Watch: నదిలో దాక్కున్న మొసలి..! ఒడ్డునే దాహం తీర్చుకుంటున్న జింక.. ఆ నెక్ట్స్ సీన్ ఊహించలేం కూడా..!
ఈ వీడియోలో దాహం తీర్చుకోవడానికి ఒక జింక నది ఒడ్డుకు చేరింది. దాహంతో ఉన్న జింక నీటిని తాగుతుండగా.. అప్పుడే మొసలి కళ్ళు జింక మీద పడ్డాయి. నీటి అడుగునే మొసలి కనిపించకుండా దాక్కొని దానిని పట్టుకోవడానికి జింక వైపు పరుగెత్తుతుంది.
మొసలి సరీసృపాల కుటుంబానికి చెందిన జంతువు. ఇది నీటిలో, భూమిపై కూడా జీవించగలదు. ఇది సాధారణంగా ఆఫ్రికా, ఆసియా, అమెరికా, ఆస్ట్రేలియా ఖండాలలోని ఉష్ణమండల ప్రాంతాలలో చాలా ఎక్కువగా నివసిస్తుంది. మొసలికి ఇతంగార్, కడు, కరవు, గొత్తికై, చినజుమారం, మకరం, ముసలి అని చాలా పేర్లు పెట్టారు. మొసలి క్రూర జంతువు కూడా. ఇకపోతే, జింక అడవిలో నివసించే ఒక సాధు జంతువు. ఇవి గడ్డి, ఆకులను తినే శాఖాహార జంతువు. మేకలు, ఆవులు వంటి జింకలు రెండు దశల్లో తమ ఆహారాన్ని జీర్ణం చేసే అమ్నియోట్‌ల సమూహానికి చెందినవి. అదేవిధంగా జింకల్లోనూ అనేక రకాలు ఉన్నాయి. భారతదేశంలోని అనేక కొండ ప్రాంతాలలో అనేక రకాల జింకలు కనిపిస్తాయి. ఈ రోజు మనం మొసలి, జింకలకు సంబంధించిన వీడియోను చూడబోతున్నాం. సాధారణంగా ఒక జంతువు నీరు త్రాగడానికి నదికి వెళితే, దానిపై మొసలి దాడి చేయడం చాలా వీడియోలలో చూస్తుంటాం..ఒక్కోసారి మొసలి దాడి నుంచి కొన్ని జంతువులు తప్పించుకుంటే.. చాలా సందర్బాల్లో మొసలి నోటికి చిక్కిన ఏ జంతువులు బతికి బయటపడదు. అలాంటిదే ఈ వీడియో కూడా..
జింకపై మొసలి దాడి చేసిన ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో దాహం తీర్చుకోవడానికి ఒక జింక నది ఒడ్డుకు చేరింది. దాహంతో ఉన్న జింక నీటిని తాగుతుండగా.. అప్పుడే మొసలి కళ్ళు జింక మీద పడ్డాయి. నీటి అడుగునే మొసలి కనిపించకుండా దాక్కొని దానిని పట్టుకోవడానికి జింక వైపు పరుగెత్తుతుంది. కానీ ఇక్కడ సిద్ధంగా ఉన్న జింక మెరుపు వేగంతో పైకెగిరి తప్పించుకుంటుంది. దాదాపు మొసలి నోటికి చిక్కిన జింక తృటిలో ప్రాణాలతో బయటపడింది.
View this post on Instagram
మొసలి, జింకల ఈ వీడియో waowafrica ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో అప్‌లోడ్ చేయబడింది. ఈ వీడియో చూసిన సోషల్ నెటిజన్లు కామెంట్ల రూపంలో రకరకాలుగా తమ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ వీడియోకు ఇప్పటివరకు వేల సంఖ్యలో వ్యూస్, లైక్‌లు వచ్చాయి.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..