భార్యను చంపేందుకు తలుపులకు విద్యుత్ కనెక్షన్.. కట్ చేస్తే దిమ్మతిరిగే ట్విస్ట్..

అందుకోసం ఓ మాస్టార్‌ ప్లాన్‌ వేశాడు..ఇంటి తలుపుకు కరెంటు వైరు తగిలించాడు. కానీ, అతడి పన్నాగం ఫలించలేదు. విధి వెంటాడింది.. తానొకటి తలిస్తే.. అక్కడ మరోకటి జరిగింది.

భార్యను చంపేందుకు తలుపులకు విద్యుత్ కనెక్షన్.. కట్ చేస్తే దిమ్మతిరిగే ట్విస్ట్..
Crime News
Follow us
Jyothi Gadda

|

Updated on: Oct 11, 2022 | 1:51 PM

ఓ తాగుబోతు వేసిన ప్లాన్ బెడిసి కొట్టింది.. కట్టుకున్న భార్యను మూడో కంటికి తెలియకుండా ఖతం చేద్దామనుకున్నాడు. అందుకోసం ఓ మాస్టార్‌ ప్లాన్‌ వేశాడు..ఇంటి తలుపుకు కరెంటు వైరు తగిలించాడు. కానీ, అతడి పన్నాగం ఫలించలేదు. విధి వెంటాడింది.. తానొకటి తలిస్తే.. అక్కడ మరోకటి జరిగింది. మధ్యప్రదేశ్‌లోని బేతుల్ జిల్లాలో ఒక వ్యక్తి తన భార్యను చంపడానికి ఇనుప తలుపుపై విద్యుత్ వైర్‌ను వేశాడు. భార్య తలుపును తాకటంతోనే కరెంట్‌ షాక్ తగిలి చనిపోతుందని భావించాడు..కానీ, 55 ఏళ్ల అత్తగారు తలుపును తగిలి విద్యుదాఘాతంతో మరణించింది. దీంతో పోలీసులు అతన్ని కటకటాల వెనక్కి నెట్టారు.ఈ ఘటన కొత్వాలి పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని సైఖేడా గ్రామంలో సోమవారం చోటుచేసుకుంది. ఈ మేరకు పోలీసులు తెలిపిన వివరాల మేరకు..

ఆ వ్యక్తి తాగుడుకు అలవాటు పడ్డాడని, దీంతో అతని భార్యతో తరచూ గొడవలు జరిగేవని కొత్వాలి పోలీస్ స్టేషన్ ఇన్‌ఛార్జ్ అపలా సింగ్ తెలిపారు. ఆదివారం రాత్రి భార్యాభర్తల మధ్య మళ్లీ గొడవ జరిగిందని చెప్పారు. ఈ క్రమంలోనే భార్య తన తల్లి ఇంటికి వెళ్లిందని అధికారి తెలిపారు. తన భార్య ఇంటి నుంచి వెళ్లిపోవడంతో కోపంతో ఆ వ్యక్తి తన అత్తమామల ఇంటికి వెళ్లాడని ప్రాథమిక దర్యాప్తులో తేలిందని సింగ్ చెప్పాడు.

అక్కడే భార్యను మట్టుబెట్టాలని భావించి విద్యుత్‌ వైర్‌ కట్‌ చేసి తలుపుపై వేశాడు..కానీ, అతని అత్తగారు తలుపుకు తగిలి అక్కడికక్కడే మరణించారని అధికారి తెలిపారు. ఘటన అనంతరం ఆ వ్యక్తి అక్కడి నుంచి పారిపోయాడని, అతడిని పట్టుకునేందుకు గాలిస్తున్నామని పోలీసులు తెలిపారు. పరారీలో ఉన్న నిందితుడిపై సంబంధిత నిబంధనల ప్రకారం కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..

సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
మీ ఇంట్లో పాత ఎల్ఐసీ బాండ్ ఉందా..? ఇలా చేస్తే సొమ్ము వాపస్
మీ ఇంట్లో పాత ఎల్ఐసీ బాండ్ ఉందా..? ఇలా చేస్తే సొమ్ము వాపస్
యువతిపై లైంగిక వేధింపులు.. ప్రముఖ బుల్లితెర నటుడు అరెస్ట్
యువతిపై లైంగిక వేధింపులు.. ప్రముఖ బుల్లితెర నటుడు అరెస్ట్
10 రోజుల షూటింగ్ కోసం రూ.9 కోట్లు రెమ్యునరేషన్..
10 రోజుల షూటింగ్ కోసం రూ.9 కోట్లు రెమ్యునరేషన్..
వచ్చే బడ్జెట్‌లో మధ్యతరగతి వారికి భారీ ఉపశమనం.. కేంద్రం సన్నాహాలు
వచ్చే బడ్జెట్‌లో మధ్యతరగతి వారికి భారీ ఉపశమనం.. కేంద్రం సన్నాహాలు
రెచ్చగొట్టిన ఆసీస్ ఫ్యాన్స్..తెలుసుగా విరాట్‌తో మాములుగా ఉండదని..
రెచ్చగొట్టిన ఆసీస్ ఫ్యాన్స్..తెలుసుగా విరాట్‌తో మాములుగా ఉండదని..
బ్యాంకులకు ఆర్‌బీఐ షాక్.. ఖాతాదారులకు జరిమానా చెల్లించాల్సిందే..!
బ్యాంకులకు ఆర్‌బీఐ షాక్.. ఖాతాదారులకు జరిమానా చెల్లించాల్సిందే..!
3 పెళ్లిళ్లు, రూ.1.25 కోట్లు వసూలు ‘లూటీ వధువు’ అరెస్ట్‌.! ఇలా..
3 పెళ్లిళ్లు, రూ.1.25 కోట్లు వసూలు ‘లూటీ వధువు’ అరెస్ట్‌.! ఇలా..
పెరుగుతున్న యూపీఐ పేమెంట్లు.. రోజు వారీ పరిమితి తెలిస్తే షాక్
పెరుగుతున్న యూపీఐ పేమెంట్లు.. రోజు వారీ పరిమితి తెలిస్తే షాక్
పిల్లబచ్చా కాదు చిచ్చరపిడుగు.. కోహ్లీతో బుల్ ఫైట్, 5 రోజుల బ్యాన్
పిల్లబచ్చా కాదు చిచ్చరపిడుగు.. కోహ్లీతో బుల్ ఫైట్, 5 రోజుల బ్యాన్