Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఉగాది పంచాంగం 2025 : తులా రాశివారి ఫలితాలు! వీడియో

ఉగాది పంచాంగం 2025 : తులా రాశివారి ఫలితాలు! వీడియో

Samatha J

|

Updated on: Mar 30, 2025 | 9:43 AM

తుల రాశి వారికి ఈ సంవత్సరం భాగ్యస్థానంలో బృహస్పతి అనుకూలంగా సంచరించడం. తులా రాశి వారికి ఈ సంవత్సరం ఆరవ స్థానం అయినటువంటి శత్రు స్థానంలో శని అనుకూలంగా సంచరించడం. ఇక తులా రాశి వారికి పంచమంలో రాహువు, లాభంలో కేతువు అనుకూలంగా వ్యవహరించడం చేత తులా రాశి వారికి శ్రీ విశ్వవసు నామ సంవత్సరం అన్ని విధాలుగా కలిసి వచ్చేటటువంటి సంవత్సరం. తులా రాశి వారి గత కొంతకాలంగా ఏవైతే ఇబ్బందులు, సమస్యలు మీరు చూశారా ఆ సమస్యల నుండి అధికమించి బయటికి వచ్చి శుభ ఫలితాలు పొందుతారు. సంతానపరంగా ఆనందం, కుటుంబపరంగా ఆనందం స్పష్టంగా కనబడుతుంది. తులా రాశి వారికి అప్పుల బాధలు తొలగుతాయి. ఆర్థికంగా ముందుకు వెళ్తారు. తులా రాశి నిరుద్యోగులకు ఉద్యోగం వచ్చేటటువంటి అవకాశం ఈ సంవత్సరం స్పష్టంగా ఉంది.

ఉద్యోగులకు ఉద్యోగాల్లో ప్రమోషన్లు, ట్రాన్స్ఫర్లు అంటీవి కలిసి వస్తాయి. తులా రాశి వ్యాపారస్తులకి ఇది అద్భుతమైన అనుకూలమైన సంవత్సరం. తులా రాశి రైతాంగం, సినీరంగం, మీడియా రంగం వంటి రంగాలలో ఉన్నటువంటి వారికి ఈ సంవత్సరం కలిసి వస్తుంది. తులా రాశి రాజకీయ నాయకులకు ఇది అనుకూలమైనటువంటి అద్భుతమైనటువంటి సంవత్సరం. తులా రాశి వారికి ఈ సంవత్సరం వృత్తి, ఉద్యోగ, వ్యాపారపరంగా కలిసి వస్తుందని మరొక్కసారి తెలియజేస్తూ, తులా రాశి విద్యార్థులకి మధ్యస్థం నుండి అనుకూల ఫలితాలు పొందుతారు. తులా రాశి స్త్రీలు శుభకార్యాల్లో పాల్గొనడం, కొత్త వస్త్రాలు అంటీవి కొనుక్కోవడం, అలాగే నూతనంగా ఏమైనా కొనాలనేటువంటి విషయాల్లో అన్ని కూడా మీరు అనుకున్నటువంటి విధంగా కొనడం ఇవన్నీ కూడా మీకు కలిసి వస్తాయి. తులా రాశి వారికి ఈ సంవత్సరం గృహయోగం, శుభయోగాలు అంటే యోగాలు స్పష్టంగా కనబడుతున్నాయి. తులా రాశి వారు ఈ సంవత్సరం మంచి పేరును సంపాదించుకుంటారు. కుటుంబంలో కూడా మీకు గౌరవం, ఆనందం కూడా కలిసి వస్తాయి. తులా రాశి వారు ఈ సంవత్సరం మరింత శుభ ఫలితాలు పొందాలి అనుకుంటే లక్ష్మీదేవిని పూజించండి. కనకధారా స్తోత్రం వంటి స్తోత్రాలని పారాయణం చేయండి. అలాగే తులా రాశి వారు ముఖ్యంగా ఆదివారం రోజు సూర్యాష్టకం అంటీవి పఠించడం చేత మరింత శుభ ఫలితాలు పొందుతారు.

మరిన్ని వీడియోల కోసం :

ఉగాది పంచాంగం 2025 : సింహ రాశివారి ఫలితాలు! వీడియో

ఉగాది పంచాంగం 2025 : మిథున రాశివారి ఫలితాలు! వీడియో

ఉగాది పంచాంగం 2025 : వృషభ రాశి వారి ఫలితాలు ఇవే!

ఉగాది పంచాంగం 2025 : మేషరాశివారి ఉగాది రాశిఫలాలు.. కాస్త కష్టకాలమే!