తల్లి చనిపోయిన మరుసటిరోజే విధులకు హాజరైన పోలీస్ కానిస్టేబుల్
కర్ణాటకలో ఈరోజు అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే అక్కడ ఓ పోలీస్ కానిస్టేబుల్ చేసిన పనికి అందరూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. వివరాల్లోకి వెళ్తే అశోక్ అనే వ్యక్తి గదగ్‌లోని టగేరి లేఔట్ పోలీసుస్టేషన్‌లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్నాడు.

కర్ణాటకలో ఈరోజు అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే అక్కడ ఓ పోలీస్ కానిస్టేబుల్ చేసిన పనికి అందరూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. వివరాల్లోకి వెళ్తే అశోక్ అనే వ్యక్తి గదగ్‌లోని టగేరి లేఔట్ పోలీసుస్టేషన్‌లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. అయితే అశోక్‌కు అసెంబ్లీ ఎన్నికల డ్యూటీ వేశారు. ఈయన తల్లి శంకరమ్మ గదగ(78) వృద్ధాప్యంతో ఆదివారం రాత్రి మృతి చెందారు. సోమవారం సాయంత్రం అంత్యక్రియలు పూర్తి చేశారు. ఓ వైపు బాధలో ఉన్నా అశోక్ మంగళవార రోజునే ఉదయం విధులకు హాజరయ్యాడు. ఆయనకు సెలవు ఇచ్చినా కూడా వృత్తిపై నిబద్ధతో డ్యూటీకి వచ్చాడు.
అశోక్ చేసిన పనికి పోలీస్ ఉన్నతాధికారులతో పాటు అందరు మెచ్చుకుంటున్నారు. ఈ విషయాన్ని కర్నాటక డీజీపీ ట్విటర్‌లో పోస్ట్ చేశాడు. తల్లి చనిపోయిన మరుసటి రోజే విధులకు హాజరై పని పట్ల ఉన్న నిబద్ధతను చూపించాడంటూ రాసుకొచ్చారు. అలాగే అశోక్‌తో పాటు పనిచేసే సహచర పోలీస్ అధికారులు అతనికి సన్మానం కూడా చేశారు.




His mother passed away while he was deputed for election duty. He was asked to proceed on leave but he refused to go. Duty first. Proud of you. pic.twitter.com/2FaNRNd7Fz
— DGP KARNATAKA (@DgpKarnataka) May 9, 2023
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




