Whatsapp Loan: వాట్సాప్‌లో హాయ్ అని పంపితే రూ.10 లక్షల లోన్.. వివరాలివే..!

జీవితంలో ఏదో సాధించాలనుకునే యువత ఎక్కువగా బిజినెస్ లోన్లు తీసుకుని వివిధ వ్యాపారాలు చేసుకుంటూ ఉంటారు. అయితే ఈ బిజినెస్ లోన్లు తీసుకోవాలంటే ప్రాసెస్ చాలా ఎక్కువగా ఉంటుంది. అయితే తాజాగా ఐఐఎఫ్ఎల్ కంపెనీ వాట్సాప్ ద్వారా రూ.10 లక్షల వరకూ బిజినెస్ లోన్లు ఇచ్చేందుకు ముందుకు వచ్చింది.

Whatsapp Loan: వాట్సాప్‌లో హాయ్ అని పంపితే రూ.10 లక్షల లోన్.. వివరాలివే..!
Whatsapp
Follow us
Srinu

|

Updated on: May 07, 2023 | 6:30 AM

యువతను ఈ మధ్య కాలంలో ఎక్కువగా ఇన్‌స్టంట్ మేసేజింగ్ యాప్ వాట్సాప్‌ను ఎక్కువగా వాడుతున్నారు. డాక్యుమెంట్లు, ఫొటోలు వీడియోలు వంటి షేర్ చేసుకునే అవకాశం ఉండడంతో ఎక్కువగా ఆకర్షితులవుతున్నారు. అలాగే జీవితంలో ఏదో సాధించాలనుకునే యువత ఎక్కువగా బిజినెస్ లోన్లు తీసుకుని వివిధ వ్యాపారాలు చేసుకుంటూ ఉంటారు. అయితే ఈ బిజినెస్ లోన్లు తీసుకోవాలంటే ప్రాసెస్ చాలా ఎక్కువగా ఉంటుంది. అయితే తాజాగా ఐఐఎఫ్ఎల్ కంపెనీ వాట్సాప్ ద్వారా రూ.10 లక్షల వరకూ బిజినెస్ లోన్లు ఇచ్చేందుకు ముందుకు వచ్చింది. ఇది ఇన్‌స్టంట్ అప్రూవల్ లోన్ ఆ కంపెనీ ప్రతినిధులు చెబుతున్నారు. ఈ లోన్ ఎంఎస్ఎంఈ లోన్ జారీ ప్రక్రియలో గేమ్-ఛేంజర్ అని తెలుస్తోంది. రుణ దరఖాస్తు నుంచి డబ్బు బదిలీ వరకూ ఈ ప్రక్రియ వంద శాతం డిజిటల్‌గా ఉంటుంది. భారతదేశంలో 450 మిలియన్లకు పైగా ఉన్న వాట్సాప్ వినియోగదారులు ఐఐఎఫ్ఎల్ ఫైనాన్స్ నుంచి ఈ 24×7 ఎండ్-టు-ఎండ్ డిజిటల్ లోన్ సదుపాయాన్ని పొందవచ్చు.

ఐఐఎఫ్ఎల్  ఫైనాన్స్ 10 మిలియన్లకు పైగా కస్టమర్‌లను కలిగి ఉన్న భారతదేశంలోని అతిపెద్ద రిటైల్ ఎన్‌బీఎఫ్‌సీల్లో ఒకటి. ఈ కంపెనీ చిన్న తరహా పరిశ్రమలకు రుణాలను అందిస్తుంది. దేశమంతటా విస్తరించి ఉన్న బ్రాంచ్‌లు, డిజిటల్‌గా అందుబాటులో ఉండడడంతో త్వరితగతిన రుణం కోసం చూస్తున్న చిన్న వ్యాపారవేత్తలకు ఈ వాట్సాప్ లోన్ సదుపాయం ఇది సరైన ఎంపికగా ఉంటుంది. ఈ అద్భుతమైన సదుపాయాన్ని పొందేందు ఏఐ బాట్ అడిగే కొన్ని ప్రశ్నలకు సమాధానం ఇవాల్సి ఉంటుంది. మీ అప్లికేషన్ అవసరమైన అన్ని వివరాలతో సరిపోలితే, మీరు ఏ సమయంలోనైనా మీ లోన్ ఆమోదాన్ని పొందుతారు. ఈ ప్రక్రియ పూర్తిగా కాగిత రహితంగా ఉంటుంది. 90197 02184 నెంబర్‌కు హాయ్ అని టైప్ చేసి పంపితే లోన్ ప్రక్రియ ప్రారంభం అవుతుంది. ఐఐఎఫ్ఎల్ ఫైనాన్స్ ప్రస్తుతం తన వాట్సాప్ లోన్ ఛానెల్ ద్వారా ఒక లక్ష ఎంఎస్ఎంఈ క్రెడిట్ విచారణలను నిర్వహిస్తుంది. దీంతో ఇది దేశంలో అత్యంత అందుబాటులో ఉండే లెండింగ్ ప్లాట్‌ఫారమ్‌లలో ఒకటిగా నిలిచింది. తమ కంపెనీ ముఖ్యంగా చిన్న వ్యాపారులపై ఎక్కువ దృష్టి పెడుతుందని కంపెనీ ప్రతినిధులు చెబుతున్నారు. ఈ పేపర్‌లెస్ రుణ దరఖాస్తు ప్రక్రియ వల్ల ఇంటి నుంచే రుణం పొందే సదుపాయాన్ని అందిస్తుందని పేర్కొంటున్నారు. 

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..