AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

చేతి పంపు కొడితే చాలు.. బక్కెట్ల కొద్దీ మద్యం.. చిత్రం చూసి నివ్వెరపోయిన పోలీసులు.. ఎక్కడంటే..

హ్యాండ్ పంప్‌ను వాడిన ప్రజలకు బక్కెట్ల కొద్దీ మద్యం బయటకు వస్తుంది. అది చూసిన పోలీసులకు కళ్ళు బైర్లు కమ్మాయి. ఈ విచిత్ర సంఘటన స్థానికంగా కూడా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

చేతి పంపు కొడితే చాలు.. బక్కెట్ల కొద్దీ మద్యం.. చిత్రం చూసి నివ్వెరపోయిన పోలీసులు.. ఎక్కడంటే..
Hand Pump
Jyothi Gadda
|

Updated on: Oct 11, 2022 | 12:56 PM

Share

సాధారణంగా చేతి పంపు నుండి ఎక్కడైనా నీరే వస్తుంది. అయితే, ఆ మధ్య కాలంలో ఏపీలోని గ్యాస్‌ పైప్‌ లైన్‌ ఏర్పాటు చేసిన కొన్ని ప్రాంతాల్లో ఆయిల్‌ లాంటి ద్రవం ఉద్భవించినట్టుగా వార్తలు వినిపించాయి. కానీ, ఇక్కడ మాత్రం హ్యాండ్ పంప్‌ను వాడిన ప్రజలకు బక్కెట్ల కొద్దీ మద్యం బయటకు వస్తుంది. అది చూసిన పోలీసులకు కళ్ళు బైర్లు కమ్మాయి. ఈ విచిత్ర సంఘటన మధ్యప్రదేశ్‌లోని గుణాలో వెలుగు చూసింది. ఈ రోజుల్లో రాష్ట్రంలో డ్రగ్స్‌పై పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఆదేశాల మేరకు పోలీసులు, ఎక్సైజ్ శాఖ, స్థానిక యంత్రాంగం వివిధ జిల్లాల్లో దాడులు నిర్వహిస్తున్నాయి. దీనికి సంబంధించి పోలీసులు గుణలో దాడి చేయగా, వారికి ఒక చేతి పంపు దొరికింది. దాని నుండి నీరు కాదు, మద్యం బయటకు వస్తోంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

గుణాలో మద్యం మాఫియా రెచ్చిపోయింది. అక్రమ మద్యం అమ్మకాల కోసం ఎవరికీ ఎలాంటి అనుమానం రాకుండా ఓ చేతి పంపును ఏర్పాటు చేసింది. పోలీసులు చేతి పంపును కోట్టి చూసి ఆశ్చర్యపోయారు. ఇక్కడ చేతి పంపు నుంచి నీళ్లకు బదులు మద్యం రావటంతో ఖాకీలు కంగుతిన్నారు. అక్రమ మద్యం స్థావరాలపై పోలీసులు జరిపిన దాడుల్లో సుమారు 6 వేల లీటర్ల కల్తీ మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. భాన్‌పురాలో నిందితులు ట్యాంక్‌ను భూమిలో పాతిపెట్టి చేతి పంపును అమర్చారు. పోలీసులు చేతిపంపు కొట్టగానే అందులో నుంచి మద్యం రావడం మొదలైంది.

ఇవి కూడా చదవండి

మధ్యప్రదేశ్‌ పోలీసులు వివిధ ప్రాంతాల్లో దాడులు జరిపి ఆరుగురిపై కేసు నమోదు చేసినట్లు తెలియజేద్దాం. అక్రమ మద్యం విక్రయిస్తున్న మాఫియాపై ఎంపీ పోలీసులు చర్యలు తీసుకోవడం ఇదేం మొదటి కేసు కాదు. ఇంతకు ముందు కూడా పోలీసులు, ఎక్సైజ్ శాఖ అనేక ప్రధాన దాడుల్లో వేల లీటర్ల మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. రాష్ట్రంలో అక్రమ మద్యం వ్యాపారం పెద్దఎత్తున సాగుతున్నట్లు పోలీసుల ఈ దాడితో స్పష్టమవుతోంది. సీఎం శివరాజ్‌ ఆదేశాల మేరకు పోలీసుల దాడులతో అక్రమ మద్యం వ్యాపారాన్ని చాలా వరకు అరికట్టవచ్చు.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..

Follow Us
పాక్ ఆర్మీకి బిగ్ షాక్.. కుప్పకూలిన ఎంఐ-17 హెలికాప్టర్!
పాక్ ఆర్మీకి బిగ్ షాక్.. కుప్పకూలిన ఎంఐ-17 హెలికాప్టర్!
వాస్తు టిప్స్ : తామర పువ్వు ఉన్న పెయింటింగ్ ఫొటో ఇంట్లో ఉండొచ్చా?
వాస్తు టిప్స్ : తామర పువ్వు ఉన్న పెయింటింగ్ ఫొటో ఇంట్లో ఉండొచ్చా?
'తల్లికి వందనం' డబ్బులు అకౌంట్లోకి అప్పుడే..
'తల్లికి వందనం' డబ్బులు అకౌంట్లోకి అప్పుడే..
సీనియర్లను పట్టించుకోవడం లేదు.. బుడ్డోడి కోసం ఎగబడుతున్నారు
సీనియర్లను పట్టించుకోవడం లేదు.. బుడ్డోడి కోసం ఎగబడుతున్నారు
పురును ఏ రోజు కొనాలి.. ఇంట్లో ఏ దిక్కున ఉంచాలి..?
పురును ఏ రోజు కొనాలి.. ఇంట్లో ఏ దిక్కున ఉంచాలి..?
ప్రతి ఉద్యోగిని ఆలోచింపజేస్తున్న చిన్నారి ప్రశ్న!
ప్రతి ఉద్యోగిని ఆలోచింపజేస్తున్న చిన్నారి ప్రశ్న!
ఏసీ పనిచేట్లేదని టెక్నీషియన్‌ను పిలించిన ఓనర్.. ఓపెన్ చేసి చూడగా
ఏసీ పనిచేట్లేదని టెక్నీషియన్‌ను పిలించిన ఓనర్.. ఓపెన్ చేసి చూడగా
విద్యార్థులకు గుడ్‌న్యూస్.. ఒక్క అప్లికేషన్‌తో రూ.50 పొందే ఛాన్స్
విద్యార్థులకు గుడ్‌న్యూస్.. ఒక్క అప్లికేషన్‌తో రూ.50 పొందే ఛాన్స్
ఇంట్లో పరుగెడుతున్న గుర్రం విగ్రహం ఉందా? సరైన దిశలో పెడితే కెరీర్
ఇంట్లో పరుగెడుతున్న గుర్రం విగ్రహం ఉందా? సరైన దిశలో పెడితే కెరీర్
ఇల్లు కట్టేందుకు పునాది తవ్వుతుండగా.. కనిపించిన అద్భుత దృశ్యం
ఇల్లు కట్టేందుకు పునాది తవ్వుతుండగా.. కనిపించిన అద్భుత దృశ్యం