AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పీటలదాకా వచ్చిన పెళ్లి క్యాన్సిల్ చేసుకుంది.. కట్ చేస్తే మరొకరితో ప్రేమ.. ఎవరో తెలుసా.?

చాలా మందిలానే ఈ హీరోయిన్ కూడా కొన్ని సినిమాలతోనే విపరీత మైన క్రేజ్ సొంతం చేసుకుంది. ఆతర్వాత ఊహించని విధంగా సినిమాలకు గ్యాప్ ఇచ్చింది. కెరీర్ పీక్ లో ఉండగానే ఈ అమ్మడు పెళ్లి చేసుకోవాలని ఫిక్స్ అయ్యింది. నిశిచితార్థం కూడా చేసుకుంది. కానీ పెళ్లి క్యాన్సిల్ చేసుకుంది. ఇప్పుడు మరో వ్యక్తితో ప్రేమలో పడింది.

పీటలదాకా వచ్చిన పెళ్లి క్యాన్సిల్ చేసుకుంది.. కట్ చేస్తే మరొకరితో ప్రేమ.. ఎవరో తెలుసా.?
Actress
Rajeev Rayala
|

Updated on: Mar 30, 2025 | 11:51 AM

Share

సినిమా అనేది ఓ రంగుల ప్రపంచం. ఇండస్ట్రీలోకి చాలా మంది ఎన్నో కలలతో అడుగుపెడతారు. కానీ అందరూ సక్సెస్ కాలేరు. ఇక కొంతమంది సక్సెస్ కోసం ఇప్పటికీ ప్రయత్నిస్తూనే ఉన్నారు. అవకాశాలు తగ్గుతున్నప్పటికీ వెనకడుగు వేయకుండా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. వారిలో ఈ అమ్మడు ఒకరు. ఇక సినిమా ఇండస్ట్రీలో రిలేషన్స్ షిప్స్, ప్రేమలు, పెళ్లిళ్లు, బ్రేకప్ లు, విడిపోవడాలు మనం తరచు చూస్తే ఉన్నాం. చాలా మంది ప్రేమించిన వారిని పెళ్లి చేసుకొని హ్యాపీగా ఉంటే కొంతమంది మాత్రం బ్రేకప్ లు, విడాకులతో వార్తల్లో నిలుస్తున్నారు. ఇక పైన కనిపిస్తున్న చిన్నది కూడా అంతే.. నేచురల్ స్టార్ నాని సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. వరుసగా హిట్స్ అందుకుంది. కెరీర్ పీక్ లో ఉండగానే నిశ్చితార్థం చేసుకుంది.. కట్ చేస్తే పెళ్లి క్యాన్సిల్..

ఆ తర్వాత మరొకరితో ప్రేమ , నిశ్చితార్థం.. సీక్రెట్ గా పెళ్లి కూడా అయిపొయింది. ఇంతకూ ఆమె ఎవరో గుర్తుపట్టారా.? ఈ మధ్య గ్లామర్ డోస్ పెంచేసి సోషల్ మీడియాలో రచ్చ చేస్తుంది ఆ బ్యూటీ. ఆమె మరెవరో కాదు.. క్యూట్ బ్యూటీ మెహ్రీన్ పిర్జాదా. నాని హీరోగా నటించిన కృష్ణ గాడి వీర ప్రేమ గాధ సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. ఈ సినిమాలో తన క్యూట్ నెస్‌తో ఆకట్టుకుంది. ఆతర్వాత వరుసగా మహానుభావుడు, రాజా ది గ్రేట్ సినిమాలతో హిట్స్ అందుకుంది. జవాన్, పంతం, కవచం సినిమాలతో ఫ్లాప్స్ అందుకుంది.

ఇక అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన F2, F3 సినిమాలతో హిట్స్ అందుకుంది. ఇదిలా ఉంటే కెరీర్ పీక్ లో ఉండగానే.. 2021లో అడంపూర్ ఎమ్మెల్యే కుల్దీప్ బిష్ణోయ్ కుమారుడు, హర్యానా మాజీ ముఖ్యమంత్రి భజన్ లాల్ మనవడు భవ్య బిష్ణోయ్‌తో మెహ్రీన్ నిశ్చితార్థం జరిగింది. ఇది జరిగిన కొన్ని నెలలకే ఈ ఇద్దరూ పెల్లు క్యాన్సిల్ చేసుకున్నారు. ఆతర్వాత సోషల్ మీడియాతో బిజీగా గడిపిన మెహరీన్. 2023లో చిరంజీవ్ మక్వానాతో నిశ్చితార్థం చేసుకుంది. ఇటీవలే ఈ ఇద్దరూ హైదరాబాద్ లో సీక్రెట్ గా పెళ్లి చేసుకున్నారని తెలుస్తోంది. ప్రస్తుతం మెహ్రీన్ సినిమాల కోసం ఎదురుచూస్తుంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..