AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Promotion: బాస్ ప్రమోషన్‌ ఇవ్వలేదని.. భార్య, పిల్లలతో సహా కుటుంబాన్ని హత్య చేసిన ఉద్యోగి!

చేసే పనికి కనీస గుర్తింపు ఆశిస్తాడు ఏ ఉద్యోగైనా! తన ప్రతిభను యజమాని గుర్తించి ప్రమోషన్‌ ఇస్తాడని కలలు కంటాడు. అచ్చంగా.. ఇలాగే ఓ ఉద్యోగి కూడా అనుకున్నాడు. ఐతే అతని బాస్‌ మత్రం ప్లేట్‌ ఫిరాయించాడు. దీంతో..

Promotion: బాస్ ప్రమోషన్‌ ఇవ్వలేదని.. భార్య, పిల్లలతో సహా కుటుంబాన్ని హత్య చేసిన ఉద్యోగి!
Texas Cold Case
Srilakshmi C
|

Updated on: Sep 16, 2022 | 8:24 PM

Share

Texas cold case murder suspect arrested: చేసే పనికి కనీస గుర్తింపు ఆశిస్తాడు ఏ ఉద్యోగైనా! తన ప్రతిభను యజమాని గుర్తించి ప్రమోషన్‌ ఇస్తాడని కలలు కంటాడు. అచ్చంగా.. ఇలాగే ఓ ఉద్యోగి కూడా అనుకున్నాడు. ఐతే అతని బాస్‌ మత్రం ప్లేట్‌ ఫిరాయించాడు. ఎవరికైనా ఇలా జరిగితే ఆ జాబ్‌ మానేసి, మరో ఉద్యోగం వెతుక్కుంటారు. ఐతే ఇతను మాత్రం అలా చెయ్యలేదు. పట్టరాని కోపంతో ముందు యజమానిని, ఆ తర్వాత ఇంటికి వెళ్లి భార్య, బిడ్డలను హతమార్చాడు. మరింత ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఇది జరిగి 8 ఏళ్లవుతుంటే పోలీసులు గత ఆదివారం (సెప్టెంబర్‌ 11) నాడు నిందిడుతిని అరెస్టు చేశారు. ఆలస్యంగా వెలుగు చూసిన ఈ సంఘటన కలకలం సృష్టించింది. వివరాల్లోకెళ్తే..

అమెరికాలోని ష్లమ్‌బెర్గర్‌లోనున్న ఆయిల్‌ఫీల్డ్ సర్వీసెస్‌ కంపెనీలో పనిచేసే 58 ఏళ్ల ఫెంగ్‌ లూ చైనా నుంచి అమెరికాకు వలస వచ్చాడు. ఐతే తను పనిచేసే కంపెనీ యజమాని అతనికి ప్రమోషన్‌ ఇవ్వడానికి నిరాకరించాడు. దీంతో మనస్తాపానికి గురైన ఫెంగ్‌ లూ వారం క్రితమే తుపాకిని కొనుగోలు చేశాడు. అనంతరం యజమాని మాయో (50) హత్య చేశాడు. ఇంటికి చేరుకుని భార్య మెయిక్సీ (49), తొమ్మిదేళ్ల కుమార్తె, ఏడేళ్ల కుమాడిని హత్య చేశాడు. వీరందరి మృతదేశాలు వేర్వేరు బెడ్‌రూమ్‌లలో పడి ఉన్నాయి. అందరినీ తుపాకితో తలపై కాల్చి చంపాడు. ఈ హత్యలు 2014లో జరిగాయి. అక్కడి పోలీసులు జనవరి 30న మృతదేహాలను కనుగొన్నారు. డీఎన్‌ఏ టెస్టుల ఆధారంగా ఫెంగ్‌ లూని నిందితుడిగా పోలీసులు అనుమానించారు. పోలీసుల నుంచి తప్పించుకు తిరుగుతున్న ఫెంగ్‌ లూని ఆదివారం చైనా నుంచి శాన్‌ఫ్రాన్సిస్కోకు వస్తున్న సమయంలో పోలీసులు అరెస్టు చేశారు. కేసు విచారణలో భాగంగా ఈ హత్యలన్నీ ఎందుకు చేశావని ఫాంగ్‌ లూని పోలీసులు ప్రశ్నించగా.. అతను చెప్పిన సమాధానం విని అందరూ ఉలిక్కిపడ్డారు. తన బాస్ మాయో తనకు ప్రమోషన్‌ ఇవ్వలేదని, తన బాస్‌పై ఆగ్రహంతోనే ఈ హత్యలన్ని చేసినట్లు వెల్లడించాడు. ఈ క్రమంలోనే బాస్‌తోపాటు, తన కుటుంబాన్ని చంపినట్లు నేరం అంగీకరించాడు.