కళ్ల కింద నల్లటి వలయాలను తగ్గించే చిట్కాలు..ఇంట్లోనే ఈజీగా చేసుకునే కాఫీ అండర్‌ ఐ మాస్క్‌ తయారు చేసుకోండిలా..

రకరకాల కారణాల వల్ల కళ్ల కింద నల్లటి వలయాలు ఏర్పడతాయి. ప్రారంభంలోనే వీటిని గుర్తించి తగ్గించే దిశగా చర్యలు తీసుకోవాలి. లేదంటే కళ్ల కింద నల్లటి మచ్చలు అలాగే ఉండిపోవడంతోపాటు అనేక ఆరోగ్య సమస్యలు కూడా తలెత్తుతాయి. ఈ వలయాలను తగ్గించడానికి సహజ మార్గాలు అనేకం అందుబాటులో ఉన్నాయి.

కళ్ల కింద నల్లటి వలయాలను తగ్గించే చిట్కాలు..ఇంట్లోనే ఈజీగా చేసుకునే కాఫీ అండర్‌ ఐ మాస్క్‌ తయారు చేసుకోండిలా..
Dark Circles
Follow us
Jyothi Gadda

|

Updated on: May 02, 2023 | 8:31 PM

కళ్లు మనిషికి గుర్తింపు. కాబట్టి ప్రతి ఒక్కరూ ఆకర్షణీయమైన కళ్ళు కలిగి ఉండాలని కోరుకుంటారు. కానీ చాలా మందికి కళ్ల కింద నల్లటి వలయాల సమస్య ఉంటుంది. ఇది కళ్ల అందాన్ని కప్పివేస్తుంది. ఒత్తిడి, నిద్రలేమి, హార్మోన్ల మార్పులు, జీవన శైలిలో మార్పులు.. ఇలా రకరకాల కారణాల వల్ల కళ్ల కింద నల్లటి వలయాలు ఏర్పడతాయి. ప్రారంభంలోనే వీటిని గుర్తించి తగ్గించే దిశగా చర్యలు తీసుకోవాలి. లేదంటే కళ్ల కింద నల్లటి మచ్చలు అలాగే ఉండిపోవడంతోపాటు అనేక ఆరోగ్య సమస్యలు కూడా తలెత్తుతాయి. ఈ వలయాలను తగ్గించడానికి సహజ మార్గాలు అనేకం అందుబాటులో ఉన్నాయి. వాటిని పాటిస్తే రెండు రోజుల్లోనే డార్క్ సర్కిల్స్ మాయం అవుతాయి. కాఫీ ఫేస్‌ ప్యాక్‌తో డార్క్‌ సర్కిల్స్‌ ఎలా తగ్గించుకోవచ్చో ఇక్కడ తెలుసుకుందాం.. కాఫీ, తేనె, విటమిన్ ఇ క్యాప్సూల్స్ సహాయంతో ఈ ఫేస్‌ ప్యాక్‌ తయారు చేసుకోవాలి. కాబట్టి ఈ మూడింటిని కలిపి అప్లై చేయడం వల్ల కొద్ది రోజుల్లోనే కళ్ల కింద నల్లటి వలయాలు మాయమవుతాయి. ఇది కాకుండా, మీరు ఉబ్బిన, అలసిపోయిన కళ్ళ సమస్యను కూడా అధిగమించవచ్చు. కాఫీ మాస్క్ ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం.

కాఫీ అండర్ ఐ మాస్క్ చేయడానికి కావలసిన పదార్థాలు:

– ఒక చెంచా కాఫీ పొడి

– ఒక చెంచా తేనె

ఇవి కూడా చదవండి

– విటమిన్ ఇ క్యాప్సూల్స్

 కాఫీని ప్యాక్‌ని ఎలా తయారు చేయాలి?

కాఫీ అండర్ ఐ మాస్క్ చేయడానికి, ముందుగా ఒక గిన్నె తీసుకోండి.

తర్వాత కాఫీ, తేనె వేసి బాగా కలపాలి.

ఆ తర్వాత అందులో విటమిన్ ఇ క్యాప్సూల్స్ వేయాలి.

అప్పుడు మీరు మళ్ళీ బాగా కలపాలి.

ఇప్పుడు మీ కాఫీ అండర్ ఐ మాస్క్ సిద్ధంగా ఉంది. కాఫీ అండర్ ఐ మాస్క్ ఎలా ఉపయోగించాలి?

సిద్ధం చేసుకున్న మిశ్రమాన్ని తీసుకుని కళ్ల కింద సమానంగా అప్లై చేయాలి.

తర్వాత దాదాపు 10 నిమిషాల పాటు ఇలాగే వదిలేయండి.

దీని తర్వాత మీ ముఖాన్ని చల్లటి నీటితో కడగాలి.

ఉత్తమ ఫలితాల కోసం రోజుకు ఒకసారి ఈ ఐ మాస్క్‌ని అప్లై చేయండి.

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..