AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PM Modi Birthday: శనివారం ప్రధాని మోడీ పుట్టినరోజు.. మధ్యప్రదేశ్ పర్యటనలో బిజిబిజీ.. పలు ప్రాజెక్టులకు శ్రీకారం

ప్రధాని మోడీ మధ్యప్రదేశ్ పర్యటనలో వివిధ కార్యక్రమాలతో బిజీబిజీగా గడపనున్నారు. ఈక్రమంలో ప్ర‌ధాన మంత్రి కౌశ‌ల్ వికాస్ యోజ‌న కింద నాలుగు ట్రైబ‌ల్ గ్రూప్స్ స్కిల్లింగ్ కేంద్రాల‌ను ప్రధాని మోడీ ప్రారంభించ‌నున్నారు

PM Modi Birthday: శనివారం ప్రధాని మోడీ పుట్టినరోజు.. మధ్యప్రదేశ్ పర్యటనలో బిజిబిజీ.. పలు ప్రాజెక్టులకు శ్రీకారం
Pm Modi Mp Tour
Follow us
Surya Kala

|

Updated on: Sep 16, 2022 | 7:22 PM

PM Modi Birthday: ప్రధాని నరేంద్ర మోడీ 72వ జన్మదినోత్స వేడుకలను శనివారం (సెప్టెంబరు 17వ తేదీన) జరుపుకోనున్నారు. ఈ సంవత్సరం ప్రధాని మోడీ తన పుట్టినరోజును మధ్యప్రదేశ్‌లో (Madhya Pradesh) జరుపుకోనున్నారు. ప్ర‌ధాని మోడీ పర్యటన నేపథ్యంలో అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ప్రధాని మోడీ పుట్టిన రోజు సందర్భంగా ముందుగా తల్లి నుంచి ఆశీర్వాదం తీసుకుని అనంతరం.. మధ్యప్రదేశ్ కు చేరుకోనున్నారు. ప్రధాని మోడీ తన పర్యటనలో  భాగంగా వివిధ కార్యక్రమాలతో బిజీబిజీగా గడపనున్నారు. ఈక్రమంలో ప్ర‌ధాన మంత్రి కౌశ‌ల్ వికాస్ యోజ‌న కింద నాలుగు ట్రైబ‌ల్ గ్రూప్స్ స్కిల్లింగ్ కేంద్రాల‌ను ప్రధాని మోడీ ప్రారంభించ‌నున్నారు. వన్యప్రాణులు, పర్యావరణం, మహిళా సాధికారత, నైపుణ్యాలు, యువత అభివృద్ధి, నెక్స్ట్ జనరేషన్ వంటి ఇన్‌ఫ్రా  వంటి విభిన్న రంగాలపై ప్రధాని మోడీ ప్రసంగించనున్నారు. ముఖ్యమైన నాలుగు ప్రసంగాలను మోడీ ఇవ్వనున్నారు.

అంతేకాదు నమీబియా నుండి కునో నేషనల్ పార్క్‌కు తీసుకొని వచ్చిన ఎనిమిది చిరుతలకు స్వాగతం పలకనున్నారు. ఓ ఖండంలో జీవిస్తున్న చిరుతపులులను మరో ఖండంలో ప్రవేశపెట్టడం ప్రపంచంలో ఇదే ప్రథమం. చిరుతలు భారత్‌కు వచ్చిన  సందర్భంగా తొలుత జాతిని ఉద్దేశించి ప్రధాని మోడీ ప్రసంగించనున్నారు. అనంతరం ఎంపీపీలో మహిళా స్వయం సహాయక సంఘాల సదస్సులో ప్రసంగిస్తారు. అనంతరం విశ్వకర్మ జయంతి సందర్భంగా ఐటీఐ విద్యార్థుల తొలి దీక్షాంత సమరోత్‌లో విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగిస్తారు. ఈ కార్యక్రమంలో దాదాపు 40 లక్షల మంది విద్యార్థులు హాజరుకానున్నారు. శనివారం సాయంత్రం ముఖ్యమైన నేషనల్ లాజిస్టిక్స్ పాలసీని ప్రారంభించి.. ఈ సందర్భంగా ప్రసంగించనున్నారు. ఇక మరో వైపు శనివారం దేశవ్యాప్తంగా “సేవా పఖ్వాడా” కింద వివిధ కార్యక్రమాలు కూడా నిర్వహించడానికి రెడీ అవుతున్న సంగతి తెలిసిందే.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఇవి కూడా చదవండి