Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Blade Batch: బెజవాడలో మళ్లీ రెచ్చిపోయిన బ్లేడ్‌ బ్యాచ్.. గంజాయి మత్తులో రూ.100కోసం..

ఎన్ని కఠిన చర్యలు తీసుకుంటున్న గంజాయి ,బ్లెడ్ బ్యాచ్ లో మార్పు రావటం లేదు...ఇప్పటివరకు నగర వ్యాప్తంగా దాదాపు 25 మందిని నగర బహిష్కరణ చేశారు...80 మందికి పైగా గంజాయి బ్లెడ్ బ్యాచ్ పై కేసులు నమోదు చేసి కఠిన ఆంక్షలు అమలు పరుస్తున్నారు...అయినప్పటికీ సిటీ లో ఇలాంటివి జరుగుతూనే ఉన్నాయి...ఇక తాజాగా జరిగిన ఘటనపై

Blade Batch: బెజవాడలో మళ్లీ రెచ్చిపోయిన బ్లేడ్‌ బ్యాచ్.. గంజాయి మత్తులో రూ.100కోసం..
Crime
Follow us
Jyothi Gadda

|

Updated on: May 02, 2023 | 5:23 PM

బెజవాడలో బ్లెడ్ బ్యాచ్ మరోసారి రెచ్చిపోయింది. గంజాయి మత్తులో బ్లెడ్‌ బ్యాచ్‌ చేసిన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. గంజాయి మత్తులో రోడ్డుపై వెళ్తున్న ఓ వ్యక్తిని అడ్డగించి వంద రూపాయలు అడిగి ఇవ్వకపోయే సరికి విచక్షణ రహితంగా పొదునైన ఆయుధంతో దాడి చేసి గాయపరిచారు. పార్వతీపురం కు చెందిన 22 ఏళ్ల హరిప్రసాద్ గత ఏడాదిగా చిన్నపాటి ఉద్యోగాలు చేస్తూ విజయవాడ హాస్టల్ లో ఉంటున్నాడు. గత రొండు నెలలుగా మాచవరంలో ఓ సెలూన్ షాప్ లో పని చేస్తూ హాస్టల్‌లో ఉంటున్నాడు.. సోమవరాం రాత్రి 10 గంటల సమయంలో పని ముగించుకుని రోడ్డుపై వెళ్తుంటే సూర్యారావు పేట పోలీస్ స్టేషన్ పరిధిలోని నైస్ బార్ వద్ద మాస్క్ పెట్టుకున్న గుర్తు తెలియని ఇద్దరు వ్యక్తులు హరి ప్రసాద్ ను అడ్డగించారు…100 రూపాయలు కావాలంటూ డిమాండ్ చేసారు. లేవని చెప్పిన వినలేదు..కనీసం 50 రూపాయలైన ఇవ్వాలంటూ వెంటపడ్డారు. .నా దగ్గర లేవని హరి సమాధానం చెప్పటంతో ఫోన్ ఇవ్వాలంటూ బలవంతం పెట్టారు.

దాంతో వాళ్ళని వెనక్కి నెట్టాడు హరి..ఇక అంతే వారి వద్ద ఉన్న ఓ పదునైన ఆయుధంతో మొఖంపై విచక్షణ రహితంగా దాడి చేసి తీవ్రంగా గాయపరిచి పరారయ్యారు…తీవ్ర గాయాల పాలైన హరి విజయవాడ ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు..దాడి చేసిన వారు గంజాయి మత్తులో ఉన్నారని దారుణంగా దాడి చేసి గాయపరచటంతో పరిస్థితి ఆందోళనకరంగా ఉందని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు.

బెజవాడలో రోడ్డుపై వెళ్తున్న వారిని అడ్డగించి డబ్బులు అడగటం ,ఇవ్వకపోతే దాడి చెయ్యటం ఇదేం మొదటిసారి కాదు గతంలో జమ్మిచెట్టు వద్ద ఉన్న ప్రభుత్వ పాఠశాలలో విధ్యార్దులని సైతం అలానే బెదిరించారు.. మరో పక్క ఇలాంటి అసాంఘీక శక్తులపై ఉక్కుపాదం మోపుతున్నాం అంటున్న పోలీసులు ఎన్ని కఠిన చర్యలు తీసుకుంటున్న గంజాయి ,బ్లెడ్ బ్యాచ్ లో మార్పు రావటం లేదు…ఇప్పటివరకు నగర వ్యాప్తంగా దాదాపు 25 మందిని నగర బహిష్కరణ చేశారు…80 మందికి పైగా గంజాయి బ్లెడ్ బ్యాచ్ పై కేసులు నమోదు చేసి కఠిన ఆంక్షలు అమలు పరుస్తున్నారు…అయినప్పటికీ సిటీ లో ఇలాంటివి జరుగుతూనే ఉన్నాయి…ఇక తాజాగా జరిగిన ఘటనపై కూడా పోలీసులు కేస్ నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు…ఏదైనా జరిగినప్పుడే కాకుండా నగరంలో రాత్రీ పూట గస్తీ పెంచాలని కోరుతున్నారు నగరవాసులు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..