ఉగాది పంచాంగం 2025 : మకర రాశివారి ఫలితాలు! వీడియో
మకర రాశి వారికి ముఖ్యంగా ఈ సంవత్సరం ఏలినాటి శని పూర్తి అవ్వడం, శని తృతీయ స్థానంలో అనుకూలంగా సంచరించడం. ఇక మకర రాశి వారికి ఈ సంవత్సరం వాక్ స్థానంలో రాహువు, అష్టమ కేతువు ప్రభావం. ఇంక మకర రాశి వారికి శత్రు స్థానంలో బృహస్పతి సంచరించడం చేత ఎవరైతే మకర రాశి వారు ఏలినాటి శని పూర్తి అయిపోయిందని భావిస్తున్నారో వారు ఈ సంవత్సరం జాగ్రత్తగా ఉండాలి. మకర రాశి వారికి శ్రీ విశ్వవసు నామ సంవత్సరం అంతా అనుకూలంగా లేదు. ఈ సంవత్సరం మకర రాశికి ముఖ్యంగా వృత్తి ఉద్యోగ వ్యాపారపరంగా శత్రుభాద, రాజకీయ బాధలు అధికంగా ఉన్నాయి. నిరుద్యోగులకు ఉద్యోగ ప్రయత్నాల్లో ఇబ్బందులు, ఉద్యోగస్తులకు ఉద్యోగంలో రాజకీయ ఒత్తిళ్లు అధికంగా ఉంటాయి. మకర రాశి వారు ఈ సంవత్సరం నోరు అదుపులో పెట్టుకోవాలి. ఎదుటి వారితో మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. ఆవేశపూరిత నిర్ణయాల వలన గొడవల వలన ఇబ్బందులు తెచ్చుకునేటువంటి స్థితి మకర రాశి వారికి ఉంది. వాక్ స్థానంలో ఉన్నటువంటి రాహువు ప్రభావం చేత మకర రాశి వారు జాగ్రత్త వహించాలని తెలియజేస్తున్నాను. మకర రాశి వ్యాపారస్తులకు ఇది మధ్యస్థ సమయం. వ్యాపారపరంగా కొంత అభివృద్ధి, ధన నష్టాల నుంచి కొంచెం లాభ స్థానం వైపు వెళ్ళినప్పటికీ, వ్యాపారపరంగా గత సంవత్సరంతో పోల్చుకుంటే ఈ సంవత్సరం కొంత అనుకూలిస్తుంది.
మకర రాశి రైతాంగాం, సినిమా రంగం, మీడియా రంగంలో ఉన్నటువంటి వారికి మధ్యస్థ ఫలితాలున్నాయి. ఎదుటి వారితో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా వ్యవహరించాలి. మకర రాశి వారికి శత్రు స్థానంలో బృహస్పతి, వాక్ స్థానంలో రాహువు ప్రభావం చేత గొడవలకి శత్రువులతో వ్యవహరించేటువంటి విషయాల్లో జాగ్రత్తలు మాత్రం వహించాలి. రాజకీయ ఒత్తిళ్లు ఉంటాయి. మకర రాశి రాజకీయ నాయకులకు ఇది కలిసి రానటువంటి సమయం. మకర రాశి రాజకీయ నాయకులు ఏం మాట్లాడిన సరే అది వివాదం అయిపోవడం. వారికి పౌరుషంగా ఈ సంవత్సరం మాట్లాడేటువంటి స్థితుల వల్ల ఇబ్బందులకరమైనటువంటి స్థితిలో ఉండడం. వారు ఏం మాట్లాడినా అందులో మంచి కానీ తప్పుడు ప్రచారం అయ్యేటువంటి స్థితి ఉంది. మకర రాశి వారికి ఈ సంవత్సరం కుటుంబంలో సమస్యలు, ఆరోగ్య సమస్యలు కూడా కొంత వేధిస్తాయి. మొత్తం మీద మకర రాశి వారికి శ్రీ విశ్వవసు నామ సంవత్సరం మధ్యస్థం నుండి చెడు ఫలితాలు అధికంగా ఉన్నాయి. మకర రాశి వారు చిలకమర్రి పంచాంగం ప్రకారం మరింత శుభ ఫలితాలు మీరు ఈ సంవత్సరం పొందాలంటే ఆచరించవలసిన పరిహారాలు ఏమిటంటే ఈ సంవత్సరం మకర రాశి వారు దుర్గాదేవిని, సుబ్రహ్మణ్యేశ్వరుని పూజించాలి. అనారోగ్య సమస్యలు ఎక్కువైతే విఘ్నేశ్వరుని కూడా పూజించాలి. ఇంకా మకర రాశి వారు దక్షిణామూర్తిని, దత్తాత్రేయుని పూజించడం చేత మరింత శుభ ఫలితాలు పొందగలరు. మౌనం వ్యాఖ్యానం అనేటువంటి దక్షిణామూర్తి స్తోత్రాన్ని నిత్యం పారాయణం చేయండి. నవగ్రహ పీడార స్తోత్రాన్ని పఠించడం వల్ల మరింత శుభ ఫలితాలు పొందుతారు.
మరిన్ని వీడియోల కోసం :