ఉగాది పంచాంగం 2025 : కుంభ రాశివారి ఫలితాలు! వీడియో
కుంభ రాశి వారికి ముఖ్యంగా ఈ సంవత్సరం జన్మ రాశిలో రాహువు, కలత్రంలో కేతువు ధనస్థానం, కుటుంబస్థానం, వాక్ స్థానంలో శని సంచారం. అలాగే కుంభ రాశి వారికి బృహస్పతి చతుర్థంలో అనుకూలంగా ఉండటం చేత కుంభరాశి వారికి ఏలినాటి శని ప్రభావం ఉన్నప్పటికీ ఆఖరి దశలో ఉన్నప్పటికీ ఈ సంవత్సరం మధ్యస్థ ఫలితాలు ఇస్తుంది. కుంభ రాశి వారికి గత రెండు మూడు సంవత్సరాలతో పోల్చుకుంటే ఈ సంవత్సరం కొంచెం మెరుగ్గా ఉంది. ఇంతే కుంభ రాశి వారికి ఇంకా ఏలినాటి శని ప్రభావం ఉండటం, గురుబలం ఉండటం చేత వారు చేసేటువంటి పనుల్లో, ప్రయత్నాలలో కొంత సఫలీకృతం అయితే అవుతారు. కుంభరాశి వారు టెన్షన్లకి, రాజకీయాలకి దూరంగా ఉండాలి. జన్మరాశిలో రాహువు ప్రభావం చేత ఆవేశపూరిత నిర్ణయాలు, కుటుంబ సమస్యలు ఈ సంవత్సరం మిమ్మల్ని వేధిస్తాయి. కుంభరాశి వారు ఎవరితో గొడవ పెట్టుకోకుండా ఎవరిని ఒక మాట అనవసరంగా అనొద్దు అని మాత్రం తెలియజేస్తున్నాను. కుంభరాశి వారికి జన్మరాహువు ప్రభావం చేత టెన్షన్లు, గొడవలు, ఆరోగ్య సమస్యలు, కుటుంబ సమస్యలు అధికంగా ఇబ్బంది పెడతాయి. ఎందుకంటే కలత్రంలో కేతువు జన్మరాహువు. వివాహం అయినటువంటి వారికి ఈ సంవత్సరం కుటుంబంలో సమస్యలతో కూడుకున్నటువంటి వాతావరణం ఉండేటువంటి స్థితి ఉంది.
కుంభరాశి వారు ఈ సంవత్సరం వృత్తి, ఉద్యోగ, వ్యాపారపరంగా మధ్యస్థ ఫలితాలు చూస్తారు. కుటుంబపరంగా మాత్రం ఆరోగ్యపరంగా మాత్రం కొంచెం చెడు ఫలితాలు చూసేటువంటి స్థితి ఉంది. కుంభరాశి ఉద్యోగస్తులకు ఉద్యోగాలలో టెన్షన్ అధికం. వ్యాపారస్తులకి గత సంవత్సరాల మీద వ్యాపారం బాగుంటుంది కానీ వ్యాపారంలో కూడా కొంచెం ఇబ్బందులు మాత్రం ఉంటాయి. కుంభరాశి మీడియా రంగం, రైతాంగం, శిల్పి రంగం వారికి మధ్యస్థ ఫలితాలు ఉన్నాయి. కుంభరాశి రాజకీయ నాయకులకు ఈ సంవత్సరం అంతా అనుకూలంగా లేదు. రాజకీయపరంగా ఇబ్బందులు మాత్రం తప్పేడట్లేదు. మీరు మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలి. కుంభరాశి విద్యార్థులకు ఈ సంవత్సరం కలిసి వస్తుంది. మొత్తం మీద శ్రీ విశ్వనాధ సంవత్సరం కుంభరాశి వారికి వృత్తి, ఉద్యోగ, వ్యాపారపరంగా మధ్యస్థ ఫలితాలు ఈ సంవత్సరం అధికంగా ఉన్నాయి. కుంభరాశి వారు చిలకమర్తి పంచాంగ ప్రకారం మరింత శుభ ఫలితాలు మీరు ఈ సంవత్సరం పొందాలంటే దశరథ ప్రవక్త శని స్తోత్రాన్ని ఓం నమః కృష్ణాయ నీలాయ శిఖండ నివాయ నమః కాళాగ్ని రూపాయ కృతాంతాయ నమః అనేటువంటి దశరథ ప్రవక్త శని స్తోత్రాన్ని శనివారం రోజు పఠించండి. దక్షిణామూర్తి స్తోత్రాన్ని పారాయణం చేయండి. అలాగే కుంభరాశి వారు ముఖ్యంగా ఈ సంవత్సరం నవగ్రహ పీడార స్తోత్రాన్ని ఆదివారం పఠించండి. శనివారం రోజు శనికి తైలాభిషేకం వంటివి చేసుకోండి.
మరిన్ని వీడియోల కోసం :
ఉగాది పంచాంగం 2025 : సింహ రాశివారి ఫలితాలు! వీడియో
ఉగాది పంచాంగం 2025 : మిథున రాశివారి ఫలితాలు! వీడియో
ఉగాది పంచాంగం 2025 : వృషభ రాశి వారి ఫలితాలు ఇవే!
ఉగాది పంచాంగం 2025 : మేషరాశివారి ఉగాది రాశిఫలాలు.. కాస్త కష్టకాలమే!

జ్యోతిష్యం చెబుతుండగా తుర్రుమన్న చిలక.. ఆ తర్వాత

ప్రమాదంలో గాయపడిన కొండముచ్చు.. స్థానికులు ఏం చేశారంటే

ఆకలి మీదున్న పాము.. తేలును ఎలా మింగేసిందో చూడండి.. బాబోయ్

పదిహేను అడుగుల కింగ్ కోబ్రాల సయ్యాట..

రాములోరి గుడి సమీపాన అదో మాదిరి ఆకారం.. వెళ్లి చూడగా..

భార్య తల నరికి సైకిల్ బుట్టలో పెట్టుకున్న భర్త.. తర్వాత వీడియో

సైకిల్ పై గడ్డిమోపుతో ట్రంప్.. వీడియో వైరల్
