కర్బూజా తిన్న తర్వాత నీళ్లు తాగారో.. బండి షెడ్డుకే!
30 March 2025
TV9 Telugu
TV9 Telugu
పచ్చగా మిలమిలలాడుతూ ఉండే కర్బూజ ఏడాది మొత్తం లభిస్తుంది. ఈ పండులో దాదాపు 90 శాతానికి పైగా నీరు ఉంటుంది. ఇది దప్పిక తీర్చడంతోపాటు తక్షణ శక్తిని అందిస్తుంది
TV9 Telugu
ఒంట్లో వేడినీ చల్లబరిచి హాయినిస్తుంది. అందుకే వీటిని సూపర్ ఫుడ్స్ అంటారు. ఇందులో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి దీన్ని తీసుకోవడం వల్ల శరీరంలో డీహైడ్రేషన్ జరగదు
TV9 Telugu
కర్బూజ తిన్న తర్వాత నీళ్లు ఎందుకు తాగకూడదని అందరూ చెబుతుంటారు. దీని వెనుక కారణం ఏమిటి? కర్బూజ తిన్న తర్వాత నీళ్లు ఎందుకు తాగకూడదో ఇక్కడ తెలుసుకుందాం..
TV9 Telugu
ఇందులో 90 శాతం నీరు ఉంటుంది. వీటిని తిన్న తర్వాత నీరు తాగితే శరీరంలోని కఫ దోష సమతుల్యత చెదిరిపోతుంది. దీంతో దగ్గు సమస్యను పెంచుతుంది
TV9 Telugu
శరీరంలో కఫ దోషం పెరగడం వల్ల, దగ్గు, కఫం, ఇన్ఫెక్షన్, జ్వరం వంటి సమస్యలు తలెత్తుతాయి. కొంతమందికి కర్బూజా తిన్న తర్వాత నీళ్లు తాగితే అజీర్ణం, గ్యాస్, కడుపు నొప్పి వస్తుంది
TV9 Telugu
మలబద్ధకం లేదా అజీర్ణం సమస్య కూడా తలెత్తుతుంది. కాబట్టి, కర్బూజా తిన్న వెంటనే మర్చిపోయి కూడా నీళ్లు తాగకూడదు
TV9 Telugu
కర్బూజ తిన్న తర్వాత, కనీసం 40 నుంచి 45 నిమిషాల తర్వాత మాత్రమే నీళ్లు తాగాలి. దీనివల్ల జీర్ణ సమస్యలు రావు. అలాగే కర్బూజ ఎల్లప్పుడూ ఆహారం తిన్న తర్వాతే తినాలని నిపుణులు అంటున్నారు
TV9 Telugu
దీనివల్ల కడుపు సంబంధిత సమస్యలు కూడా రావు. అలాగే అల్పాహారంగానూ తీసుకోవచ్చు. దీనిలోని పీచు పొట్ట నిండిన భావనను కలిగించి ఎక్కువ సమయం ఆకలిగా అనిపించకుండా చేస్తుంది