Kohli vs Gambhir: ‘నా ప్లేయర్‌ని అంటే, నా ఫ్యామిలీని టచ్ చేసినట్లే’.. తెరపైకొచ్చిన గంభీర్, కోహ్లీ మాటల యుద్ధం..

IPL 2023: విరాట్ కోహ్లి, గౌతమ్ గంభీర్ మధ్య గొడవకు అసలు కారణం తెరపైకి వచ్చింది. ఎకానా స్టేడియంలో కోహ్లీ, గంభీర్ మధ్య జరిగిన పోరు చర్చనీయాంశంగానే ఉంది.

Kohli vs Gambhir: 'నా ప్లేయర్‌ని అంటే, నా ఫ్యామిలీని టచ్ చేసినట్లే'.. తెరపైకొచ్చిన గంభీర్, కోహ్లీ మాటల యుద్ధం..
Kohli Vs Gambhir
Follow us
Venkata Chari

|

Updated on: May 03, 2023 | 3:57 PM

Gautam Gambhir vs Virat Kohli IPL 2023: లక్నో సూపర్ జెయింట్స్ వర్సెస్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య మ్యాచ్ సందర్భంగా విరాట్ కోహ్లీ, నవీన్-ఉల్-హక్ మధ్య వాగ్వాదం జరిగిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత కోహ్లీ, గౌతమ్ గంభీర్ మధ్య వాగ్వాదంతో సీన్ హీట్ ఎక్కింది. గంభీర్, కోహ్లి మధ్య పోరు ఇప్పటికీ వార్తల్లో నిలుస్తోంది. ఇప్పుడు ఈ విషయంలో కొత్త అప్‌డేట్ వచ్చింది. నివేదిక ప్రకారం, కోహ్లి దూకుడును చూసిన గంభీర్ అతని వైపుకు వెళ్లి ఒక ప్రశ్న అడిగాడు. దీనిపై కోహ్లీ స్పందిస్తూ.. నేను మిమ్మల్ని ఏమీ అనలేదు అంటూ ఆన్సర్ చేశాడు. ఆ తర్వాత అసలు కథ మొదలైంది. దీంతో ఆటగాళ్లు సహనం కోల్పోయారు. దీంతో ఇరజట్లలోనూ ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

లక్నోలోని ఎకానా స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో కోహ్లీ చాలా దూకుడుగా సంబరాలు చేసుకున్నాడు. గౌతమ్ గంభీర్‌కు ఈ పద్ధతి నచ్చలేదు. ఆ తర్వాత మ్యాచ్‌లో నవీన్-ఉల్-హక్, అమిత్ మిశ్రాలతో వాగ్వాదం జరిగింది. మ్యాచ్ ముగిసిన తర్వాత గంభీర్, కోహ్లీ మధ్య మాట పెరిగింది. ఇన్‌సైడ్ స్పోర్ట్‌లో ప్రచురించిన ఒక నివేదిక ప్రకారం, గంభీర్ కోహ్లీని “నువ్వు ఏం మాట్లాడుతున్నావ్?” అంటూ అడగగా.. ఆ తర్వాత “నేను మీతో ఏం చెప్పలేదు, మీరు ఎందుకు ప్రవేశిస్తున్నారు?” అంటూ విరాట్ బదులిచ్చాడు.

కోహ్లి సమాధానం తర్వాత, గంభీర్ కోపంగా స్పందిస్తూ, “మా ప్లేయర్‌ని అంటే మా ఫ్యామిలీని అన్నట్లే)” అంటూ కోపగించాడు. దీనికి కోహ్లీ, “మీ కుటుంబాన్ని మీరు జాగ్రత్తగా చూసుకోండి” అంటూ ఘాటుగానే జవాబిచ్చాడు. ఆ తర్వాత గంభీర్ “నువ్వు నాకు బోధిస్తున్నావా” అంటూ ఘాటుగా రిప్లై ఇచ్చాడు.

ఇవి కూడా చదవండి

విరాట్ కోహ్లీ, గౌతమ్ గంభీర్ మధ్య వివాదంపై కఠిన చర్యలు తీసుకోవడం గమనార్హం. కోహ్లి, గంభీర్‌ల మ్యాచ్ ఫీజు మొత్తం కోత విధించారు. దీంతో కోహ్లీకి దాదాపు రూ.1.07 కోట్ల నష్టం వాటిల్లింది. మరోవైపు గంభీర్ కూడా లక్షల్లో నష్టపోయాడు. నవీన్-ఉల్-హక్ మ్యాచ్ ఫీజులో 50 శాతం జరిమానా విధించారు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

అశ్విన్‌కు షాకిచ్చిన ఆ ఇద్దరు.. రిటైర్మెంట్ చేసిన 2 వారాల్లోనే
అశ్విన్‌కు షాకిచ్చిన ఆ ఇద్దరు.. రిటైర్మెంట్ చేసిన 2 వారాల్లోనే
ఈ ఏడు గర్రాల చిత్రం మీ ఇంట్లో ఉంటే ఎన్ని లాభాలో తెలుసా..?
ఈ ఏడు గర్రాల చిత్రం మీ ఇంట్లో ఉంటే ఎన్ని లాభాలో తెలుసా..?
Team India Captain: టీమిండియా తదుపరి కెప్టెన్‌గా ఆయన ఫిక్స్?
Team India Captain: టీమిండియా తదుపరి కెప్టెన్‌గా ఆయన ఫిక్స్?
అందుకే రహస్యంగా SSMB29 పూజా.. బాలీవుడ్ సాయి పల్లవి మరో సినిమా..
అందుకే రహస్యంగా SSMB29 పూజా.. బాలీవుడ్ సాయి పల్లవి మరో సినిమా..
సూపర్ సీక్రెట్.. రైస్ వాటర్‌తో జుట్టు సమస్యలన్నింటికీ చెక్.. ఇలా
సూపర్ సీక్రెట్.. రైస్ వాటర్‌తో జుట్టు సమస్యలన్నింటికీ చెక్.. ఇలా
యశ్ బర్త్ డే రోజున 'టాక్సిక్' నుంచి బిగ్ సర్ ప్రైజ్..
యశ్ బర్త్ డే రోజున 'టాక్సిక్' నుంచి బిగ్ సర్ ప్రైజ్..
ఛాంపియన్స్ ట్రోఫీ నుంచి శాంసన్ ఔట్.. కారణం ఏంటంటే?
ఛాంపియన్స్ ట్రోఫీ నుంచి శాంసన్ ఔట్.. కారణం ఏంటంటే?
దేశంలో పెరుగుతోన్న HMPV కేసులు.. గుజరాత్‌లో కూడా ఓ పాపకు పాజిటివ్
దేశంలో పెరుగుతోన్న HMPV కేసులు.. గుజరాత్‌లో కూడా ఓ పాపకు పాజిటివ్
బాబోయ్‌ ఇదేం రద్దీరా సామీ..! అందమైన నగరాన్ని నరకంలా మార్చేశారుగా
బాబోయ్‌ ఇదేం రద్దీరా సామీ..! అందమైన నగరాన్ని నరకంలా మార్చేశారుగా
ప్రశాంత్ కిషోర్ దీక్ష భగ్నం.. ఆస్పత్రికి తరలించిన పోలీసులు
ప్రశాంత్ కిషోర్ దీక్ష భగ్నం.. ఆస్పత్రికి తరలించిన పోలీసులు