వీడేవడండీ బాబు.. ! ఆగివున్న కారును ఢీకొట్టి పల్టీలు కొట్టాడు.. వీడియో చూస్తే పొట్ట చెక్కలే..

రోడ్లు, ఇళ్లు, ఇతర భవనాలపై అమర్చిన సీసీటీవీ కెమెరాల్లో రికార్డయిన ప్రమాదాల వీడియోలు సోషల్ మీడియాలో షేర్ అవుతూ వైరల్ అవుతున్నాయి. ఇప్పుడు ప్రమాదానికి సంబంధించిన మరో వీడియో విడుదలైంది. ఈ వీడియోలో ఒక మహిళ హైవేపై కారు నడుపుతూ వెళ్తుంది. రెడ్ లైట్ పడటంతో ఆమె కారును ఆపేసింది. కానీ, ఆమె కారువెనకాల ఒక వ్యక్తి

వీడేవడండీ బాబు.. ! ఆగివున్న కారును ఢీకొట్టి పల్టీలు కొట్టాడు.. వీడియో చూస్తే పొట్ట చెక్కలే..
Accident Video
Follow us
Jyothi Gadda

|

Updated on: May 02, 2023 | 8:06 PM

ఇంటర్నెట్ ప్రపంచం ఎన్నో అద్భుతాలతో నిండి ఉన్న విభిన్న ప్రపంచం. ఇక్కడ అనేక రకలైన చిత్ర విచిత్ర సంఘటనలకు సంబంధించిన వార్తలు, వీడియోలను చూస్తుంటాం. ఇక్కడ షేర్ చేయబడిన సందేశాలు, ఫోటోలు, వీడియోలు మనకు అనేక సందేశాలను అందిస్తాయి. అది ఉపయోగకరమైన సమాచారంతో పాటు వినోదాన్ని కూడా పంచుతుంది. ఇంటర్నెట్‌లో షేర్ చేయబడిన వీడియోలు మన దైనందిన జీవితంలో మనం ఎదుర్కొనే టెన్షన్‌ల నుండి కాస్త రిలాక్స్ అవ్వడానికి సహాయపడతాయి. ఆన్‌లైన్ ప్రపంచంలో, సోషల్ మీడియా అనేది వినోదం, సమాచారానికి సంబంధించిన పెద్ద నిధి వంటిది. ఇక్కడ ఎప్పుడు ఏది వైరల్ అవుతుందనేది ఎవరి ఊహకు అందని విషయం. ఈ క్రమంలోనే పలు సందర్బాల్లో సీసీ కమెరాల్లో రికార్డైన ఆక్సిడెంట్లకు సంబంధించిన వీడియోలు కూడా కనిపిస్తుంటాయి. ఇలాంటివి చూస్తే మన కళ్లను మనమే నమ్మలేకుండా ఉంటాయి. అలాంటిదే ఇక్కడ కూడా ఒక ఫన్నీ ఆక్సిడెంట్‌ వీడియో నెట్టింట వైరల్‌ అవుతోంది.

రోడ్లు, ఇళ్లు, ఇతర భవనాలపై అమర్చిన సీసీటీవీ కెమెరాల్లో రికార్డయిన ప్రమాదాల వీడియోలు సోషల్ మీడియాలో షేర్ అవుతూ వైరల్ అవుతున్నాయి. ఇప్పుడు ప్రమాదానికి సంబంధించిన మరో వీడియో విడుదలైంది. ఈ వీడియోలో ఒక మహిళ హైవేపై కారు నడుపుతూ వెళ్తుంది. రెడ్ లైట్ పడటంతో ఆమె కారును ఆపేసింది. కానీ, ఆమె కారువెనకాల ఒక వ్యక్తి బైక్‌పై వేగంగా వస్తుండటం కనిపించింది. బైక్‌పై వస్తున్న వ్యక్తి ఎటు చూస్తున్నాడో, ఏం ఆలోచిస్తున్నాడో తెలియదు. గానీ, నేరుగా వచ్చి కారును ఢీకొంటాడు. స్పీడ్‌గా వచ్చి కారును ఢీకొట్టడంతో వేగంగా ఎగిరి కారుపై పడ్డాడు. పైగా కారుపై పల్టీ కొట్టాడు. ఇదంతా సీసీ కెమెరాలో రికార్డైంది.

ఇవి కూడా చదవండి

కారుపై పడ్డ ఆ వ్యక్తి పల్టీలు కొట్టి కారుపైనే కూర్చుని ఉన్నాడు. మొదట అతనికి ఏమీ అర్థం కాలేదు. కారు నడుపుతున్న మహిళకు కూడా ఏం అర్థం కాలేదు. అకస్మాత్తుగా తన కారును వాహనం ఢీకొట్టిందని తెలుసుకున్న ఆ మహిళ షాక్‌ అవుతుంది. కారు దిగి ఏం జరిగిందో అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తుంది. అంతలోనే కారుపై ఎగిరిపడ్డ వ్యక్తి కూడా మెల్లగా కారు పైనుంచి కిందకు దిగుతాడు. బైక్ అతివేగానికి కారు విండ్ షీల్డ్ పగిలిపోవడం, ఆ వ్యక్తి కారుపై పడిపోవడంతో ఆ వీడియోలో కనిపిస్తోంది. మహిళా డ్రైవర్‌కి కూడా హఠాత్తుగా ఏం జరిగిందో అర్థం కాలేదు. మరోవైపు ఆ వ్యక్తిని చూస్తే గాయాలు ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. కారు అద్దం కూడా డ్యామేజ్‌ అయింది. దీనికి సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది.

ఈ వీడియో Instagram ఖాతా fun_and_masti_3లో అప్‌లోడ్ చేయబడింది. ఈ వీడియోకి ఇప్పటి వరకు వేల సంఖ్యలో వీక్షణలు, లైక్‌లు వచ్చాయి. దీనిపై నెటిజన్లు రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

అయ్యో పాపం..ఎర అనుకుని ఎగిరే డ్రోన్‌ను మింగేసిన మొసలి..! ఆ తర్వాత
అయ్యో పాపం..ఎర అనుకుని ఎగిరే డ్రోన్‌ను మింగేసిన మొసలి..! ఆ తర్వాత
టీ20ల్లో అదరగొట్టిన ముగ్గురు ప్లేయర్లు.. లిస్టులో మనోడు
టీ20ల్లో అదరగొట్టిన ముగ్గురు ప్లేయర్లు.. లిస్టులో మనోడు
ఎంతటి డిప్రెషన్‌ అయినా తగ్గించే ఫుడ్స్ ఇవే.. డోంట్ మిస్..
ఎంతటి డిప్రెషన్‌ అయినా తగ్గించే ఫుడ్స్ ఇవే.. డోంట్ మిస్..
మహిళలకు ఉచిత బస్ పథకంపై కీలక అప్‌డేట్
మహిళలకు ఉచిత బస్ పథకంపై కీలక అప్‌డేట్
ఇద్దరు పిల్లల తండ్రిని ప్రేమించిన ముగ్గురు పిల్లల తల్లి.. చివరకు
ఇద్దరు పిల్లల తండ్రిని ప్రేమించిన ముగ్గురు పిల్లల తల్లి.. చివరకు
బాలీవుడ్‌లోకి కీర్తి సురేశ్ ఎంట్రీ.. రెమ్యునరేషన్ ఎంతంటే?
బాలీవుడ్‌లోకి కీర్తి సురేశ్ ఎంట్రీ.. రెమ్యునరేషన్ ఎంతంటే?
ఇన్‏స్టాలో ఆ ఒక్కరినే ఫాలో అవుతున్న శివకార్తికేయన్.. ఎవరంటే..
ఇన్‏స్టాలో ఆ ఒక్కరినే ఫాలో అవుతున్న శివకార్తికేయన్.. ఎవరంటే..
చిన్నపండ్లే అని తేలిగ్గా తీసుకోకండి.. తింటే ఎన్నో సమస్యలు పరార్!
చిన్నపండ్లే అని తేలిగ్గా తీసుకోకండి.. తింటే ఎన్నో సమస్యలు పరార్!
హాలో ఫ్రెండ్స్.. నేను ప్రధాని అయితే ఏం చేస్తానో తెలుసా..?
హాలో ఫ్రెండ్స్.. నేను ప్రధాని అయితే ఏం చేస్తానో తెలుసా..?
బాబోయ్.. నాసిరకం ఛార్జింగ్ కేబుల్స్ వాడితే ఇంత ప్రమాదమా?
బాబోయ్.. నాసిరకం ఛార్జింగ్ కేబుల్స్ వాడితే ఇంత ప్రమాదమా?