Viral Video: మీరు ఎప్పుడైనా పాము ఆవులించడం చూశారా? అది నిజంగా భయానకం..! అరుదైన వీడియో వైరల్‌..

ప్రపంచంలో దాదాపు 3,000 రకాల పాములు ఉన్నాయి. వాటిలో దాదాపు 600 విషపూరితమైనవి. వాటిలో, కేవలం 200 మాత్రమే మనుషులకు హానీ చేస్తుంటాయి. పాముల విషం ఎరను కదలకుండా చేస్తుంది. మాంసాన్ని మింగడం ద్వారా జీర్ణక్రియకు సహాయపడుతుంది. పాములు సాధారణంగా చాలా పిరికిగా ఉంటాయి. ఎప్పుడూ ఎక్కడో ఒక చోట నక్కి దాక్కోవటానికే ప్రయత్నిస్తుంటాయి. అవి వాటంతట అవి ఏ జీవితోనూ పోరాటం చేయవు.

Viral Video: మీరు ఎప్పుడైనా పాము ఆవులించడం చూశారా? అది నిజంగా భయానకం..! అరుదైన వీడియో వైరల్‌..
Snake (Representative image)
Follow us

|

Updated on: May 03, 2023 | 3:23 PM

పాములు పాకడం మనం తరచుగా చూస్తూనే ఉంటాం. అయితే పాము ఆవులించడం ఎప్పుడైనా చూశారా? అంటే దాదాపు ఎవరూ చూడలేదనే అంటారు. అయితే, భూమిపై కొన్ని జంతువులను చూస్తే మనకు భయం కలుగుతుంది. ఏనుగులు, సింహాలు, పులులతో పాటు చాలా మందికి పాములంటే భయం. పామును దేవతగా పూజించినా.. ప్రత్యక్షంగా పామును చూస్తే మాత్రం హడలెత్తిపోతారు. మనం సాధారణంగా కుబుసం అని పిలిచే పాము చర్మాన్ని చాలా సార్లు చూసే ఉంటాం.. పాము డ్యాన్స్ చేయటం కూడా చూసే ఉంటారు. అలాగే, కొన్ని కొన్ని సార్లు జంట పాముల సయ్యాటలు కూడా చూస్తుంటాం. అయితే, పాము ఆవులించడం మనం చూడలేదు కదా.. కానీ, ఇక్కడ పాము ఆవులించిన వీడియో ఒకటి సోషల్ మీడియలో హల్‌చల్‌ చేస్తోంది.

పాముల గురించి ఆసక్తికరమైన విషయాలు ..

పాములు సాధారణంగా చాలా పిరికిగా ఉంటాయి. ఎప్పుడూ ఎక్కడో ఒక చోట నక్కి దాక్కోవటానికే ప్రయత్నిస్తుంటాయి. అవి వాటంతట అవి ఏ జీవితోనూ పోరాటం చేయవు.

ఇవి కూడా చదవండి

పాములు అవి తమ ప్రాణ రక్షణలో భాగంగా బుసలు కొడుతుంటాయి. క్రిమి కీటకాదులను వేటాండేందుకు మాత్రమే పాములు దాడి చేస్తాయి.

సంభోగం సమయంలో తప్ప, పాములు ఎక్కువగా ఒంటరిగా ఉంటాయి.

ప్రపంచంలో దాదాపు 3,000 రకాల పాములు ఉన్నాయి. వాటిలో దాదాపు 600 విషపూరితమైనవి. వాటిలో, కేవలం 200 మాత్రమే మనుషులకు హానీ చేస్తుంటాయి.

పాముల విషం ఎరను కదలకుండా చేస్తుంది. మాంసాన్ని మింగడం ద్వారా జీర్ణక్రియకు సహాయపడుతుంది.

పాములు తమ నాలుకపై వాసన చూసి ఏ దిక్కు నుంచి వస్తున్నాయో కూడా చెప్పగలవు. ఇవి సూర్యునిపై ఆధారపడి ఉంటాయి. వేడి లేకుంటే వాటి ఆహారాన్ని జీర్ణం చేసుకునే శక్తి ఉండదు. పాములకు కంటి చూపు ఉండదు.

పాములు ఇతర జంతువులలాగే ఉంటాయి. ప్రపంచం ప్రతి జీవికి చెందినదని గుర్తుంచుకోండి.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..