Modi Government Schemes: మోడీ ప్రారంభించిన ఈ మూడు పథకాలకు 8 ఏళ్లు.. జనాధారణ పొందిన అద్భుతమైన స్కీమ్స్‌

ప్రధాని నరేంద్ర మోడీ దేశ ప్రజలకు ఎన్నో్ పథకాలను అమలు చేస్తున్నారు. ఆర్థికంగా ఎదిగేందుకు, ప్రమాద బీమా, ఏదైనా నష్టపోయిన సమయంలో వారిని బాధితులను ఆదుకునేందుకు వివిధ రకాల పథకాలను రూపొందించి అమలు చేస్తోంది మోడీ ప్రభుత్వం. అయితే మోడీ ప్రవేశపెట్టిన ప్రధాన పథకాలలో మూడు పథకాలు 8 ఏళ్లు పూర్తి చేసుకున్నాయి. ఈ పథకాల ద్వారా ఎంతో మంది లబ్దిపొందారు..

Modi Government Schemes: మోడీ ప్రారంభించిన ఈ మూడు పథకాలకు 8 ఏళ్లు.. జనాధారణ పొందిన అద్భుతమైన స్కీమ్స్‌
PM Narendra Modi
Follow us
Subhash Goud

|

Updated on: May 09, 2023 | 4:58 PM

మోదీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు: సరిగ్గా 8 సంవత్సరాల క్రితం అంటే మే 9, 2015న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కోల్‌కతాలో సామాజిక భద్రతకు సంబంధించి ప్రభుత్వ మూడు పథకాలను ప్రారంభించారు. ఈ పథకాలు ఎంతో ఆదరణ పొందాయి. ఈ పథకాల పేర్లు ప్రధాన మంత్రి సురక్ష బీమా యోజన (PMSBY), ప్రధాన్ మంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన (PMJJBY), అటల్ పెన్షన్ యోజన ప్రారంభించి 8వ వార్షికోత్సవాన్ని జరుపుకుంటున్నాయి.

ప్రధాన మంత్రి సురక్ష బీమా యోజన, ప్రధాన మంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన, అటల్ పెన్షన్ యోజన 8 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ.. ఈ మూడు ప్రజా భద్రతా పథకాలు పౌరుల అభివృద్ధి కోసం అంకితం చేయబడ్డాయlr, ఊహించని ప్రమాదాలు, నష్టాల నుంచి రక్షణ కల్పిస్తాయి. అలాగే ఆర్థిక అనిశ్చితి సమయాల్లో సాధారణ జీవితానికి భద్రతను అందిస్తుంది. ఏప్రిల్ 26, 2023 వరకు ప్రధాన మంత్రి సురక్ష బీమా యోజనలో 16.2 కోట్ల మంది, ప్రధాన మంత్రి జీవన్ జ్యోతి బీమా యోజనలో 34.2 కోట్ల మంది, అటల్ పెన్షన్ యోజనలో 5.2 కోట్ల మంది చేరారని ఆర్థిక మంత్రి తెలిపారు.

ఇవి కూడా చదవండి

ప్రధాన మంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన ద్వారా 6.64 లక్షల కుటుంబాలకు సహాయం అందించామని, ఈ కుటుంబాలకు రూ.13,290 కోట్లు బీమా క్లెయిమ్‌లుగా అందించామని ఆర్థిక మంత్రి తెలిపారు. ప్రధాన మంత్రి సురక్ష బీమా యోజన కింద 1.15 లక్షల కుటుంబాలకు రూ.2,302 కోట్ల విలువైన క్లెయిమ్‌లు పంపిణీ చేసినట్లు ఆయన తెలిపారు. రెండు బీమా పథకాలకు సంబంధించిన క్లెయిమ్ ప్రక్రియను సరళీకృతం చేయడం వల్ల క్లెయిమ్‌లను వేగంగా పరిష్కరించుకోవచ్చని మంత్రి పేర్కొన్నారు.

మోడీ ప్రారంభించిన మూడు పథకాలు ఇవే..

1. ప్రధాన మంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన (PMJJY)

ప్రధాన మంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన అనేది జీవిత బీమా పథకం. ఇది ఏదైనా కారణం వల్ల బీమా చేయబడిన వ్యక్తి మరణాన్ని కవర్ చేస్తుంది. ప్రతి సంవత్సరం ఈ ప్లాన్‌కు ప్రీమియం చెల్లించడం ద్వారా పాలసీని పునరుద్ధరించబడుతుంది. 18-50 సంవత్సరాల వయస్సు గల వ్యక్తులు ఈ పాలసీని సద్వినియోగం చేసుకోవచ్చు. వారికి బ్యాంకు లేదా పోస్టాఫీసులో ఖాతా ఉండాలి. 50 ఏళ్ల వయస్సు పూర్తి కాకుండానే పథకంలో చేరిన వ్యక్తులు ప్రీమియంల చెల్లింపుపై 55 ఏళ్ల వయస్సు వరకు సాధారణ ప్రీమియంల చెల్లింపుపై లైఫ్ పాలసీ ప్రయోజనాన్ని పొందవచ్చు. పాలసీదారు మరణించిన తర్వాత ఇచ్చే సంవత్సరానికి రూ. 436 ప్రీమియం చెల్లింపుపై రూ.2 లక్షల జీవిత బీమా లభిస్తుంది. అయితే ఖాతాదారుడు బ్యాంక్ బ్రాంచ్, బ్యాంక్ వెబ్‌సైట్‌లో లేదా పోస్టాఫీసుల్లో నమోదు చేసుకోవచ్చు. పథకం కింద ప్రీమియం ప్రతి సంవత్సరం ఖాతాదారు బ్యాంక్ ఖాతా నుంచి స్వయంచాలకంగా డెబిట్ చేయబడుతుంది. 26 ఏప్రిల్ 2023 నాటికి, మొత్తం 16.19 కోట్ల మంది ఈ పథకంలో నమోదు చేసుకున్నారు. 6,64,520 క్లెయిమ్‌లకు రూ.13,290.40 కోట్లు చెల్లించారు.

2. ప్రధాన మంత్రి సురక్ష బీమా యోజన (PMSBY)

ప్రధాన్ మంత్రి సురక్ష బీమా యోజన అనేది ప్రమాద బీమా పథకం. ఇది పాలసీదారుకు ప్రమాదం కారణంగా మరణించిన లేదా వైకల్యానికి బీమా రక్షణను అందిస్తుంది. బీమా పాలసీదారుడు ఈ పాలసీని ఏడాది తర్వాత రెన్యూవల్ చేసుకోవాలి. 18-70 సంవత్సరాల వయస్సు గల వ్యక్తులు ఈ పథకంలో నమోదు చేసుకోవచ్చు. వారికి వ్యక్తిగత బ్యాంక్ లేదా పోస్టాఫీసు ఖాతా ఉండాలి. ఈ పథకానికి సంవత్సరానికి రూ. 20 ప్రీమియం చెల్లించాలి. దీనిపై ప్రమాదవశాత్తూ డెత్ కమ్ డిజెబిలిటీ కవర్ రూ.2 లక్షలు (పాక్షిక వైకల్యం ఉంటే రూ. 1 లక్ష) అందుబాటులో ఉంటుంది. ఖాతాదారుని బ్యాంక్ బ్రాంచ్, బ్యాంక్ వెబ్‌సైట్‌లో లేదా పోస్టాఫీసును సందర్శించి ఈ పథకం కింద నమోదు చేసుకోవచ్చు. పథకం కింద ప్రీమియం ప్రతి సంవత్సరం ఖాతాదారు బ్యాంక్ ఖాతా నుంచి స్వయంచాలకంగా డెబిట్ చేయబడుతుంది. ఏప్రిల్ 26 వరకు మొత్తం 34.18 కోట్ల మందికి పైగా ఈ పథకం కింద నమోదు చేసుకున్నారు. ఇప్పటివరకు 1,15,951 క్లెయిమ్‌లకు గాను రూ.2,302.26 కోట్లు చెల్లించారు.

3. అటల్ పెన్షన్ యోజన (APY)

అటల్ పెన్షన్ యోజన అనేది భారతీయులందరికీ, ముఖ్యంగా పేదలు, నిరుపేదలు, అసంఘటిత రంగంలోని కార్మికులు 60 ఏళ్ల తర్వాత ఆర్థిక భద్రతను అందించడానికి, వారి భవిష్యత్తు అవసరాలను తీర్చడానికి సామాజిక భద్రతా పథకం. అటల్ పెన్షన్ యోజన కింద ఈ పథకంతో సంబంధం ఉన్న వ్యక్తులకు 60 ఏళ్ల తర్వాత పెన్షన్ ఇవ్వబడుతుంది. అటల్ పెన్షన్ యోజన ఆదాయపు పన్ను చెల్లించని 18 నుంచి 40 సంవత్సరాల వయస్సు గల బ్యాంకు ఖాతాదారులందరికీ అందుబాటులో ఉంటుంది. వారు కోరుకున్న పెన్షన్ ప్రకారం ప్రీమియం మొత్తాన్ని చెల్లించాలి. పథకంలో చేరిన తర్వాత లబ్ధిదారులు అందించే కంట్రిబ్యూషన్ ఆధారంగా 60 ఏళ్ల తర్వాత రూ. 1000, రూ. 2000, రూ. 3000, రూ. 4000 లేదా రూ. 5000 హామీతో కూడిన నెలవారీ పెన్షన్ ఇవ్వబడుతుంది. పథకం చందాదారుడు మరణిస్తే మొత్తం పెన్షన్ మొత్తం లబ్దిదారుని భాగస్వామికి అందిస్తారు. వారిద్దరూ మరణించిన తర్వాత నామినీకి అందించబడుతుంది.

ప్రీమియం నెలవారీ, త్రైమాసికం, అర్ధ వార్షిక ప్రాతిపదికన చెల్లించాలి. ఏప్రిల్ 27 వరకు అటల్ పెన్షన్ యోజనలో 5.2 కోట్ల మంది నమోదు చేసుకున్నారు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి