మీకో హెచ్చరిక..! మీ స్మార్ట్ ఫోన్ కి ఛార్జింగ్ ఎంతవరకు పెట్టాలో తెలుసా..? హద్దు దాటితే అంతేసంగతి..!!

చిన్నపిల్లల నుండి పెద్దల వరకు ప్రతి ఒక్కరూ స్మార్ట్ ఫోన్ వినియోగిస్తున్నారు. అయితే ఈ స్మార్ట్ ఫోన్లు వినియోగించేవారు వాటి గురించిన కొన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాల్సిన అవసరం ఉంది. రోజంతా ఫోన్‌ని ఉపయోగించాలంటే.. దాన్ని పూర్తిగా ఛార్జ్ చేయాలి. కానీ 100% ఛార్జింగ్ చేస్తే మాత్రం ప్రమాదం తప్పదంటున్నారు నిపుణులు.

మీకో హెచ్చరిక..! మీ స్మార్ట్ ఫోన్ కి ఛార్జింగ్ ఎంతవరకు పెట్టాలో తెలుసా..? హద్దు దాటితే అంతేసంగతి..!!
Cell Phone Charging
Follow us
Jyothi Gadda

|

Updated on: May 03, 2023 | 4:16 PM

ప్రస్తుతమంతా టెక్నాలజీ యుగం నడుస్తోంది. నేడు స్మార్ట్‌ఫోన్ ఉపయోగించని వారు ఉండరు. ప్రతిరోజు ఉదయం లేచింది మొదలు రాత్రి పడుకునే దాకా ఫోన్ తోనే సమయాన్ని కేటాయిస్తున్నారు. ఇలా చిన్నపిల్లల నుండి పెద్దల వరకు ప్రతి ఒక్కరూ స్మార్ట్ ఫోన్ వినియోగిస్తున్నారు. అయితే ఈ స్మార్ట్ ఫోన్లు వినియోగించేవారు వాటి గురించిన కొన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాల్సిన అవసరం ఉంది. రోజంతా ఫోన్‌ని ఉపయోగించాలంటే.. దాన్ని పూర్తిగా ఛార్జ్ చేయాలి. కానీ 100% ఛార్జింగ్ చేస్తే మాత్రం ప్రమాదం తప్పదంటున్నారు నిపుణులు.

మీరు ఫోన్‌ను 100% వరకు పూర్తిగా ఛార్జ్ చేయకూడదు. ఎందుకంటే మొబైల్ బ్యాటరీ లిథియం అయాన్‌తో తయారు చేయబడింది. దాని ఛార్జింగ్ 30 నుండి 50% ఉన్నప్పుడు లిథియం బ్యాటరీ ఉత్తమంగా పనిచేస్తుంది. మీరు ప్రతిసారీ 100% ఛార్జ్ చేస్తే, అది మీ ఫోన్ బ్యాటరీని పాడు చేస్తుంది. ఇకపోతే, చాలా మందికి రాత్రిపూట పూర్తిగా ఛార్జింగ్ పెట్టే అలవాటు ఉంటుంది. ఇలా చేయడం వల్ల ఫోన్ 100% పూర్తిగా ఛార్జ్ అయి బ్యాటరీ పాడయ్యే ప్రమాదం ఉంది. ఇది మాత్రమే కాదు, నాణ్యత లేని బ్యాటరీ రాత్రిపూట ఛార్జ్ చేస్తున్న క్రమంలో కొన్నిసార్లు పేలిపోయే ప్రమాదం కూడా ఉంది.

చాలా మంది ప్రజలు బెడ్‌లో ఉన్నప్పుడు తమ ఫోన్‌ను ఛార్జ్ చేస్తారు. ఇది కూడా ప్రమాదకరం. దీనికి కారణం బెడ్ మీద ఫోన్ ఛార్జింగ్ పెట్టే సమయంలో ఫోన్ వేడెక్కడంతోపాటు బెడ్ కు మంటలు అంటుకునే ప్రమాదం ఉంది. ఛార్జింగ్ పెడుతూనే ఫోన్ ఆన్ చేసే అలవాటు కూడా చాలా మందికి ఉంటుంది. అలాంటి అలవాటు మిమ్మల్ని ప్రమాదంలో పడేస్తుంది. కొన్ని సందర్భాల్లో ఫోన్ పేలిపోయే అవకాశం కూడా ఉంది. దీని వల్ల ఫోన్ త్వరగా ఛార్జ్ అవ్వదు. పైగా బ్యాటరీకి హాని కలిగిస్తుంది. 100 శాతం వరకు బ్యాటరీ ఫుల్ చేయడం ద్వారా దాని లైఫ్ టైమ్ తగ్గిపోతుందని అంటున్నారు నిపుణులు. ప్రతి బ్యాటరీలో ఛార్జ్ సైకిల్స్ ఉంటాయి. ఆ బ్యాటరీ పరిమితుల ప్రకారం.. అన్నిసార్లు మాత్రమే ఛార్జ్ చేయాల్సి ఉంటుంది. లేదంటే బ్యాటరీ తొందరగా పాడైపోయే అవకాశం ఉంది. మొబైల్ ఫోన్ ఛార్జింగ్ నెలలో 100% ఒకసారి మాత్రమే బ్యాటరీ ఫుల్ చేయాలని.. ఛార్జింగ్ పెట్టినప్పుడల్లా 20% నుంచి 80% వరకు మాత్రమే ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..