Fact Check: కుటుంబంలో ఒక కుమార్తె ఉంటే మోడీ ప్రభుత్వం ప్రతి నెలా రూ.4500 ఇస్తుందా?

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నో రకాల పథకాలు అమలు చేస్తున్నాయి. మీ ఇంట్లో కూతురు ఉంటే ప్రభుత్వం నుంచి ప్రతి నెల రూ.4500 అందుతుందా? ఈ రోజుల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ అనేక పథకాలకు సంబంధించి సోషల్ మీడియాలో సందేశాలు వైరల్ అవుతున్నాయి. ఈ రోజుల్లో ఆడపిల్లలు ఉన్న..

Fact Check: కుటుంబంలో ఒక కుమార్తె ఉంటే మోడీ ప్రభుత్వం ప్రతి నెలా రూ.4500 ఇస్తుందా?
Kanya Sumangala Yojana
Follow us

|

Updated on: May 07, 2023 | 6:30 AM

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నో రకాల పథకాలు అమలు చేస్తున్నాయి. మీ ఇంట్లో కూతురు ఉంటే ప్రభుత్వం నుంచి ప్రతి నెల రూ.4500 అందుతుందా? ఈ రోజుల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ అనేక పథకాలకు సంబంధించి సోషల్ మీడియాలో సందేశాలు వైరల్ అవుతున్నాయి. ఈ రోజుల్లో ఆడపిల్లలు ఉన్న కుటుంబాలకు ప్రభుత్వం నుంచి నెలకు రూ. 4,500 అందజేస్తామని ఒక మెసేజ్‌ వైరల్‌ అవుతోంది. దీనిపై ప్రెస్‌ ఇన్ఫర్మేషన్‌ బ్యూరో (పీఐబీ) వైరల్‌ అవుతున్న సందేశంపై క్లారిటీ ఇచ్చింది.

పిఐబి ఫ్యాక్ట్ చెక్ తన అధికారిక ట్వీట్‌లో ఇందుకు సంబంధించిన నిజాన్ని తెలియజేసింది. ‘సర్కారీ వ్లాగ్’ అనే యూట్యూబ్ ఛానెల్ వీడియోలో, ‘కన్యా సుమంగళ యోజన’ కింద కుటుంబాలలో కుమార్తెలు ఉన్నవారికి కేంద్ర ప్రభుత్వం ప్రతి నెల రూ. 4,500 ఇస్తోందని పేర్కొంది. ఈ వైరల్‌ అవుతున్న సందేశం ఫేక్‌ అని పీఐబీ తేల్చి చెప్పింది. కేంద్ర ప్రభుత్వం అటువంటి పథకం అమలు చేయడం లేదని స్పష్టం చేసింది.

ఇవి కూడా చదవండి

కన్యా సుమంగళ్ యోజన అంటే ఏమిటి?

కన్యా సుమంగళ యోజన అనేది ఒక వినూత్న ద్రవ్య ప్రయోజన పథకం. ఇది ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఆడపిల్లల ఉద్ధరణ లక్ష్యంగా ఈ పథకం ఉంది. ఈ పథకం కన్యా సుమంగళ యోజన 2023 కింద ఒక కుటుంబంలోని ఇద్దరు ఆడపిల్లల సంరక్షకులు లేదా తల్లిదండ్రులకు ఆర్థిక సహాయం అందిస్తుంది. ఈ పథకం 25 అక్టోబర్ 2019న లక్నోలో ప్రారంభించబడింది.

ఫేక్ మెసేజ్‌లను ఎవరితోనూ షేర్ చేయవద్దు

అలాంటి మెసేజ్‌లను ఎవరితోనూ షేర్ చేయవద్దని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. దీనితో పాటు, మీరు ప్రభుత్వానికి సంబంధించిన ఏదైనా పథకం గురించి సమాచారాన్ని పొందాలనుకుంటే, మీరు అధికారిక వెబ్‌సైట్‌లో మాత్రమే సంప్రదించాలి.

ఇలాంటి నకిలీ వార్తలకు దూరంగా ఉండాలని, ఈ వార్తలను ఎవరితోనూ పంచుకోవద్దని కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. ప్రస్తుతానికి అలాంటి వార్తలను ఫార్వార్డ్ చేయకండి. మీరు ఏదైనా వైరల్ సందేశం నిజం తెలుసుకోవాలనుకుంటే, మీరు ఈ మొబైల్ నంబర్ 918799711259 లేదా socialmedia@pib.gov.in కు మెయిల్ చేయవచ్చు అని పీఐబీ సూచించింది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి