AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Blinkit: బ్లింకిట్‌ దూకుడు..! యాపిల్‌ ఐఫోన్‌-14 పది నిముషాల్లో డోర్‌ డెలివరీ..

నిత్యావసర కిరాణా వస్తువుల మాదిరి యాపిల్‌ ఫోన్లను కూడా ఆర్డర్‌ చేసిన నిముషాల వ్యవధిలోనే మీ ముందు ఉంచుతానంటోంది బ్లింకిట్‌..

Blinkit: బ్లింకిట్‌ దూకుడు..! యాపిల్‌ ఐఫోన్‌-14 పది నిముషాల్లో డోర్‌ డెలివరీ..
Blinkit
Srilakshmi C
|

Updated on: Sep 16, 2022 | 9:22 PM

Share

Now Order Apple iPhone 14 via Blinkit: నిత్యావసర కిరాణా వస్తువుల మాదిరి యాపిల్‌ ఫోన్లను కూడా ఆర్డర్‌ చేసిన నిముషాల వ్యవధిలోనే మీ ముందు ఉంచుతానంటోంది బ్లింకిట్‌. డోర్ డెలివరీ సేవలను ఇటీవలే ప్రారంభించిన ఈ సంస్థ యాపిల్‌ కొత్త ఐఫోన్‌ 14ను కూడా కేవలం నిముషాల్లోనే ఇంటికి తెచ్చిస్తామని చెబుతోంది. ఈ విషయాన్ని బ్లింకిట్‌ సంస్థ ఫౌండర్‌, సీఈవో అల్బిందర్‌ దిండ్సా ట్విటర్‌ ద్వారా ఈ రోజు (శుక్రవారం) స్వయంగా వెల్లడించారు. ఈ మేరకు యాపిల్‌ ఐ ఫోన్లను విక్రయించే యూనికార్న్‌ కంపెనీతో బ్లింకిట్‌ ఒప్పందం కుదుర్చుకుంది. దీంతో యాపిల్‌ ఫోన్‌తో సహా యాపిల్‌ వాచ్‌, ల్యాప్‌టాప్స్‌ వంటి ఇతర యాపిల్‌ యాక్సెసరీలను సైతం బ్లింకిట్‌ ద్వారా నిమిషాల్లో వినియోగదారునికి డెలివరీ చేయనున్నట్లు అల్బిందర్‌ దిండ్సా తెలిపారు. మన దేశంలో ప్రస్తుతానికి ఢిల్లీ, ముంబయిలలో ఈ సేవలు అందుబాటులోకి తీసుకొచ్చినట్లు ఈ సందర్భంగా పేర్కొన్నారు.

కాగా యాపిల్ ప్రొడక్ట్స్‌, ఇతర ఎలక్ట్రానిక్ వస్తువును నిముషాల వ్యవధిలో ఈ-కామర్స్ ప్లాట్‌ఫారమ్ ద్వారా విక్రయించడం బ్లింకిట్‌ ఇది మొదటిసారి కావడం గమనార్హం. ఈ ఏడాది సెప్టెంబర్‌ 7న యాపిల్‌ పలు ప్రొడక్ట్స్‌ను విడుదల చేసిన సంగతి తెలిసిందే. మన దేశంలో వీటిని అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌ వంటి ఆన్‌లైన్‌ వేదికలతో పాటు క్రోమా, రిలయన్స్‌ డిజిటల్‌ వంటి ఆఫ్‌లైన్‌ వేదికల్లోనూ అమ్మకాలు నిర్వహిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తాజా వార్తల కోసం క్లిక్ చేయండి.