AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PM MODI: ఆనాడే చెప్పిన ప్రధాని మోదీ.. ఉజ్జయిని మహాకాల్ లోక్ అభివృద్ధికి అదే బీజం..

ప్రధానమంత్రి నరేంద్రమోదీ అక్టోబర్ 11వ తేదీ మంగళవారం మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినిలో పర్యటిస్తారు. ఈ సందర్భంగా శ్రీ మహాకల్ లోక్‌ను ఆయన జాతికి అంకితం చేస్తారు. ప్రారంభోత్సవం తర్వాత ప్రధానమంత్రి కమల్‌కుండ్, సప్తఋషి,..

PM MODI: ఆనాడే చెప్పిన ప్రధాని మోదీ.. ఉజ్జయిని మహాకాల్ లోక్ అభివృద్ధికి అదే బీజం..
Pm Modi Ujjain Visit
Amarnadh Daneti
| Edited By: Ravi Kiran|

Updated on: Oct 11, 2022 | 5:21 PM

Share

ప్రధానమంత్రి నరేంద్రమోదీ అక్టోబర్ 11వ తేదీ మంగళవారం మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినిలో పర్యటిస్తారు. ఈ సందర్భంగా శ్రీ మహాకల్ లోక్‌ను ఆయన జాతికి అంకితం చేస్తారు. ప్రారంభోత్సవం తర్వాత ప్రధానమంత్రి కమల్‌కుండ్, సప్తఋషి, మండపం, నవగ్రహాలను కాలినడకన సందర్శిస్తారు. ప్రధానమంత్రి పర్యటన నేపథ్యంలో మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహన్ మాట్లాడుతూ.. శ్రీ మహాకాల్ లోక్ ప్రాజెక్టు ప్రధానమంత్రి దూరదృష్టికి నిదర్శనమని అన్నారు. కేదార్ థామ్, కాశీ తో పాటు ఇప్పుడు మహాకాల్ లోక్ కూడా దేశంలోని ప్రధాన అథ్యాత్మిక నగరంగా తిరిగి ప్రాణం పోసుకుందన్నారు. 2004లో ఉజ్జయినిలో జరిగిన కార్యక్రమంలో నరేంద్ర మోదీ మహాకాల్ కాంప్లెక్స్ అభివృద్ధి గురించి మాట్లాడారని గుర్తుచేశారు. కాగా.. ఈరోజు ఉజ్జయిని మహాకాల్ లోక్ ప్రారంభోత్సవానికి ముందు ప్రధానమంత్రి నరేంద్రమోదీ బాబా మహాకాల్‌ను పూజిస్తారు. దాదాపు 15 నిమిషాల పాటు జరిగే ఈ పూజ కార్యక్రమాన్ని ముగ్గురు పూజారులు నిర్వహిస్తారు. గతంలో రెండు సార్లు బాబా మహాకాళ్‌ దర్శనానికి ప్రధానమంత్రి నరేంద్ర వచ్చి ఆశీస్సులు తీసుకున్నారని ఇక్కడి ఆలయ పూజారులు చెబుతున్నారు.

ఉజ్జయినిలో మహాకాల్ లోక్ ప్రారంభోత్సవానికి ముందు, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మహాకాల్ ఆలయంలో ప్రత్యేక పూజలు చేస్తారు. గర్భగుడిలో పూజా సమయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో పాటు మొత్తం ఐదుగురు ఉంటారని ఆలయ అధికారులు తెలిపారు.

ఇవి కూడా చదవండి

2011లో గుజరాత్‌ ముఖ్యమంత్రి హోదాలో నరేంద్ర మోదీ మహకాల్‌ను సందర్శించేందుకు వచ్చినప్పుడు ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించినట్లు ఇక్కడి ఆలయ అధికారులు తెలిపారు. ఆ సమయంలో భగవాన్ మహాకాల్ నరేంద్ర మోడీ కోరికలను విన్నారని, ఆ తర్వాత మోదీ ప్రధానమంత్రి అయ్యారని ఈ ఆలయ పూజారి తెలిపారు. 2024 ఎన్నికల్లోనూ విజయం సాధించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రార్థిస్తే.. మహాకల్ తప్పకుండా ఆయన కోరికలను వింటారన్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం  చూడండి..