Whatsapp Update: వాట్సాప్‌లో అదిరిపోయే అప్‌డేట్.. ఒకేసారి నాలుగు డివైజ్‌ల్లో కనెక్టయ్యేలా..!
ట్సాప్‌లో ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లను అందుబాటులోకి తీసుకురావడానికి మెటా సంస్థ కృషి చేస్తుంది. ప్రస్తుతం వాట్సాప్ కేవలం ఒక్క డివైజ్‌లో మాత్రమే వాడే అవకాశం ఉంది. దీంతో కొన్నిసార్లు ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా చాట్ బ్యాకప్ సమయంలో ఈ ఇబ్బంది మరింత ఎక్కువ అవుతుంది. ప్రస్తుతం వాట్సాప్ స్మార్ట్‌ఫోన్‌లతో సహా బహుళ పరికరాల్లో ఒకే నంబర్‌తో రిజిస్టర్ చేసి ఉపయోగించడానికి ఓ కొత్త ఫీచర్‌ను విడుదల చేసింది.
యువత తమ స్మార్ట్ ఫోన్స్‌లో ఇన్‌స్టంట్ మేసేజింగ్ యాప్ వాట్సాప్‌ను అధికంగా వాడుతూ ఉంటారు. కేవలం మెసేజ్‌లు మాత్రమే కాకుండా కాల్స్, వీడియో కాల్స్, ఫోటోలు, వీడియోలు, డాక్యుమెంట్లు, ఫైల్స్ షేరింగ్ వంటి ఎన్నో సదుపాయాలు ఉండడంతో యువతను ఈ యాప్ ఎంతగానో ఆకట్టుకుంది. అంతేకాకుండా గ్రూప్‌లను క్రియేట్ చేసుకుని చాట్ చేసే సదుపాయం ఉండడంతో చాలా అఫిషియల్ వర్క్స్‌కు కూడా వాట్సాప్‌ను ఉపయోగిస్తున్నారు. అయితే వాట్సాప్ ప్రస్తుతం మెటా యాజమాన్యంలో ఉంది. వాట్సాప్‌లో ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లను అందుబాటులోకి తీసుకురావడానికి మెటా సంస్థ కృషి చేస్తుంది. ప్రస్తుతం వాట్సాప్ కేవలం ఒక్క డివైజ్‌లో మాత్రమే వాడే అవకాశం ఉంది. దీంతో కొన్నిసార్లు ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా చాట్ బ్యాకప్ సమయంలో ఈ ఇబ్బంది మరింత ఎక్కువ అవుతుంది. ప్రస్తుతం వాట్సాప్ స్మార్ట్‌ఫోన్‌లతో సహా బహుళ పరికరాల్లో ఒకే నంబర్‌తో రిజిస్టర్ చేసి ఉపయోగించడానికి ఓ కొత్త ఫీచర్‌ను విడుదల చేసింది. గత సంవత్సరం ఒకే ఫోన్ నాలుగు ఇతర నాన్-ఫోన్ పరికరాలలో ఏకకాలంలో వాట్సాప్ యూజ్ చేయడానికి బహుళ-పరికర సామర్థ్యాన్ని కంపెనీ ఆవిష్కరించింది. ఈ మేరకు గత నెల చివరిలోఈ ఫీచర్‌కను అందుబాటులోకి తీసుకువచ్చింది. చాలా మంది స్మార్ట్‌ఫోన్ వినియోగదారులు ఒకే పరికరాన్ని కలిగి ఉండగా బహుళ-పరికర కనెక్టివిటీకి అనేక ప్రయోజనాలు ఉన్నాయి. మొదట, ఈ ఫీచర్ వినియోగదారులకు బహుళ పరికరాల్లో యాప్‌ను ఉపయోగించడానికి సౌలభ్యాన్ని అందిస్తుంది. అలాగే పాత పరికరం నుంచి డేటాను కొత్తదానికి బదిలీ చేయడం సులభంగా ఉంటుంది. అలాగే మీరు ఎక్కడి నుంచైనా మీ వాట్సాప్‌ను యాక్సెస్ చేసే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా మీ ప్రాథమిక ఫోన్‌లో ఇంటర్నెట్ లేకపోయినా ద్వితీయ పరికరం నుంచి వాట్సాప్‌ను వాడే అవకాశం ఉంది. అయితే ఈ ఫీచర్‌ను ఎలా వాడాలో ఓ సారి తెలుసుకుందాం.
మీ వాట్సాప్‌ను ఇతర పరికరాలకు కనెక్ట్ చేయండిలా
- మీరు ఐఓఎస్, ఆండ్రాయిడ్‌లో వాట్సాప్ తాజా వెర్షన్‌ని ఉపయోగిస్తున్నారని నిర్ధారించుకోవాలి.
- బహుళ-పరికర మద్దతును పరీక్షించడానికి ఐఓఎస్‌లో వాట్సాప్ వెర్షన్ 23.8.78, ఆండ్రాయిడ్‌లో 2.23.8.76ని ఉపయోగించాలి.
- మీ ద్వితీయ పరికరంలో వాట్సాప్ తెరవాలి. నిబంధనలు, షరతులను అంగీకరించాలి.
- మీరు లాగిన్ పేజీకి చేరుకున్నప్పుడు, ఎగువ కుడివైపున మూడు-చుక్కల మెనుని ఎంచుకోండి. లింక్ పరికరాన్ని ఎంచుకోవాలి.
- తర్వాత మీ వాట్సాప్ ఈజీగా కనెక్ట్ చేసుకుంటే మీ వాట్సాప్‌ను వాడుకోవచ్చు.
మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..