ఉగాది పంచాంగం 2025 : ధనస్సు రాశివారి ఫలితాలు! వీడియో
ధనస్సు రాశికి ముఖ్యంగా ఈ సంవత్సరం చతుర్ధ స్థానంలో శని అర్ధాష్టమ శని ప్రభావం ఉండడం. అయితే ధనస్సు రాశికి అర్ధాష్టమ శని ప్రభావం ఉన్నప్పటికీ గురుడు కలత్రంలో అనుకూలంగా సంచరించడం. ఇంకా ధనస్సు రాశికి తృతీయ స్థానంలో రాహువు భాగ్యంలో కేతు అనుకూలంగా వ్యవహరించడం చేత మధ్యస్థ ఫలితాలు ఉన్నాయి. ధనస్సు రాశికి ఈ సంవత్సరం అర్ధాష్టమ శని ప్రభావం ఉన్నప్పటికీ ఇబ్బందికరమైనటువంటి వాతావరణం కుటుంబంలో అలాగే మీరు వృత్తి ఉద్యోగాలు కొంత ఉన్నప్పటికీ గురుబలం చేత మీ యొక్క సమస్యలనుండి బయటకు వస్తారు. ధనస్సు రాశి వారు గొడవలకు దూరంగా ఉండాలి. ప్రశాంతంగా ఉండేటటువంటి ప్రయత్నం చేయాలి. కుటుంబంలో ఏదో ఒక సమస్య మాత్రమే మిమ్మల్ని వేధిస్తుంది. ఇక ధనస్సు రాశికి ఈ సంవత్సరం ముఖ్యంగా నిరుద్యోగులకు ఉద్యోగా ప్రయత్నాలు కొంత సఫలీకృతం అవుతాయి.
ఉద్యోగస్తులకు పని ఒత్తిళ్లు రాజకీయ ఒత్తిళ్లు ఉంటాయి. ధనస్సు రాశి వ్యాపారస్తులకు ఇది మధ్యస్థ సమయం. వ్యాపారపరంగా కొంత చికాకులు అధికంగా ఉంటాయి. ధనస్సు రాశి రైతులు, సినిమా రంగం, మీడియా రంగం అటువంటి రంగాల్లో ఉన్నటువంటి వారికి మధ్యస్థ ఫలితాలు కనబడుతున్నాయి. అర్ధాష్టమ శని ప్రభావం చేత మిగతా గ్రహాలు కొంత అనుకూలంగా ఉన్నప్పటికీ సమయానికి రావాల్సిన డబ్బులు సమయానికి రాకపోవడం, మీ దగ్గర పని చేసేవారు మీకు కొంత అనుకూలంగా వ్యవహరించకపోవడం చేత కొంత ఇబ్బందులు మాత్రం కలుగుతాయి. ధనస్సు రాశి విద్యార్థులకు ఈ సంవత్సరం కలిసి వస్తుంది. ధనస్సు రాశి స్త్రీలకు బాగుంటుంది కానీ రాజకీయాలకు మాత్రం దూరంగా ఉండాలి. ధనస్సు రాశికి మొత్తానికి శ్రీ విశ్వవసు నామ సంవత్సరం మధ్యస్థ ఫలితాలు అధికంగా కనబడుతాయని తెలియజేస్తూ మీరు మరింత శుభ ఫలితాలు పొందాలంటే చిలకమర్తి పంచాంగ రచయిత ఈ రకమైనటువంటి పరిహారాలు ఈ సంవత్సరం మీరు పాటించాలి. ధనస్సు రాశి వారు శనివారం రోజు శనికి తైలాభిషేకం చేసుకోవడం, మందపల్లి తిరునల్లారు వంటి శనికి సంబంధించినటువంటి క్షేత్రాలు దర్శించుకోవడం, దశరథ ప్రోక్త శని స్తోత్రం వంటి స్తోత్రాలు పారాయణం చేయడం అలాగే నవగ్రహ పీడారహ స్తోత్రాన్ని పఠించడం చేత మరింత శుభ ఫలితాలు పొందగలుగుతారు.
మరిన్ని వీడియోల కోసం :