Lal Bahadur Shastri: మహానేత లాల్ బహదూర్ శాస్త్రి జయంతి నేడు.. ఆయన డెత్ మిస్టరీ గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

Lal Bahadur Shastri Birth Anniversary: మనం మరచిన మహా నేత మాజీ ప్రధానమంత్రి లాల్‌ బహదూర్‌ శాస్త్రి 117వ జయంతి నేడు. భారతదేశ స్వాతంత్య్రం..

Lal Bahadur Shastri: మహానేత లాల్ బహదూర్ శాస్త్రి జయంతి నేడు.. ఆయన డెత్ మిస్టరీ గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
Lal Bahadur Shastri
Follow us
Surya Kala

|

Updated on: Oct 02, 2021 | 11:45 AM

 Lal Bahadur Shastri Birth Anniversary: మనం మరచిన మహా నేత మాజీ ప్రధానమంత్రి లాల్‌ బహదూర్‌ శాస్త్రి 117వ జయంతి నేడు. భారతదేశ స్వాతంత్య్రం కోసం పోరాడిన దేశభక్తుల్లో ప్రముఖుడు. రెండవ ప్రధాని లాల్‌ బహదూర్‌ శాస్త్రి. మరణించి ఐదు దశాబ్దాలకు పైగా అయ్యింది. అక్టోబర్ 2 న జన్మించిన శాస్త్రి చివరి శ్వాస వరకు దేశానికి అంకితం చేసిన గొప్ప దేశ భక్తుడు. పాకిస్థాన్ కోసం సంధికోసం విదేశాలకు వెళ్లిన లాల్ బహదూర్ శాస్త్రి మరణం చుట్టు అనేక కుట్రలు ఉన్నాయి..ఇప్పటికీ వెలుగులోకిరాని డెత్ మిస్టరీ గురించి ఇప్పుడు తెలుసుకుందాం

1965 లో ఇండో-పాక్ యుద్ధం తరువాత, జనవరి 10, 1966 న, శాస్త్రిజీ పాకిస్థాన్ అధ్యక్షుడు అయూబ్ ఖాన్‌తో శాంతి ఒప్పందంపై సంతకం చేయడానికి తాష్కెంట్ కు వెళ్లారు. అక్కడ సమావేశం జరిగిన కొన్ని గంటల తర్వాత శాస్త్రీ అనుమదాస్పద స్థితిలో మరణించారు. అయితే గుండెపోటుతో మరణించాడని చెప్పారు. శాస్త్రిగారి ఆకస్మిక మరణం భారత ప్రజలు జీర్ణించు కోలేక పోయారు. అయితే శాస్త్రీ మృతదేహాన్ని దేశానికి తీసుకువచ్చిన తర్వాత కుటుంబ సభ్యులు మృత దేహం చూసి నీలం రంగులో ఉందని ఎవరో విషం పెట్టి హత్య చేసారంటూ ఆరోపణలు చేశారు. అంతేకాదు అతని పొత్తికడుపు , మెడ వెనుక భాగంలో కత్తిరించిన గుర్తులు ఉన్నట్లు గుర్తించారు. దీనితో ఒక్కసారిగా నిజంగా అయన గుండెపోటుతో చనిపోయారా లేదా ఆయన్ని ఎవరైనా హత్య చేశారనే అనే అనుమానాలు మొదలయ్యాయి. ఈ అనుమానాలకు కొన్ని ఎవిడెన్స్ అనేవి బలాన్ని ఇచ్చాయి.

ఈ విషయంపై రాజ్ నారాయణ్ చేసిన విచారణ పార్లమెంటు లైబ్రరీలో పొందుపరిచారు. అయితే విచారణకు సంభించిన రికార్డ్స్ త్వరలోనే మాయం అయ్యాయి. ఈ నివేదిక ఎందుకు మాయం అయ్యింది ఇప్పటికీ ప్రశ్నగానే మిగిలింది. ఈ కేసు కోర్టులో ఉండగా కేసులో సాక్ష్యం చెప్పాల్సిన శాస్రి గారి పర్సనల్ డాక్టర్ డాక్టర్ RN చుగ్ , పర్సనల్ అటెండెంట్ రామ్ నాథ్ వీరిద్దరు కూడా రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. ఈ ప్రమాదం డాక్టర్ చుగ్, అతని భార్య , ఇద్దరు కుమారుల మరణించారు. అతని కూతురు ప్రమాదం నుండి బయటపడింది కానీ వికలాంగురాలైంది. పార్లమెంటరీ బాడీని కలవడానికి ముందు శాస్త్రిజీ ఇంటిని సందర్శించిన రామ్ నాథ్.. శాస్త్రి మరణం గురించి త్వరలో నిజం వెల్లడిస్తానని పేర్కొన్నారు. అయితే అతడిని కూడా కారు ఢీకొట్టింది. ప్రమాదంలో కాలతో పాటు జ్ఞాపక శక్తిని కోల్పోయారు. ఇంకా శాస్రి గారి భౌతికకాయం మీద ఎందుకు పోస్టుమార్టాన్ ఎందుకు జరగలేదు, ఇక ఈ విషయాలు అన్ని కూడా అయన సహజంగా చనిపోలేదు శాస్రిగారిని హత్య చేశారనే దానికి బలాన్ని చేకూర్చాయి.

లాల్ బహదూర్ శాస్త్రి మరణం వెనుక CIA హస్తం ఉందని వార్తలు ఇప్పటికీ వినిపిస్తూనే ఉంటాయి. లాల్ బహదూర్ శాస్త్రి మరణానికి సంబంధించిన ఒక సింగిల్ క్లాసిఫైడ్ డాక్యుమెంట్ ఉంది. అది విదేశీ సంబంధాలను ప్రభావితం చేస్తుందని ఇప్పటికీ దానిని బహిర్గతం చేయడం లేదని వార్తలు అప్పట్లో వినిపించాయి. భారతదేశంలో అత్యంత ప్రతిష్టాత్కమైన భారతరత్న పురస్కారాన్ని ప్రభుత్వం 1966 లో ప్రకటించింది. యావత్ భారతదేశం ఎప్పటికి గుర్తించుకోవాల్సిన ఒక ఆదర్శ మూర్తిని, మహానేత, గొప్ప దేశ దేశభక్తుడు లాల్ బహాదుర్ శాస్త్రి గారు.

Also Read: Gandhiji Rare Photos: మహాత్మాగాంధీ 152 వ జయంతి నేడు.. గాంధీజీ అరుదైన చిత్రమాలిక..

భలే బ్రదర్స్‌.. దొంగతనాల్లో మాస్టర్స్ పోలీసులకు ఎలా దొరికారంటే.!
భలే బ్రదర్స్‌.. దొంగతనాల్లో మాస్టర్స్ పోలీసులకు ఎలా దొరికారంటే.!
సిప్ నుంచి అధిక రాబడి పొందడం చాలా ఈజీ.. ఈ టిప్స్ పాటించడం మస్ట్.!
సిప్ నుంచి అధిక రాబడి పొందడం చాలా ఈజీ.. ఈ టిప్స్ పాటించడం మస్ట్.!
అయోధ్యలో హోటల్స్ అన్నీ హౌస్ ఫుల్.! బాలరాముడి దర్శనం కావాలంటే..
అయోధ్యలో హోటల్స్ అన్నీ హౌస్ ఫుల్.! బాలరాముడి దర్శనం కావాలంటే..
ఏథర్ ఈవీ ప్రియులకు గుడ్‌న్యూస్.. కొత్త ఏడాది నయా కలర్స్ లాంచ్..!
ఏథర్ ఈవీ ప్రియులకు గుడ్‌న్యూస్.. కొత్త ఏడాది నయా కలర్స్ లాంచ్..!
పనస గింజల అద్భుతాలు తెలిస్తే ఇక అస్సలు పడేయరు..శరీరంలో జరిగే ఇదే!
పనస గింజల అద్భుతాలు తెలిస్తే ఇక అస్సలు పడేయరు..శరీరంలో జరిగే ఇదే!
క్యాన్సర్‌ను జయించిన శివన్న.. ఎమోషనల్ వీడియో షేర్ చేసిన నటుడు
క్యాన్సర్‌ను జయించిన శివన్న.. ఎమోషనల్ వీడియో షేర్ చేసిన నటుడు
కేసీఆర్ ప్రజల్లోకి అప్పుడే వస్తారు.. కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు..
కేసీఆర్ ప్రజల్లోకి అప్పుడే వస్తారు.. కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు..
రెండోసారి తల్లి కాబోతున్న టాలీవుడ్ హీరోయిన్..
రెండోసారి తల్లి కాబోతున్న టాలీవుడ్ హీరోయిన్..
సైట్ పని చేయకపోయినా ట్రైన్ టిక్కెట్స్ బుకింగ్..!
సైట్ పని చేయకపోయినా ట్రైన్ టిక్కెట్స్ బుకింగ్..!
బ్యాంకు ఖాతాలో ఇంత నగదు డిపాజిట్‌ చేస్తున్నారా? జరిమానా పడొచ్చు!
బ్యాంకు ఖాతాలో ఇంత నగదు డిపాజిట్‌ చేస్తున్నారా? జరిమానా పడొచ్చు!