Liquor Scam: లిక్కర్‌ స్కామ్‌లో కేసులో దూకుడు పెంచిన సీబీఐ.. రాజకీయ, వ్యాపార వర్గాల్లో టెన్షన్ టెన్షన్‌..

సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్‌ కేసులో సీబీఐ, ఈడీ దూకుడు పెంచాయి. అరెస్ట్‌లు, దాడులతో స్కామ్‌లో ఉన్నవారి గుండెల్లో రైళ్లు పరుగెట్టిస్తున్నాయి.

Liquor Scam: లిక్కర్‌ స్కామ్‌లో కేసులో దూకుడు పెంచిన సీబీఐ.. రాజకీయ, వ్యాపార వర్గాల్లో టెన్షన్ టెన్షన్‌..
CBI
Follow us
Shiva Prajapati

|

Updated on: Oct 11, 2022 | 1:32 PM

సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్‌ కేసులో సీబీఐ, ఈడీ దూకుడు పెంచాయి. అరెస్ట్‌లు, దాడులతో స్కామ్‌లో ఉన్నవారి గుండెల్లో రైళ్లు పరుగెట్టిస్తున్నాయి. ఇప్పటికే విజయ్‌నాయర్‌, సమీర్‌ మహేంద్రును అరెస్ట్‌ చేసిన దర్యాప్తు సంస్ధలు.. నిన్న అభిషేక్‌ని అరెస్ట్‌ చేసింది. వరుస అరెస్ట్‌లతో లిక్కర్‌ స్కాంలో మళ్లీ ప్రకంపనలు మొదలయ్యాయి.

అభిషేక్‌ ఢిల్లీ మద్యం పాలసీ రూపకల్పనలో కీలకంగా వ్యహరించారని, అతని కనుసన్నల్లోనే కోట్లు చేతులు మారినట్లు సీబీఐ గుర్తించింది. మొన్న ఢిల్లీలో అభిష్‌క్‌ను విచారించిన సీబీఐ.. నిన్న అరెస్టు చేసి ప్రత్యేక కోర్టు జడ్జి ముందు హాజరుపరిచింది. కీలక విషయాలు రాబట్టాలని, అందుకోసం 5 రోజులు కస్డడీకి ఇవ్వాలని కోరారు. దీంతో 3 రోజుల కస్టడీకి అనుమతించింది సీబీఐ కోర్టు. దీంతో అభిషేక్‌ను రెండవ రోజు విచారిస్తోంది. అభిషేక్‌ స్టేట్‌మెంట్‌ ఆధారంగా తదుపరి చర్యలు తీసుకునే అవకాశం ఉంది. అనుమానాస్పద లావాదేవీలు, సమీర్‌, విజయ్‌నాయర్‌తో సంబంధాలపై ఆరాతీస్తోంది సీబీఐ. విమాన టికెట్లు, హోటల్స్‌ బుకింగ్లకు సంబంధించిన ఆధారాలు ముందు ఉంచి ఆరా తీస్తున్నారు అధికారులు.

కాగా, తొమ్మిది కంపెనీలకు డైరెక్టర్‌గా అభిషేక్‌ ఉన్నారు. రియల్ ఎస్టేట్, మైనింగ్, మాన్యుఫ్యాక్చరింగ్, కెమికల్స్, కంప్యూటర్ సర్వీసులతో పాటు మరికొన్ని సంస్ధల్లో కీలక వ్యక్తిగా వ్యవహరించినట్టు గుర్తించారు. అంతేకాదు ఢిల్లీ మద్యం పాలసీ రూపకల్పనలో కీలక పాత్ర పోషించినట్టు తేల్చారు. రామచంద్ర పిళ్లైతో కలిసి అభిషేక్‌ వ్యాపారాలు చేసినట్టు గుర్తించారు, ఇతనికి పలువురు రాజకీయ నేతలతోకూడా పరిచయాలు ఉన్నట్టు విచారణలో తేల్చారు,

ఇవి కూడా చదవండి

హైదరాబాద్‌ కేంద్రంగానే ఢిల్లీ లిక్కర్‌ స్కాం జరిగిందని, వస్తున్న ఆరోపణల నేపధ్యంలో ఢిల్లీ నుంచి ప్రత్యేక అధికారులు వచ్చి హైదరాబాద్‌లో మకాం వేసినట్టు తెలుస్తోంది. అభిషేక్ అరెస్టుతో ఢిల్లీ మద్యం కుంభకోణంలో డొంకంతా కదులుతుందని భావిస్తున్నారు. ఈ స్కామ్‌లో ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా సహా మొత్తం 15మందిని నిందితులుగా తేల్చడంతో..ఇంకెంత మంది వెలుగులోకి వస్తారనే విషయం ఆసక్తికరంగా మారింది. తర్వాత ఎవరు అరెస్ట్ అవుతారన్న దానిపై హాట్‌ హాట్‌ చర్చ జరుగుతోంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

గోవా నుంచి వచ్చిన రైల్లో పోలీసుల తనిఖీలు.. ఓ భోగీలో
గోవా నుంచి వచ్చిన రైల్లో పోలీసుల తనిఖీలు.. ఓ భోగీలో
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో