AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Shobha Shetty:పెళ్లికి ముందే ప్రియుడితో కలిసి పూజలు చేసిన బిగ్ బాస్ ఫేమ్ శోభాశెట్టి.. కారణమిదేనట

బిగ్ బాస్ షో రియాలిటీ షోతో మంచి గుర్తింపు తెచ్చుకున్న వారిలో కన్నడ బ్యూటీ శోభా శెట్టి కూడా ఒకరు. ఏడో సీజన్ లో కంటెస్టెంట్ గా అడుగు పెట్టిన ఆమె తన ఆట, మాటతీరుతో ఫైర్ బ్రాండ్ గా ఫేమస్ అయ్యింది.

Shobha Shetty:పెళ్లికి ముందే ప్రియుడితో కలిసి పూజలు చేసిన బిగ్ బాస్ ఫేమ్ శోభాశెట్టి.. కారణమిదేనట
Shobha Shetty
Basha Shek
|

Updated on: Mar 30, 2025 | 12:19 PM

Share

కన్నడ బ్యూటీ శోభా శెట్టి గురించి తెలుగు ఆడియెన్స్ కు కూడా ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. కార్తీక దీపం సీరియల్ లో మోనితగా తెలుగు వారికి బాగా చేరువైందీ అందాల తార. ఆ తర్వాత బిగ్ బాస్ ఏడో సీజన్ తో మరింత ఫేమస్ అయిపోయింది. హౌస్ లో శివాజీ బ్యాచ్ కు మాటకు మాట చెబుతూ ఫైర్ బ్రాండ్ గా గుర్తింపు తెచ్చుకుంది. ఫైనల్ వరకు వెళ్లకపోయినా తన ఆట, మాట తీరుతో చాలామందికి ఫేవరెట్ గా మారిపోయిందీ అందాల తార. కాగా బిగ్ బాస్ హౌస్ లో ఉన్నప్పుడే తన ప్రేమ విషయాన్ని బయట పెట్టింది శోభా శెట్టి. యశ్వంత్‌ రెడ్డి అనే వ్యక్తితో ఏడడుగులు నడవనున్నట్లు అందరి ముందు చెప్పుకొచ్చింది. అందుకు తగ్గట్టుగానే బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు రాగానే తన ప్రియుడితో కలిసి కొత్త ఇంటిని కొనుగోలు చేసింది. అంతేకాదు గతేడాది మేలో ఇద్దరూ కలిసి నిశ్చితార్థం చేసుకున్నారు. త్వరలోనే ఈ ప్రేమ జంట పెళ్లిపీటలెక్కనుందని తెలుస్తోంది.

కాగా పెళ్లికి ముందే శోభా శెట్టి తన ప్రియుడితో కలిసి పూజలు చేసింది. ప్రస్తుతమున్న కొత్తింట్లో సుమారు 16 కలశాలు పెట్టి మధ్యలో శివలింగానికి పంచామృతంతో అభిషేకం చేసింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సామాజిక మాధ్యమాల్లో బాగా వైరలవుతున్నాయి. దీనిపై కొందరు నెటజన్లు శోభను ట్రోల్ చేస్తున్నారు. ఇలా వ్రతాలు, పూజలు పెళ్లయిన వారే చేయాలి. పైగా పురోహితుడిని దగ్గర పెట్టుకునిఈ పూజని చేయించడం మరీ దారుణమంటూ నెటిజన్లు భగ్గుమంటున్నారు.

ఇవి కూడా చదవండి

శోభా శెట్టి లేటెస్ట్ ఇన్ స్టా గ్రామ్ పోస్ట్..

అయితే పూజ చేయడానికి గల కారణం గురించి శోభ ఇలా చెప్పుకొచ్చింది. ‘కొత్తింట్లోకి వచ్చి సుమారు ఎనిమిది నెలలవుతోంది. అప్పుడు పూజ చేసి ఇంటికి గుమ్మడికాయ కట్టాం. దిష్టి తాకి అదిప్పుడు పాడైపోయింది. అందుకే పంతులు గారిని పిలిపించి పూజ చేశాం. దీనివల్ల పాజిటివ్‌ వైబ్స్‌ వస్తాయి. ఇలాంటి వాటినియశ్వంత్‌ ఎక్కువగా నమ్మడు. కానీ మా అత్తమ్మ, నేను ఎక్కువ నమ్ముతాం. అందుకే పూజ చేశాం’ అని శోభా శెట్టి చెప్పుకొచ్చింది.

గ్లామరస్ లుక్ లో బిగ్ బాస్ బ్యూటీ..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి