JEE Mains 2025 Session 2: జేఈఈ మెయిన్ తుది విడత పరీక్షలో కీలక మార్పు.. వారికి కొత్త పరీక్ష తేదీలు!
బీటెక్, బీఆర్క్ సీట్ల భర్తీకి సంబంధించి జేఈఈ మెయిన్-2025 తుది విడత పరీక్షలు ఏప్రిల్ 2 నుంచి మొదలు కానున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో జేఈఈ మెయిన్ 2025 రెండో విడత పరీక్షల అడ్మిట్ కార్డులను ఎన్టీయే తాజాగా విడుదల చేసింది. ఈ మేరకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ 2, 3, 4 తేదీల్లో జరగబోయే పరీక్షలకు సంబంధించి మాత్రమే..

హైదరాబాద్, మార్చి 30: దేశవ్యాప్తంగా ఉన్న ఎన్‌ఐటీల్లో 2025-26 విద్యా సంవత్సరానికి బీటెక్, బీఆర్క్ సీట్ల భర్తీకి సంబంధించి జేఈఈ మెయిన్-2025 తుది విడత పరీక్షలు ఏప్రిల్ 2 నుంచి మొదలు కానున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో జేఈఈ మెయిన్ 2025 రెండో విడత పరీక్షల అడ్మిట్ కార్డులను ఎన్టీయే తాజాగా విడుదల చేసింది. ఈ మేరకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ 2, 3, 4 తేదీల్లో జరగబోయే పరీక్షలకు సంబంధించి మాత్రమే అడ్మిట్‌కార్డులను అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులోకి తీసుకువచ్చింది. బీఈ/బీటెక్ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే పేపర్ 1 పరీక్ష ఏప్రిల్ 2, 3, 4, 7, 8 తేదీల్లో రెండు షిఫ్టుల్లో జరగుతుంది.
ఇక బీఆర్‌లో ప్రవేశాలకు నిర్వహించే పేపర్ 2 పరీక్ష ఏప్రిల్ 9న మొదటి షిఫ్టులో జరగనుంది. పేపర్ 1 పరీక్ష ఉదయం 9:00 నుంచి మధ్యాహ్నం 12:00 వరకు మొదటి షిఫ్ట్, మధ్యాహ్నం 3:00 నుంచి సాయంత్రం 6:00 వరకు రెండో షిఫ్ట్ పరీక్షలు జరుగుతాయి. ఇక ఏప్రిల్ 8న మధ్యాహ్నం 3:00 నుంచి సాయంత్రం 6:00 వరకు ఒకే షిఫ్టులో పేపర్ 2 పరీక్ష నిర్వహించబడుతుంది. ఈ పరీక్షకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు తమ అప్లికేషన్ నెంబర్, పాస్‌వర్డ్, క్యాప్చా ఎంటర్ చేసి అడ్మిట్ కార్డులను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
జేఈఈ మెయిన్ 2025 తుది విడత అడ్మిట్ కార్డుల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కాగా సీబీఎస్సీ బోర్డు పరీక్షలు రాసే విద్యార్ధులకు ఎన్టీయే మరో బంరాఫర్ ఇచ్చింది. జేఈఈ మెయిన్ సెషన్ 2 పరీక్షలు, బోర్డు 12వ తరగతి పరీక్షలు సరిగ్గా ఒకటే తేదీల్లో రావడంతో వారికి మాత్రం మరో తేదీల్లో జేఈఈ మెయిన్ పరీక్షలు నిర్వహిస్తామని తాజాగా ఎన్టీయే ప్రకటన జారీ చేసింది. సీబీఎస్సీ 12వ తరగతి పరీక్షలు రాసే అభ్యర్థులకు మరొక పరీక్ష తేదీ స్లాట్‌ను కేటాయించనున్నట్లు ప్రకటించింది. అలాగే 12వ తరగతి బోర్డు పరీక్షలు రాసే విద్యార్ధులు మార్చి 29, 2025 ఉదయం 5 గంటలలోపు JEE (మెయిన్) 2025 సెషన్ 2 పరీక్ష నగర సమాచార స్లిప్ కాపీతో పాటు వారి రిజిస్టర్డ్ ఇమెయిల్ IDని jeemain@nta.nic.inకు మెయిన్ చేయాలని NTA పేర్కొంది. దీంతో విద్యార్ధులందరూ ఈ మేరకు తమ అభ్యర్ధనలను ఎన్టీయేకు తెలియజేశారు. వీరందరికీ ఎన్టీయే జేఈఈ మెయిన్ సెషన్ 2 పరీక్ష నిర్వహించడానికి పరీక్షల అనంతరం మరోకొత్త తేదీలను అలాట్ చేయనుంది.
మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి.