రాయితీ యంత్రాలకు మొత్తం రూ.452 కోట్లు ఖర్చవుతుందని, 32,100 వివిధ రకాల యంత్రాలను రైతులకు అందజేస్తామని ధాలివాల్ తెలిపారు.
పుసా బయో డీకంపోజర్: ఇదిలా ఉండగా, ప్రత్యామ్నాయ ప్రణాళిక ప్రకారం, ఢిల్లీ, పంజాబ్ రాష్ట్రాల్లోని 5,000 ఎకరాల భూమిలో పుసా బయో-డికంపోజర్ అనే సూక్ష్మజీవుల ద్రావణాన్ని ఏర్పాటు చేశాయి. దీని ద్వారా 15 నుండి 20 రోజులలో వరి గడ్డిని కుళ్లిపోయేలా చేస్తారు. 15 నుండి 20 రోజుల్లో వరి గడ్డి కుపోతుంది. దీనిని రైతులు తిరిగి ఎరువుగా ఉపయోగిస్తారు.
ఈ ఏడాది పంజాబ్‌లో వరి సాగు ఇండియన్ అగ్రికల్చరల్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (IARI) సహాయంతో అమలు చేయనున్న పైలట్ ప్రాజెక్ట్‌లో భాగంగా పంజాబ్‌లోని 5,000 ఎకరాలు లేదా 2,023 హెక్టార్ల భూమిలో బయో-డీకంపోజర్ స్ప్రే చేయబడుతుంది. ఈ ఏడాది పంజాబ్‌లో వరి సాగు విస్తీర్ణం 29-30 లక్షల హెక్టార్లుగా అంచనా వేయబడింది. రాష్ట్రం సంవత్సరానికి సగటున 20 మిలియన్ టన్నుల వరి గడ్డిని ఉత్పత్తి చేస్తుంది
బయో డికంపోజర్ స్ప్రే: పంజాబ్ వ్యవసాయ మంత్రి కుల్దీప్ ధాలివాల్ , IARI పూసా అధికారులతో వంట అవశేష కాలుష్యంపై సంయుక్త సమావేశం నిర్వహించారు. IARI పర్యవేక్షణలో ఈ సంవత్సరం పైలట్ ప్రాజెక్ట్‌గా, పంజాబ్‌లోని కొన్ని ప్రాంతాల్లో బయో డికంపోజర్‌ను ఉచితంగా పిచికారీ చేయాలని నిర్ణయించారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..