Gold Price Today: మగువలకు షాకిస్తున్న బంగారం ధరలు.. తాజా రేట్ల వివరాలు

బంగారం ధరల్లో ప్రతి రోజు హెచ్చు తగ్గులు చోటు చేసుకుంటాయి. ఒక రోజు ధర పెరిగితే.. మరో రోజు తగ్గుతుంటుంది. ఇండియా మహిళలకు పసిడికి అత్యంత ప్రాధాన్యత ఇస్తుంటారు. ధరలు ఎంత పెరిగినా.. కొనుగోళ్లు జోరుగా సాగుతూనే ఉంటాయి. పెళ్లిళ్ల సీజన్‌, ఇతర శుభకార్యాల సందర్భాలలో అయితే..

Gold Price Today: మగువలకు షాకిస్తున్న బంగారం ధరలు.. తాజా రేట్ల వివరాలు
Gold Price Today
Follow us
Subhash Goud

|

Updated on: May 10, 2023 | 6:17 AM

బంగారం ధరల్లో ప్రతి రోజు హెచ్చు తగ్గులు చోటు చేసుకుంటాయి. ఒక రోజు ధర పెరిగితే.. మరో రోజు తగ్గుతుంటుంది. ఇండియా మహిళలకు పసిడికి అత్యంత ప్రాధాన్యత ఇస్తుంటారు. ధరలు ఎంత పెరిగినా.. కొనుగోళ్లు జోరుగా సాగుతూనే ఉంటాయి. పెళ్లిళ్ల సీజన్‌, ఇతర శుభకార్యాల సందర్భాలలో అయితే బంగారం షాపులన్ని మహిళలతో కిటకిటలాడుతుంటాయి. ఇటీవల కాలం నుంచి బంగారం, వెండి ధరలు పరుగులు పెడుతున్నాయి. తాజాగా కూడా బంగారం ధర పెరిగింది. ఇక బంగారం ధర పెరిగితే వెండి ధర మాత్రం స్థిరంగా కొనసాగుతోంది. ఇంకో విషయం ఏంటంటే ఈ ధరలు ఉదయం 6 గంటలకు నమోదైనవి మాత్రమే. రోజులో తగ్గవచ్చు. పెరగవచ్చు. లేదా స్థిరంగా ఉండవచ్చు.

➦ చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.57,200 ఉండగా, అదే 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.62,400 వద్ద నమోదైంది.

➦ ముంబైలో 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ.56,700 ఉండగా, 24 క్యారెట్ల తులం ధర రూ.61,850 వద్ద ఉంది.

ఇవి కూడా చదవండి

➦ ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల రూ.56,850 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.62,000 ఉంది.

➦ కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.56,700 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.61,850 ఉంది.

➦ బెంగళూరులో 22 క్యారెట్ల ధర రూ.56,750 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.61,900 వద్ద కొనసాగుతోంది.

తెలుగు రాష్ట్రాల్లో..

➦ హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.56,700 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.61,850 వద్ద కొనసాగుతోంది.

➦ విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.56,700 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.61,850 వద్ద కొనసాగుతోంది.

➦ విశాఖలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.56,700 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.61,850 ఉంది.

వెండి ధర:

ఇక దేశీయంగా ధరలను పరిశీలిస్తే.. చెన్నైలో కిలో వెండి ధర రూ.82,000, ముంబైలో రూ.78,100, ఢిల్లీలో రూ.78,100, కోల్‌కతాలో కిలో వెండి రూ.78,100, బెంగళూరులో రూ.82,500, హైదరాబాద్‌లో రూ.82,500, విజయవాడలో రూ.82,500 విశాఖలో కూడా ఇదే ధర కొనసాగుతోంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి