ఉగాది పండుగ వచ్చేసింది. ఈ పండుగకు హిందూ సాంప్రదాయంలో ప్రత్యేక ప్రాముఖ్యత ఉంటుంది. ముఖ్యంగా ఉగాదిని హిందువులు కొత్త సంవత్సరంగా భావిస్తారు.
ఈరోజు కొత్త బట్టలు ధరించి, ఆలయాలకు వెళ్లి ఇష్టదైవానికి పూజలు చేయడమే కాకుండా రకరకాల పిండివంటలు కూడా వండుతారు.
అయితే ఇలాంటి పెద్ద పండగ రోజున ఎట్టిపరిస్థితుల్లో కొన్ని తప్పులను అస్సలే చేయకూడదంట. అవి ఏవో ఇప్పుడు తెలుసుకుందాం.
ఉగాది పండుగ రోజున అస్సలే ఆలస్యంగా నిద్రలేవకూడదంట. ఈరోజు ఉదయం నాలుగు గంటలకే లేచి, పూజ చేయడం వలన ఆర్థికంగా కలిసివస్తుందంట.
అలాగే ఉగాది పండగ రోజున పితృదేవతలను స్మరించుకోవడం వలన ఏవైనా దోషాలు ఉంటే తొలిగిపోతాయంట. ఎలాంటి సమస్యలు దరిచేరవు.
హిందువుల కొత్త సంవత్సరంగా భావించే ఉగాది పండుగ రోజున అస్సలే అశుభం పలకకూడదంట. ఈరోజున పాజిటివ్ ఆలోచనలతో ఉండటం చాలా మంచిదంట.
ఉగాది పండుగ రోజు అస్సలే నిరాశగా ఉండగకూడదంట. నేడు చాలా ఆనందంగా, కుటుంబసభ్యులతో సంతోషంగా గడపాలంట. దీని వలన సంవత్సరం మొత్తం కూడా బాగుంటుంది.
ఈ రోజు ఎట్టిపరిస్థితుల్లోను ఎవ్వరితో గొడవలకు వెళ్లకూడదంట. ఇంట్లో కూడా అస్సలే గొడవపడకూడదంట. చాలా సున్నితంగా మాట్లాడుతూ, ప్రశాంతంగా గడపాలంటున్నారు పండితులు.