AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నేను చెడ్డ నటుడిని కాదు.. కాంతార సినిమాలో నాకు ఛాన్స్ ఇవ్వండి.. స్టార్ హీరో రిక్వెస్ట్

కన్నడ స్టార్ హీరో రిషబ్ శెట్టి ప్రధాన పాత్రలో తెరకెక్కిన ‘కాంతారా’ సినిమా దేశవ్యాప్తంగా సూపర్ హిట్ అయింది. దీంతో వెంటనే ఈ సూపర్ హిట్ సినిమాకు ప్రీక్వెల్‌ను ప్రకటించారు. దీనికి ‘కాంతారా: చాప్టర్ 1’ అని టైటిల్ పెట్టారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమాలో చాలా మంది నటీనటులు నటిస్తున్నారు.

నేను చెడ్డ నటుడిని కాదు.. కాంతార సినిమాలో నాకు ఛాన్స్ ఇవ్వండి.. స్టార్ హీరో రిక్వెస్ట్
Kantara 1
Rajeev Rayala
|

Updated on: Mar 30, 2025 | 12:10 PM

Share

రిషబ్ శెట్టి హీరోగా నటించిన కాంతార సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కన్నడలో తక్కువ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా సంచలన విజయం సాధించింది. తెలుగులోనూ కాంతార సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఇక ఇప్పుడు కాంతారకు ప్రీక్వెల్ గా ‘కాంతార చాప్టర్ 1’ సినిమా రానుంది. రిషబ్ శెట్టి ఆ పనుల్లో బిజీగా ఉన్నాడు. సినిమా కథ మొత్తం కదంబ యుగంలో సాగుతుందని తెలుస్తోంది. ఇక ఇప్పుడు కాంతార సినిమాలో ఓ స్టార్ హీరో నటిస్తున్నాడని తెలుస్తోంది. కాంతార సినిమా ముందుగా కన్నడలో విడుదలై ఆతర్వాత ఇతర భాషల్లో విడుదలైంది. కాగా ఇప్పుడు కాంతార చాప్టర్ 1ను పాన్ ఇండియా మూవీగా రిలీజ్ చేయనున్నారు.

ఇదిలా ఉంటే ఇప్పుడు మలయాళ స్టార్ హీరో మోహన్‌లాల్ కాంతార: చాప్టర్ 1లో నటించనున్నారని  రూమర్స్ వినిపిస్తున్నాయి. రిషబ్‌కి తండ్రి పాత్రలో మోహన్‌లాల్ నటించనున్నట్టు జోరుగా ప్రచారం జరుగుతుంది. అయితే దీనికి సంబంధించి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. ‘కాంతార: చాప్టర్ 1’ ఇండియాలో మోస్ట్ ఎవైటెడ్ మూవీస్‌లో ఒకటి. ఈ సినిమాలో చాలా మంది స్టార్స్ నటిస్తున్నారు. అలాగే ఈ సినిమాలో మోహన్‌లాల్ కూడా నటిస్తున్నారాని రూమర్స్ వినిపిస్తున్నాయి.

అయితే ఈ రూమర్స్ పై తాజాగా మోహన్ లాల్ స్పందించారు. దయచేసి నన్ను కాంతార సినిమాలో భాగం చేయమని మీరే అడగండి. నాకు ఒక పాత్ర ఇవ్వండి. నాకు తెలిసి నేనేమీ చెడ్డ నటుడిని కాదు అని సరదాగా అన్నారు మోహన్ లాల్. కాంతార సినిమా పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ సినిమా షూటింగ్ కుందాపూర్‌లో జరుగుతోంది. 2025లో సినిమా విడుదలయ్యే అవకాశం ఉంది. సినిమా విడుదల తేదీపై అధికారిక సమాచారం లేదు. త్వరలోనే ఈ సినిమా రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేయనున్నారు. ఈ సినిమాతో పాటు రిషబ్ శెట్టి ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న జై హనుమాన్ సినిమాలోనూ నటిస్తున్నారు. ఈ సినిమాలో రిషబ్ శెట్టి హనుమంతుడిగా కనిపించనున్నాడు. ఇక మోహన్ లాల్ రీసెంట్ గా లూసిఫర్ 2లో నటించారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..