- Telugu News Photo Gallery Wild Animals as Pets: These Countries citizens can also keep lions, tigers and cheetahs at their homes?
Wild Animals as Pets: తెలుసా! ఈ దేశాల్లో సింహం, చిరుత, కింగ్ కోబ్రాలను ఇళ్లలో ముద్దు ముద్దుగా పెంచుకుంటారు..
మన దేశంలో పెంపుడు కుక్కలు, పిల్లులు ఉన్నట్లే కొన్ని దేశాల్లో సింహం, చిరుత, కింగ్ కోబ్రా వంటి ప్రమాదకరమైన జంతువులను ఇళ్లలో పెంచుకుంటారు. వాటికి ప్రతి రోజూ స్నానం చేయించడం, ఫుడ్ పెట్టడం, ఆటలాడటం వంటి అన్ని పనులు చేస్తుంటారు..
Updated on: Sep 16, 2022 | 7:07 PM

మన దేశంలో పెంపుడు కుక్కలు, పిల్లులు ఉన్నట్లే కొన్ని దేశాల్లో సింహం, చిరుత, కింగ్ కోబ్రా వంటి ప్రమాదకరమైన జంతువులను ఇళ్లలో పెంచుకుంటారు. వాటికి ప్రతి రోజూ స్నానం చేయించడం, ఫుడ్ పెట్టడం, ఆటలాడటం వంటి అన్ని పనులు చేస్తుంటారు.

ఏ దేశంలోనైనా వన్య ప్రాణులను పెంపుడు జంతువులుగా పెంచుకోవడానికి Wildlife Protection Act అనుమతి తప్పనిసరిగా అవసరం అవుతుంది. మన దేశంలో అడవి జంతువులను పెంచుకోండానికి అనుమతి లేదు.

ఒకవేళ ఎవరైనా అడవి జంతువులను పెంచాలనుకుంటే, అందుకు చీఫ్ వైల్డ్‌లైఫ్ వార్డెన్ నుంచి అనుమతి తీసుకోవల్సి ఉంటుంది. పెట్ యానిమల్‌ను పూర్తి సంరక్షణ బాధ్యతలు చేపట్టవల్సి ఉంటుంది.

ఐతే అడవి జంతువులను పెంచుకోవడాన్ని దాదాపు అన్ని దేశాలు నిషేధించాయి. ఐతే థాయిలాండ్, ఆఫ్రికాలోని కొన్ని దేశాల్లో మాత్రమే అనుమతి ఉంది. 2015లో మధ్యప్రదేశ్ ప్రభుత్వం అప్పటి పశుసంవర్ధక మంత్రి కుసుమ్ మెహదేల్ పులుల సంఖ్యను పెంచడానికి, ప్రైవేట్‌గా పెంచుకోవడాన్ని చట్టబద్ధం చేయాలని కోరిన సందర్భంలో థాయ్‌లాండ్, ఆఫ్రికా దేశాలను ఉదాహరించింది.

అమెరికాలో కూడా ఈ విధమైన నిషేదం కొనసాగుతోంది. అమెరికాలో ఒక్కో రాష్ట్రానికి ఒక్కో నిబంధన అమలులో ఉంటుంది. నార్త్ కరోలినా, నెవాడా, అలబామా రాష్ట్రాల్లో పూర్తిగా నిషేధించారు. దుబాయ్‌లోని చాలా మంది షేక్‌లు వన్య జంతువులతో దిగిన ఫొటోలు సోషల్ మీడియాల్లో చూసి ఉంటారు. కొన్ని సంవత్సరాల క్రితం ఈ దేశంలో కూడా నిషేదం విధించారు.





























