AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Noise Colorfit Ultra3: నాయిస్ నుంచి అదిరిపోయే స్మార్ట్ వాచ్.. ధరెంతో తెలుసా?

ప్రముఖ స్మార్ట్ వాచ్ తయారీ సంస్థ నాయిస్ ఎప్పటికప్పుడు కొత్త మోడల్ వాచ్‌లతో యువతను ఆకట్టుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. ప్రస్తుతం నాయి కలర్ ఫిట్ అల్ట్రా-3 మోడల్‌ను రిలీజ్ చేసింది. ఈ వాచ్ డిజైన్ అలాగే ఫీచర్ల కచ్చితంగా యువతను ఆకట్టుకుంటాయని కంపెనీ ప్రతినిధులు చెబుతున్నారు.

Noise Colorfit Ultra3: నాయిస్ నుంచి అదిరిపోయే స్మార్ట్ వాచ్.. ధరెంతో తెలుసా?
Noise Color Fit Ultra 3
Nikhil
|

Updated on: May 03, 2023 | 4:45 PM

Share

ప్రస్తుతం యువత ఎక్కువ స్మార్ట్ యాక్ససరీస్‌ను వాడుతున్నారు. ముఖ్యంగా స్మార్ట్ వాచ్‌లను ఎక్కువగా ఇష్టపడుతున్నారు. యువత నుంచి అనూహ్యంగా పెరిగిన డిమాండ్‌కు అనుగుణంగా కంపెనీలు వివిధ మోడల్స్‌లో స్మార్ట్ వాచ్‌లను మార్కెట్‌లోకి రిలీజ్ చేస్తున్నాయి. స్మార్ట్ వాచ్‌లోనే బ్లూటూత్ కాలింగ్, ఆరోగ్య సంబంధిత అలర్ట్‌ల వంటి ఫీచర్లను అందిస్తున్నాయి. దీంతో యువత స్మార్ట్ వాచ్‌లను ఎక్కువగా ఇష్టపడుతున్నారు. ప్రముఖ స్మార్ట్ వాచ్ తయారీ సంస్థ నాయిస్ ఎప్పటికప్పుడు కొత్త మోడల్ వాచ్‌లతో యువతను ఆకట్టుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. ప్రస్తుతం నాయిస్ కలర్ ఫిట్ అల్ట్రా-3 మోడల్‌ను రిలీజ్ చేసింది. ఈ వాచ్ డిజైన్ అలాగే ఫీచర్ల కచ్చితంగా యువతను ఆకట్టుకుంటాయని కంపెనీ ప్రతినిధులు చెబుతున్నారు. మంచి మెటాలిక్ డిజైన్‌తో వచ్చే ఈ వాచ్ చూడడానికి ప్రీమియం లుక్‌లో ఉంది. కేవలం రూ.4499కే ఈ వాచ్ అందుబాటులో ఉంటుంది. అలాగే ఈ వాచ్‌ను నాయిస్ వెబ్‌సైట్‌తో పాటు అమెజాన్‌లో బుక్ చేసుకోవచ్చు. అయితే వాచ్ స్ట్రిప్స్‌ను మనం ఎంచుకునే అవకాశం కంపెనీ కల్పించింది. అయితే స్ట్రిప్స్ కారణంగా వాచ్ ధర రూ.5499గా వరకూ పెరుగుతుంది. సిలికాన్, లెదర్, మెటల్ స్ట్రాప్స్ వినియోగదారులకు అందుబాటులో ఉన్నాయి. అలాగే ఈ వాచ్‌లో వచ్చే అదనపు ఫీచర్లు ఏంటో ఓ క్విక్ లుక్కేద్దాం.

  • నాయిస్ కలర్ ఫిట్ అల్ట్రా ఫీచర్లు ఇవే
  • మెటాలిక్ బిల్డ్‌తో సొగసైన డిజైన్
  • 1.96 ఎమోఎల్ఈడీ డిస్‌ప్లే, 410×502 పిక్సెల్‌ రిజుల్యూషన్, 550నిట్స్ బ్రైట్ నెస్
  • 150 ప్లస్ క్లౌడ్ ఆధారిత వాచ్ ఫేస్‌లు
  • బ్లూటూత్ 5.3తో కాలింగ్‌ ఫెసిలిటీ
  • అంతర్నిర్మిత మైక్, స్పీకర్
  • 300 ఎంఏహెచ్ బ్యాటరీతో ఏడు రోజుల బ్యాటరీ బ్యాకప్
  • 100 ప్లస్ స్పోర్ట్స్ మోడ్‌లు
  • హార్ట్ బీట్ రేటు, ఎస్‌పీఓ2, యాక్సిలెరోమీటర్
  • నాయిస్ హెల్త్ సూట్
  • ఐపీ 68 వాటర్ రెసిస్టెంట్
  • స్మార్ట్ నోటిఫికేషన్‌లు, ఏఐ వాయిస్ అసిస్టెంట్, ఇన్‌బిల్ట్ గేమ్‌లు
  • వాతావరణ వివరాలు, రిమోట్ కెమెరా కంట్రోల్, టైమర్, రిమైండర్ వంటి సదుపాయాలు
  • నాయిస్ ఫిట్ యాప్ సపోర్ట్
  • 1 సంవత్సరం వారెంటీ

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..

Follow Us
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్