వేసవిలో రోజూ గ్లాసుడు చెరకు రసం తాగితే ఏమవుతుందో తెలుసా?

30 March 2025

TV9 Telugu

TV9 Telugu

మండే ఎండల్లో ఓ గ్లాసు చల్లని చెరకు రసం తాగితే హాయిగా అనిపిస్తుంది. క్షణాల్లో శరీరం ఉత్తేజితమవుతుంది. ఇందులోని చక్కెరలు, పోషక ఖనిజాలే అందుకు కారణం

TV9 Telugu

అందుకే చాలా మంది వేసవిలో శరీరాన్ని చల్లగా ఉంచడానికి, తక్షణ శక్తికి చెరకు రసం తాగుతుంటారు. దీని తియ్యని రుచి నాలుక నుంచి పేగుల ద్వారా కడుపులోకి అలా జారుతుంటే ఆ మజానే వేరు

TV9 Telugu

చెరకులో పిండిపదార్థాలు, మాంసకృత్తులతోపాటు పొటాషియం, జింక్‌, ఫాస్ఫరస్‌, క్యాల్షియం, ఐరన్‌ లాంటి ఖనిజాలుంటాయి. విటమిన్‌-ఎ, బి, సి కూడా ఎక్కువే. అలాగే ఇందులో విటమిన్లతోపాటు ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లు, సహజ చక్కెరలు అధికంగా ఉంటాయి

TV9 Telugu

చెరకు రసంలో సహజ గ్లూకోజ్ ఉంటుంది. ఇది శరీరానికి తక్షణ శక్తిని అందిస్తుంది. వేసవిలో వేడి దెబ్బను నివారించడానికి, బలహీనతను తొలగించడానికి దీనిని తాగడం చాలా ప్రయోజనకరంగా ఉంటుంది

TV9 Telugu

వేసవిలో శరీరం నుంచి అధిక చెమట వెలువడటం కారణంగా డీహైడ్రేషన్ సంభవించవచ్చు. చెరకు రసం ఎలక్ట్రోలైట్ సమతుల్యతను కాపాడుతుంది. శరీరాన్ని హైడ్రేట్ చేస్తుంది

TV9 Telugu

చెరకు రసం కాలేయానికి చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఇది శరీరాన్ని డీటాక్సిఫై చేసి టాక్సిన్స్ ను బయటకు పంపుతుంది. అంతేకాకుండా కామెర్ల నివారణకు కూడా చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. కాలేయాన్ని నిర్విషీకరణ చేస్తుంది

TV9 Telugu

చెరకు రసంలో ఉండే యాంటీఆక్సిడెంట్లు శరీర వ్యాధి నిరోధకతను పెంచుతాయి. ఇన్ఫెక్షన్ల నుంచి రక్షించడంలో సహాయపడతాయి. రోగనిరోధక శక్తి బలపడుతుంది. చెరకులో ఉండే గ్లైకోలిక్ ఆమ్లం, యాంటీఆక్సిడెంట్లు చర్మాన్ని ఆరోగ్యంగా, ప్రకాశవంతంగా మారుస్తాయి

TV9 Telugu

ముఖంపై మొటిమలు, మచ్చలు ఉంటే చెరకు రసం సులువుగా తొలగిస్తుంది. చర్మాన్ని మెరిసేలా చేస్తుంది. చెరకు రసం జీర్ణక్రియను కూడా మెరుగుపరుస్తుంది. మలబద్ధకం, గ్యాస్, ఆమ్లత్వం, గుండెల్లో మంటను తగ్గిస్తుంది. ఇందులో మంచి పరిమాణంలో ఫైబర్ ఉంటుంది