AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మధ్యతరహా పరిశ్రమలపై కేంద్ర మంత్రి కుమారస్వామి కీలక వ్యాఖ్యలు..

మధ్యతరహా పరిశ్రమల శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు హెచ్ డీ కుమార స్వామి. అయితే ముందు ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ మంత్రిగా నియామకమైన కుమారస్వామి.. తాజాగా మధ్యతరహా పరిశ్రమల శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్బంగా అయన తన శాఖపై కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. సెమీ కండక్టర్ పరిశ్రమ అనేది దేశంలో అత్యంత ప్రభావితమైనదిగా పేర్కొన్నారు. ఈ విషయాన్ని తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు. అటు అటోమొబైల్స్, ఎలక్ట్రానిక్ రంగానికి మంచి ఊతమిచ్చేందుకు దోహద పడుతుందన్నారు.

మధ్యతరహా పరిశ్రమలపై కేంద్ర మంత్రి కుమారస్వామి కీలక వ్యాఖ్యలు..
Union Minister Kumara Swamy
Srikar T
|

Updated on: Jun 15, 2024 | 12:47 PM

Share

మధ్యతరహా పరిశ్రమల శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు హెచ్ డీ కుమార స్వామి. అయితే ముందు ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ మంత్రిగా నియామకమైన కుమారస్వామి.. తాజాగా మధ్యతరహా పరిశ్రమల శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్బంగా అయన తన శాఖపై కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. సెమీ కండక్టర్ పరిశ్రమ అనేది దేశంలో అత్యంత ప్రభావితమైనదిగా పేర్కొన్నారు. ఈ విషయాన్ని తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు. అటు అటోమొబైల్స్, ఎలక్ట్రానిక్ రంగానికి మంచి ఊతమిచ్చేందుకు దోహద పడుతుందన్నారు. అలాగే ఈ పరిశ్రమ ద్వారా వేల మంది నిరుద్యోగులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ఎంతగానో దోహదపడుతుందన్నారు. సెమీ కండక్టర్ పరిశ్రమలు అనేది దేశప్రగతికి చాలా అవసరం అన్నారు. ఇవి ఆర్థికాభివృద్దికి ఎంతగానో అవసరం అన్నారు.

ఇదిలా ఉంటే కుమార స్వామి జేడీ ఎస్ ఎంపీగా గెలుపొందిన తరువాత ప్రధాని నరేంద్ర మోదీ ఎన్డీయే కూటమిలో భాగస్వామ్యమయ్యారు. ఈ నేపథ్యంలోనే ఆయనకు కేంద్రమంత్రి పదవి వరించింది. అయితే ముందుగా భారీ పరిశ్రమల శాఖ మంత్రిగా నియమించిన మోదీ ప్రభుత్వం కొన్ని అనివార్యకారణాల వల్ల మధ్యతరహా పరిశ్రమల శాఖ మంత్రిగా నియమిస్తూ ఆదేశాలు జారీ చేసింది. గత రెండు రోజుల క్రితం కేంద్ర మంత్రిగా ఢిల్లీలోని తన ఛాంబర్లో బాధ్యతలు కూడా చేపట్టారు. తనకు ఈ పదవి ఇవ్వడం పట్ల ప్రధాని మోదీకి కృతజ్ఙతలు కూడా తెలిపారు. ఈ రంగం తనకు ఇవ్వడంపై హర్షం వ్యక్తం చేశారు. ముందు పెద్ద శాఖను కేటాయించి తరువాత కుదించడంపై పలువురు మీడియా ప్రతినిథులు కేంద్ర మంత్రి కుమారస్వామిని ప్రశ్నించారు. దీనికి ఆయన ధీటైన సమాధానం ఇచ్చారు. రానున్న రోజుల్లో ఈ రంగాన్ని అభివృద్ది చేసేందుకు అనేక వ్యూహాత్మక చర్యలు చేపడతానన్నురు. ఈ శాఖ కేటాయింపుపై తాను ఎలాంటి కామెంట్స్, ట్రోల్స్ చేయలేదని స్పష్టం చేశారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..