Johnson and Johnson: ఫుడ్ అండ్ డ్రగ్స్ అథారిటీ సంచలన నిర్ణయం.. జాన్సన్ బేబీ పౌడర్ తయారీ లైసెన్స్‌ రద్దు..!

Johnson and Johnson: మహారాష్ట్ర ఫుడ్ అండ్ డ్రగ్స్ అథారిటీ (FDA) సంచలన నిర్ణయం తీసుకుంది. బేబీ పౌడర్ తయారీకి ప్రపంచంలోని అతిపెద్ద కంపెనీ జాన్సన్..

Johnson and Johnson: ఫుడ్ అండ్ డ్రగ్స్ అథారిటీ సంచలన నిర్ణయం.. జాన్సన్ బేబీ పౌడర్ తయారీ లైసెన్స్‌ రద్దు..!
Johnson And Johnson
Follow us
Subhash Goud

|

Updated on: Sep 17, 2022 | 12:24 AM

Johnson and Johnson: మహారాష్ట్ర ఫుడ్ అండ్ డ్రగ్స్ అథారిటీ (FDA) సంచలన నిర్ణయం తీసుకుంది. బేబీ పౌడర్ తయారీకి ప్రపంచంలోని అతిపెద్ద కంపెనీ జాన్సన్ & జాన్సన్  లైసెన్స్‌ను రద్దు చేసింది. ముంబైలోని జాన్సన్ అండ్ జాన్సన్ కంపెనీకి చెందిన ములుండ్ ప్లాంట్‌పై ఈ చర్య తీసుకుంది. పుణె, నాసిక్‌లలో కంపెనీ ఉత్పత్తులు బాగాలేవని, ప్రమాణాలకు విరుద్దంగా ఉన్నాయని తెలిపింది. అంటే నాసిక్, పూణేలకు పంపిన ముంబై ప్లాంట్ల నుంచి తయారైన బేబీ పౌడర్లు నాణ్యత లేనివిగా తేలింది. ఈ మేరకు వార్తా సంస్థ ఏఎన్‌ఐ వెల్లడించింది.

కంపెనీపై చర్య తీసుకోవడానికి మహారాష్ట్ర ఎఫ్‌డిఎ ఈ కారణాలను తెలిపింది. FDA తన చర్యకు సంబంధించి రెండు ప్రెస్ నోట్‌లను విడుదల చేసింది. మహారాష్ట్ర యూనిట్ పూణే, నాసిక్ నుండి జాన్సన్ & జాన్సన్ యొక్క బేబీ పౌడర్ నమూనాలను సేకరించి తనిఖీ చేసినప్పుడు అవి ప్రామాణిక నాణ్యత లేనివిగా గుర్తించింది. ఇంటర్నేషనల్ స్టాండర్డ్ 5339:2004 ప్రకారం.. ఈ నమూనాలు సరైనవి కావు అని ప్రెస్ నోట్‌లో చెప్పబడింది.

కంపెనీకి షోకాజ్‌ నోటీసులు

ఇవి కూడా చదవండి

అంతేకాకుండా FDA కంపెనీకి వ్యతిరేకంగా షోకాజ్ నోటీసు కూడా జారీ చేసింది. మార్కెట్లో విడుదలైన ఉత్పత్తులు నాణ్యల లేవని పేర్కొంది. జాన్సన్ & జాన్సన్స్ ప్రైవేట్ లిమిటెడ్, ములుండ్, ముంబై ప్రభుత్వ నివేదికను తిరస్కరించింది. నివేదికపై కోర్టులో సవాలు చేసింది. కానీ చివరికి FDA తుది నివేదికను సమర్పించింది. కంపెనీ నమూనాలు అంతర్జాతీయ ప్రమాణం 5339:2004 ప్రమాణాలకు అనుగుణంగా లేవని స్పష్టం చేసింది. జాన్సన్ బేబీ పౌడర్ చాలా చిన్న పిల్లల శరీరంపై పూయడానికి ఉపయోగిస్తారు. ఈ పౌడర్‌ చిన్న పిల్లల చర్మంపై చెడుగా ప్రభావితం చేస్తుందని గుర్తించారు అధికారులు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి